...
...
Next Story

JD Chakravarthy: ఈ సినిమా వల్ల కమల్ హాసన్‌కు కూడా దొరకని ఛాన్స్ నాకు దొరికింది.. అలాంటి పాత్ర నాది: జేడీ చక్రవర్తి

JD Chakravarthy: విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న తాజా మూవీ ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నటనలో అసాధ్యుడైన కమల్ హాసన్ కూడా చేయని ప్రయోగాన్ని తాను ఈ సినిమాలో చేశానని జేడీ సంచలన ప్రకటన చేశారు.

Published on: Apr 23, 2026, 22:09:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

JD Chakravarthy: తెలుగు చిత్ర పరిశ్రమలో జేడీ చక్రవర్తి అంటేనే ఒక విభిన్నమైన ముద్ర. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈ నటుడు.. ‘శివ’ కాలం నుండి నేటి వరకు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన తన ముద్ర వేశారు.

JD Chakravarthy: ఈ సినిమా వల్ల కమల్ హాసన్‌కు కూడా దొరకని ఛాన్స్ నాకు దొరికింది.. అలాంటి పాత్ర నాది: జేడీ చక్రవర్తి
JD Chakravarthy: ఈ సినిమా వల్ల కమల్ హాసన్‌కు కూడా దొరకని ఛాన్స్ నాకు దొరికింది.. అలాంటి పాత్ర నాది: జేడీ చక్రవర్తి

తాజాగా ఆయన ‘గాయపడ్డ సింహం’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జేడీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కమల్ హాసన్ గారికే సవాల్..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు లోకనాయకుడు కమల్ హాసన్. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే కమల్ హాసన్ గురించి జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నటనలో కమల్ హాసన్ గారు నాకు ఇన్‌స్పిరేషన్. ఆయన చేయని ప్రయోగం అంటూ ఉండదు. కానీ ‘గాయపడ్డ సింహం’ సినిమాలో ఒక నటుడిగా నేను సాధించినది, కమల్ గారు కూడా ఇప్పటివరకు చేయలేకపోయారు” అని జేడీ ధీమా వ్యక్తం చేశారు. ఇది వినడానికి అతిశయోక్తిలా అనిపించినా, సినిమాలో తన పాత్రను చూశాక అందరూ ఆ మాటను ఒప్పుకుంటారని ఆయన వివరించారు.

ఏమిటా ప్రత్యేక ప్రయోగం?

ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర చాలా ప్రత్యేకమని జేడీ చక్రవర్తి వెల్లడించాడు. ఒక పాత్రకు రెండు షేడ్స్ ఉండటం, ఫస్ట్ హాఫ్ లో ఒకలా, సెకండాఫ్ మరోలా ఉండటం కామనే అని.. కానీ ఈ మూవీలో తాను పోషించిన ధర్మ పాత్ర మాత్రం ఒకేసారి రెండు షేడ్స్ చూపిస్తుందని అనడం విశేషం.

తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన ‘గాయపడ్డ సింహం’ కేవలం ఒక రెగ్యులర్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదని, ఇందులో సైకలాజికల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని జేడీ తెలిపారు.

ఈ సినిమాలో తరుణ్ గాయపడ్డాడని, తాను గాయపడ్డానని, మరో సింహం కూడా గాయపడిందని, అది ఎవరో త్వరలోనే రివీల్ చేస్తామని చెప్పారు. చాలా కాలం తర్వాత జేడీ చక్రవర్తి ఒక పూర్తిస్థాయి పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తుండటంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కమల్ హాసన్ లాంటి దిగ్గజం కూడా చేయని ఆ ప్రయోగం ఏమిటో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe