...
...
Next Story

JD Chakravarhty: నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ ను చూడలేదు-జేడీ చక్రవర్తి కామెంట్స్-ఇంట్లోకి వస్తామంటున్న మెగా డాటర్!

JD Chakravarhty: మెగా డాటర్, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెలపై జేడీ చక్రవర్తి ప్రశంసలు కురిపించారు. నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ ను తన కెరీర్ లోనే చూడలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. పాకెట్ రాకెట్స్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో జేడీ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Published on: Nov 4, 2026, 12:50:19 IST
Advertisement

JD Chakravarhty: మెగా డాటర్ నిహారిక కొణిదెల జోరుమీదున్నారు. ప్రొడ్యూసర్ గా వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న నిహారిక ఇప్పుడు కంటిన్యూగా మూవీస్ ను ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఆమె నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘పాకెట్ రాకెట్స్’. ఈ చిత్రం డిసెంబర్ 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు.

పాకెట్ రాకెట్స్ టీజర్

నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ ను చూడలేదు-జేడీ చక్రవర్తి కామెంట్స్-ఇంట్లోకి వస్తామంటున్న మెగా డాటర్!
నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ ను చూడలేదు-జేడీ చక్రవర్తి కామెంట్స్-ఇంట్లోకి వస్తామంటున్న మెగా డాటర్!

గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ పాకెట్ రాకెట్స్ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు.

ఇంట్లోకి వచ్చేస్తాం

పాకెట్ రాకెట్స్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ చిత్రాన్ని జులైలో ప్రారంభించాం. రుద్రతో మాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అంజి, ఏసు, జేడీ గారి పాత్రలు అద్భుతంగా ఉంటాయి.

ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది. ఇక రిలీజ్ వరకు మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం’ అని అన్నారు.

నిహారిక లాంటి ప్రొడ్యూసర్

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్‌ని చూడలేదు. ఈ సినిమా స్కేల్‌ని మన్యం రమేష్ పెంచారు. రుద్ర ఏం తీశారు, ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లోనే చూసి తెలుసుకోండి’ అని అన్నారు.

నిహారిక ప్రొడ్యూసర్ గా సక్సెస్ బాటలో సాగిపోతున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీతో ప్రొడ్యూసర్ గా నిహారిక మారారు. ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రాకాసతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు పాకెట్ రాకెట్స్ తీసుకొస్తున్నారు. అలాగే తన అన్నయ్య వరుణ్ తేజ్ తో బరి మూవీని నిర్మిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks