...
...
Next Story

Janhvi Kapoor: రామ్ చ‌ర‌ణ్‌తో అలా చేస్తే హాఫ్ డేలోనే స‌న్న‌బ‌డ‌తారు.. జాన్వీ క‌పూర్ వెయిట్ లాస్ టిప్‌.. కామెంట్లు వైర‌ల్

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. తాజాగా బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: May 26, 2026, 06:12:28 IST
Advertisement

Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. రీసెంట్‌గా భోపాల్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్ తర్వాత, తాజాగా పెద్ది టీమ్ కర్ణాటక రాజధాని బెంగళూరులో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

జాన్వీ కపూర్ కామెంట్లు

పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ వెయిట్ లాస్ టిప్ (PTI)
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ వెయిట్ లాస్ టిప్ (PTI)

బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ సందడి చేశారు. 'దేవర' సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

తాజాగా పెద్ది ప్రమోషన్ ఈవెంట్లో జాన్వీ కపూర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల కోసం ఒక బెస్ట్ వెయిట్ లాస్ టిప్ చెప్తానంటూ ఆమె నవ్వులు పూయించింది.

రామ్ చరణ్ తో అలా

"మీకు అందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన వెయిట్ లాస్ టిప్ చెప్పనా? రామ్ చరణ్ సార్‌తో కలిసి ఒక పాటలో డ్యాన్స్ చేయండి. కేవలం హాఫ్ డేలోనే మీరంతా సన్నబడటం గ్యారెంటీ. మేము షూట్ చేసిన ప్రతి పాటను కనీసం మూడు నుంచి నాలుగు రోజుల పాటు చిత్రీకరించారు.

చరణ్ సార్ ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ స్టెప్పులు వేయడం మామూలు విషయం కాదు. కేవలం నేను మాత్రమే కాదు, మా వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ అందరూ కూడా ఈ పాటల షూటింగ్ సమయంలో బాగా బరువు తగ్గారు" అని జాన్వీ కపూర్ సరదాగా పేర్కొంది.

హెల్లాల్లల్లో

పెద్ది చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్ర పోషించిన కన్నడ కంఠీరవ, సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్.. రామ్ చరణ్ నటనపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ కనబరిచిన నటనకు, పడిన కష్టానికి కచ్చితంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు (National Award) వస్తుందని ఆయన జోస్యం చెప్పాడు. చరణ్ కష్టపడే తత్వం, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శివన్న కొనియాడాడు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'పెద్ది' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

జవాబు: రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రశ్న: 'పెద్ది' సినిమాలో హీరోయిన్ ఎవరు?

జవాబు: ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్. తెలుగులో ఆమెకు ఇది రెండవ చిత్రం.

ప్రశ్న: 'పెద్ది' చిత్రానికి సంగీతం అందించింది ఎవరు?

జవాబు: ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe