Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) సినిమాపై కామెంట్స్ తో జాన్వీ కపూర్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడింది. పెద్ది సినిమాకు సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు తాజాగా తన బంధువు, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
తమిళ సినిమాల జపం

బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ సడెన్ గా తమిళ సినిమాల జపం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో ఆమె కోలీవుడ్ ఫేవరెట్ డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ.. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన తదుపరి ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తారా అని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. దీంతో జాన్వీ కపూర్ త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టనుందనే వార్తలకు బలం చేకూరినట్లయింది.
'బ్లాస్ట్' మూవీ చూశా
ఇక తాను రీసెంట్ గా చూసిన తమిళ సినిమా గురించి చెబుతూ.. యాక్షన్ కింగ్ అర్జున్, యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్లాస్ట్' (Blast) మూవీ అని జాన్వీ బదులిచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు చూస్తారని అనుకుంటారు. కానీ జాన్వీ ఇలాంటి ఒక కంటెంట్ ఓరియెంటెడ్ చిన్న సినిమా పేరు చెప్పడం విశేషం.
అంతేకాకుండా సాయి అభ్యంకర్, ప్రీతి ముకుందన్ కాంబినేషన్ లో వచ్చిన హిట్ సాంగ్ గురించి కూడా జాన్వీ ప్రత్యేకంగా మాట్లాడింది. దీంతో సోషల్ మీడియాలో 'బ్లాస్ట్' సినిమాకు, హీరోయిన్ ప్రీతి ముకుందన్ కు మళ్లీ సరికొత్త అటెన్షన్ దక్కింది. అలాగే కోలీవుడ్ లో తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన 'పోకిరి' (Pokkiri) అని చెప్పి తమిళ ఫ్యాన్స్ మనసు కూడా దోచుకుంది.
టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్..
జాన్వీ కపూర్ సడెన్ గా తమిళ తంబీలపై ఈ రేంజ్ లో ప్రేమ కురిపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా జాన్వీ పాత్రకు పెద్దగా మైలేజ్ రాలేదు. ఇక తాజాగా పెద్ది కాంట్రవర్సీలతో టాలీవుడ్ లో ఆమెకు డోర్స్ క్రమంగా మూసుకుపోతున్నాయనే నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
{{/usCountry}}జాన్వీ కపూర్ సడెన్ గా తమిళ తంబీలపై ఈ రేంజ్ లో ప్రేమ కురిపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా జాన్వీ పాత్రకు పెద్దగా మైలేజ్ రాలేదు. ఇక తాజాగా పెద్ది కాంట్రవర్సీలతో టాలీవుడ్ లో ఆమెకు డోర్స్ క్రమంగా మూసుకుపోతున్నాయనే నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
{{/usCountry}}అందుకే పరిస్థితిని ముందే పసిగట్టిన జాన్వీ.. ఇప్పుడు తన టార్గెట్ ను కోలీవుడ్ వైపు మళ్లించిందని టాక్ నడుస్తోంది. ఏదేమైనా కోలీవుడ్ స్టార్స్, డైరెక్టర్లను పొగుడుతూ అక్కడ అవకాశాలు దక్కించుకునేందుకు జాన్వీ వేసిన స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.