January 12 Vidudala: అనిల్ రావిపూడా మజాకా? తన సినిమాలతోనే కాదు టైటిల్స్ తోనూ అభిమానులను అలరించే ఈ డైరెక్టర్.. తన నెక్ట్స్ మూవీకి కూడా క్రేజీ టైటిల్ పెట్టారు. జనవరి 12 విడుదల అనే టైటిల్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఎవరి ఊహకూ అందని విధంగా సరికొత్త టైటిల్ తో అనిల్ రావడం విశేషం.
జనవరి 12 విడుదల.. ఇదీ మూవీ టైటిల్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ టైటిల్ ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే మైండ్ బ్లాకింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ చిత్రానికి ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాచీ సబ్‌టైటిల్‌ను జతచేయడం విశేషం. టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం అనిల్ రావిపూడి డిజైన్ చేసిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
దిగ్గజ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ కామెడీ క్లాసిక్ ‘అప్పుల అప్పారావు’ మూవీ ఐకానిక్ సీన్‌తో ప్రారంభమైన ఈ ప్రమోషనల్ వీడియో ఆద్యంతం నవ్వులు పూయించింది. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి అందరూ సినిమా టైటిల్ ఏంటని డైరెక్టర్‌ను అడుగుతుంటే.. అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ అని మళ్ళీ మళ్ళీ చెబుతుంటారు.
అది కేవలం రిలీజ్ డేట్ అనుకుని హీరోలు, హీరోయిన్లు కన్ఫ్యూజ్ కాగా.. చివరికి అసలు ఆ సినిమా పేరే ‘జనవరి 12 విడుదల’ అని, ఆ రోజే థియేటర్లలోకి వస్తోందని వెంకీ క్లారిటీ ఇవ్వడం ఫన్నీగా సాగింది.
సంక్రాంతి సెంటిమెంట్.. అనిల్ రావిపూడి బాక్సాఫీస్ మ్యాజిక్
సంక్రాంతి సీజన్ అంటేనే అనిల్ రావిపూడికి తిరుగులేని బాక్సాఫీస్ రికార్డ్ ఉంది. గతంలో ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్బస్టర్లతో సంక్రాంతి పండుగ వద్ద భారీ వసూళ్లు సాధించారు.
{{/usCountry}}సంక్రాంతి సీజన్ అంటేనే అనిల్ రావిపూడికి తిరుగులేని బాక్సాఫీస్ రికార్డ్ ఉంది. గతంలో ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్బస్టర్లతో సంక్రాంతి పండుగ వద్ద భారీ వసూళ్లు సాధించారు.
{{/usCountry}}ఇప్పుడు వెంకటేష్‌తో ఐదోసారి, కళ్యాణ్ రామ్‌తో రెండోసారి కలిసి చేస్తున్న ఈ సినిమాను కూడా పక్కా పండుగ కానుకగా 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈసారి కూడా బావా-బామ్మర్దుల సరదా కాన్సెప్ట్‌తో ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేశారు.
బిగ్ కాస్టింగ్.. క్రేజీ టెక్నికల్ టీమ్
ఈ భారీ మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్, గ్లామరస్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరి క్యారెక్టర్లు కూడా కథలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయని సమాచారం.
ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రావిపూడి సినిమాల్లో ఉండే ఎనర్జిటిక్ సాంగ్స్, మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు జాయింట్‌గా సమర్పిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మల్టీస్టారర్ మూవీ సంక్రాంతి రేసులో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.