JD Chakravarthy: ఆ నటుడికి ఇండియాలో గొప్ప రెస్పెక్ట్- కానీ తాగింది దిగలేదంటూ-అక్రమ సంబంధం-జేడీ చక్రవర్తి సంచలన కామెంట్లు

JD Chakravarthy: ఒకప్పుడు మంచి హీరోగా సక్సెస్ అందుకున్న జేడీ చక్రవర్తి.. ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. తాజాగా గాయపడ్డ సింహం ప్రమోషన్లలో జేడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గొప్ప నటుడి గురించి షాకింగ్ విషయాలు చెప్పాడు. 

Published on: Apr 30, 2026, 13:05:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

JD Chakravarthy: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలు చేస్తు సాగిపోతున్నాడు ఒకప్పటి హీరో జేడీ చక్రవర్తి. ఈ మధ్య సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. తాజాగా గాయపడ్డ సింహం మూవీలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ పాడ్ కాస్ట్ లో జేడీ చక్రవర్తి సంచలన కామెంట్లు చేశాడు.

జేడీ చక్రవర్తి (x)
జేడీ చక్రవర్తి (x)

జేడీ చక్రవర్తి కామెంట్లు

గాయపడ్డ సింహం ప్రమోషన్లతో జేడీ చక్రవర్తిగా బిజీగా ఉన్నాడు. తాాజగా ఓ పాడ్ కాస్ట్ లో అతను చేసిన కామెంట్లు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇండియా గౌరవించే ఓ గొప్ప నటుడు బయట ఎలా ఉన్నాడోననే షాకింగ్ విషయాలను జేడీ చక్రవర్తి చెప్పాడు.

చాలా రెస్పెక్ట్

‘‘అసలు విషయం తెలుసుకోకుండా ఎవరిపైనా అయినా గౌరవం పెంచుకోవద్దు. ఇంప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఉన్న ఓ యాక్టర్ ఉన్నాడు. అతని పేరు చెప్పను. ఆంధ్ర దేశానికి, తెలంగాణకే కాదు ఇండియాకు కూడా ఓ గొప్ప రెస్పెక్ట్ ఉన్న మనిషి ఆయన. రియల్ లైఫ్ లోనూ అలాగే ఉంటారని నేను ఎక్స్ పెక్ట్ చేశా’’ అని జేడీ చక్రవర్తి తెలిపాడు.

తాగింది దిగలేదని

జేడీ చక్రవర్తి ఊహించినట్లుగా నిజ జీవితంలో ఆ నటుడు లేడని అతను తెలిపాడు. ‘‘ఆయన షూటింగ్ కు కొంచెం లేటుగా వస్తారని అన్నారు. ఎందుకంటే, తాగింది దిగలేదన్నారు. తాగుతారా? అని అడిగా. అవునని అన్నారు. అలాగే హోటల్లో లేరని చెప్పారు. అప్పటికే అతను ఓల్డ్ మ్యాన్. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారని అన్నారు. పెళ్లయింది కదా అని అడిగా. అవును, కానీ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారని చెప్పారు. ఆయన ఇమేజ్ ను బట్టి మహానుభావుడని అనుకున్నా’’ అని జేడీ చక్రవర్తి సంచలన విషయాలు బయటపెట్టాడు.

ఎవరా నటుడు?

జేడీ చక్రవర్తి కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. దీంతో ఎవరా గొప్ప నటుడు? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇన్ని విషయాలు చెప్పిన జేడీ చక్రవర్తి, ఆ నటుడి పేరు మాత్రం చెప్పలేదు.

గాయపడ్డ సింహం గురించి

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ‘గాయపడ్డ సింహం’. ఇందులో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లు. ఈ చిత్రానికి కశ్యప్ డైరెక్టర్. జేడీ చక్రవర్తి ఇందులో కీలక పాత్ర పోషించాడు. గాయపడ్డ సింహం మూవీ మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అమెరికా వెళ్లాలనుకుడే యువకుడికి ఎదురయ్యే పరిస్థితులను ఇందులో ఫన్నీగా చూపించారని తెలిసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More