Satya: టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో సత్య ఒకరు. సినిమాల్లో బ్రహ్మానందం లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్న వాళ్లలో అతనొకడు. కమెడియన్ గా సినిమాలు చేస్తూనే, ఛాన్స్ దొరికితే హీరోగానూ అదరగొడుతున్నాడు. తాజాగా ‘జెట్లీ’ మూవీతో థియేటర్లకు వచ్చాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫ్యామిలీ గురించి సత్య ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
సత్య కూతురు

మే 1న జెట్లీ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇందులో సత్య హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రమోషన్లలో సత్య అవాక్కయ్యే నిజాలు చెప్పాడు. సత్య, హీరోయిన్ రియా, డైరెక్టర్ రితేశ్ రాణా కలిసి యాంకర్ సుమ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కూతురి గురించి సత్య చెప్పాడు.
9 ఏళ్లు
‘‘మీకు పెళ్లయి, ఇద్దరు పిల్లున్నారు అని వినిపిస్తోంది’’ అని సుమ అడుగుతుంది. ఒక పాప ఉందని సత్య చెప్తాడు. ‘‘పాప ఉందా, నిజమా ఇది? కానీ పాప ఫొటో ఎక్కడా పెట్టలేదా?’’ అని సుమ ఆశ్చర్యపోతూ అడుగుతుంది. ‘‘పెట్టలేదు. నా ఫొటోలే పెట్టను నేను’’ అని సత్య నవ్వేస్తాడు. పాప ఏజ్ ఎంత అని సుమ అడిగే సరికి.. 9 ఏళ్లు అని సత్య చెప్తాడు.
ఆ డైరెక్టర్ పేరు
సత్య కూతురి పేరు వెనకాల ఉన్న కథను కూడా సత్య ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పక్కనే ఉన్న రితేశ్ రాణా ఏమో సత్య పాప గురించి సుమను అడగమంటాడు. సుమ అడుగుతుంది. ‘‘పాప పేరు సుధీర. ఫస్ట్ మూవీ డైరెక్టర్ సుధీర్ వర్మ. అందుకే తన పేరు పెట్టా. నెక్ట్స్ ఇంకొకరు పుడితే రితేశ్ రాణా’’ పేరు పెడతానని సత్య వెల్లడించాడు.
జెట్లీ గురించి
{{/usCountry}}సత్య కూతురి పేరు వెనకాల ఉన్న కథను కూడా సత్య ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పక్కనే ఉన్న రితేశ్ రాణా ఏమో సత్య పాప గురించి సుమను అడగమంటాడు. సుమ అడుగుతుంది. ‘‘పాప పేరు సుధీర. ఫస్ట్ మూవీ డైరెక్టర్ సుధీర్ వర్మ. అందుకే తన పేరు పెట్టా. నెక్ట్స్ ఇంకొకరు పుడితే రితేశ్ రాణా’’ పేరు పెడతానని సత్య వెల్లడించాడు.
జెట్లీ గురించి
{{/usCountry}}రితేశ్ రాణా దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జెట్లీ మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. మూవీ ఎక్కువ భాగం ఓ విమానంలోనే సాగుతుంది.
రూ.15 వేల కోట్ల స్కామ్ చేసిన ఓ బిజినెస్ ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటాడు. అతణ్ని చంపేందుకు శత్రువులు ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో ఆ బిజినెస్ మ్యాన్ ఉన్న విమానంలోకి గతం మర్చిపోయిన హీరో ఎంట్రీ ఇస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే జెట్లీ మూవీ స్టోరీ. కామెడీ లవర్స్ కు ఈ సినిమా మంచి ఎంటర్ టైన్మెంట్ అనే కామెంట్లు వస్తున్నాయి.