OTT: బాలనటిగా క్రేజ్, ఖాన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్- ఏడేళ్లకు ఓటీటీతో ఎంట్రీ ఇస్తున్న 24 ఏళ్ల బ్యూటీ- ఆమె ఎవరు? ఎక్కడంటే?
Jannat Zubair OTT Entry With Glory Web Series: బాలనటిగా మెప్పించి, సోషల్ మీడియాలో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్న జన్నత్ జుబేర్ ఏడేళ్ల తర్వాత ఓటీటీతో ఎంట్రీ ఇవ్వనుంది. సదరు దిగ్గజ ఓటీటీ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్లోరీ సిరీస్‌లో జన్నత్ కీలక పాత్ర పోషించనుంది. పూర్తి వివరాలు చూస్తే..!
Jannat Zubair OTT Entry With Glory Web Series: బాలీవుడ్ బాలనటిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జన్నత్ జుబేర్ రహ్మానీ.. ఏడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఓటీటీ సిరీస్‌తో డెబ్యూ ఎంట్రీ ఇస్తోంది. హర్యానాలోని బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఓటీటీ స్పోర్ట్స్ డ్రామా 'గ్లోరీ'లో జన్నత్ జుబేర్ నటిస్తోంది. పుల్కిత్ సామ్రాట్, దివ్యేందు వంటి ప్రతిభావంతులైన నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ 24 ఏళ్ల బ్యూటీ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిందని చిత్ర బృందం చెబుతోంది.

సోషల్ మీడియా క్రేజ్ కాదు.. నటన చూసే అవకాశం
జన్నత్ జుబేర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్ అగ్ర హీరోలు ఖాన్ల కంటే కూడా జన్నత్ జుబేర్‌కు సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషం. అయితే, ఆమెకున్న ఈ ఫాలోయింగ్‌ను చూసి 'గ్లోరీ'లో అవకాశం ఇవ్వలేదని షో రన్నర్ కరణ్ అన్షుమన్ స్పష్టం చేశారు. హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన ఆయన, కేవలం ఆడిషన్ ఆధారంగానే జన్నత్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
"సోషల్ మీడియాలో ఉన్న నంబర్ల ఆధారంగా మేము ఎవరినీ ఎంపిక చేయం. అది మా పద్ధతి కాదు. ఎవరైనా సరే ఆడిషన్‌లో తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిందే. జన్నత్ ఆడిషన్ చూసి నేను షాక్ అయ్యాను. అద్భుతంగా నటించింది. ఆమెకు కోట్లాదిమంది ఫాలోవర్లు ఉన్నారనే విషయం నాకు ఆ తర్వాతే తెలిసింది. అది షోకి ప్లస్ అవుతుందన్నది నిజమే అయినా, మాకు మాత్రం ఆమె నటనపై ఉన్న పట్టు మాత్రమే ముఖ్యం" అని కరణ్ అన్షుమన్ వివరించారు.
అనుభవజ్ఞులతో పోటీ పడి..
చిన్నతనంలోనే 'హిచ్కీ', 'ఫుల్వా', 'మహారాణా ప్రతాప్' వంటి ప్రాజెక్టులతో పేరు తెచ్చుకున్న జన్నత్ జుబేర్ సెట్స్‌లో ఎంతో ప్రొఫెషనల్‌గా ఉండేదని కరణ్ ప్రశంసించారు. షూటింగ్ సమయంలో ఆమె ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండేదో చెప్పారు.
"ఈ తరం నటుల్లో ఉన్న ఆత్మవిశ్వాసం నన్ను ఆశ్చర్యపరిచింది. సువిందర్ విక్కీ వంటి సీనియర్లతో కలిసి నటిస్తున్నప్పుడు కూడా ఆమె ఏమాత్రం తడబడలేదు. సీన్ ఎలా చేయాలి అనే విషయంలో ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. కొన్నిసార్లు ఆమె సూచనలే కరెక్ట్ అనిపించి, నా నిర్ణయాన్ని కూడా మార్చుకున్నాను. ఆమెతో పనిచేయడం నాకు కూడా ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్" అని ఆయన పేర్కొన్నారు.
'గ్లోరీ' కథా నేపథ్యం ఏంటి?
ఇది కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో ఒక మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉంది. హర్యానా బాక్సింగ్ ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ కథలో పుల్కిత్ సామ్రాట్, దివ్యేందు సోదరులుగా నటిస్తున్నారు.
వీరి సోదరిగా జన్నత్ జుబేర్ కనిపిస్తుంది. ఆమెకు ఒక ప్రమాదం జరగడంతో ఊరు విడిచి వెళ్లిన సోదరులు తిరిగి రావడం, ఆ తర్వాత జరిగే పరిణామాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ షోలో సికందర్ ఖేర్, అశుతోష్ రాణా, సయానీ గుప్తా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మే 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ గ్లోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఓటీటీతో ఏడేళ్లకు రీ ఎంట్రీ ఇస్తోంది జన్నత్ జుబేర్ రహ్మానీ.

ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


