ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ రాబరీ థ్రిల్లర్-దొంగతనానికి వెళ్లి లవర్స్‌గా-సూపర్ ట్విస్ట్-ఇక్కడ చూసేయండి
ఇవాళ ఓటీటీలోకి డైరెక్ట్‌గా ఓ అదిరిపోయే మూవీ వచ్చేస్తోంది. రొమాంటిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ సినిమా ఏంటీ? అది ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.
ఓటీటీ ఆడియన్స్ ను డిఫరెంట్ జోనర్లలోని సినిమాలు ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్లకు డిజిటల్ ఆడియన్స్ జై కొడుతుంటారు. ఇప్పుడు అలాంటి మరో సినిమా ఓటీటీలోకి రాబోతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘జింగిల్ బెల్ హీస్ట్’ మూవీ ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉండనుంది. దొంగతనం నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది.

జింగిల్ బెల్ హీస్ట్ ఓటీటీ
ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గా తెరకెక్కిన జింగిల్ బెల్ హీస్ట్ మూవీ బుధవారం (నవంబర్ 26) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియన్ టైమ్ ప్రకారం ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్ కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.
తెలుగులోనూ స్ట్రీమింగ్
జింగిల్ బెల్ హీస్ట్ మూవీ తెలుగులోనూ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ రొమాంటిక్ రాబరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి మైఖేల్ ఫిమోగ్నారి డైరెక్టర్. ఇందులో ఒలీవియా హాల్ట్, కానర్ స్విండెల్స్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
జింగిల్ బెల్ హీస్ట్ స్టోరీ
దొంగతనం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ జింగిల్ బెల్ హీస్ట్. ఇది లండన్ లోని క్రిస్మస్ టైమ్ లో జరిగే కథ. ఇందులో సోఫియా (ఒలీవియా), నిక్ (స్విండెల్స్) కీలక పాత్రలు. ఈ ఇద్దరూ దొంగతనం చేయాలని అనుకుంటారు. డబ్బులు చాలా అవసరం కావడంతో ఒక పెద్ద డిపార్ట్ మెంటల్ స్టోర్ ను క్రిస్మస్ పండగ సమయంలో దొంగిలించాలని అనుకుంటారు.
ఈ ట్విస్ట్
సోఫియా, నిక్ వేర్వేరుగా దొంగతనానికి వెళ్తారు. కానీ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో కలుస్తారు. ఇద్దరూ దొంగతనానికి వచ్చామని తెలుసుకుంటారు. విడిగా రాబరీ చేస్తే దొరికిపోతామని, కలిసే ప్లాన్ చేస్తారు. ముందు నమ్మకం లేకపోయినా తర్వాత వీళ్ల మనసులు కలుస్తాయి. వీళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. మరి లవర్స్ గా మారిన సోఫియా, నిక్ దొంగతనం చేశారా? వాళ్ల జీవితంలోని సమస్యలు ఏంటీ? అన్నవి సినిమాలో చూడాలి.
రాబరీ థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియన్స్ కు జింగిల్ బెల్ హీస్ట్ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. ఇందులోని రొమాంటిక్ యాంగిల్ కూడా ఎంటర్ టైన్ చేయనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


