...
...
Next Story

Thriller Web Series: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హవా.. 6 ఎపిసోడ్లు.. ఊహించని మర్డర్ మిస్టరీ.. మీరు చూశారా?

Thriller Web Series: జియోహాట్‌స్టార్ లో నవంబర్ 13న విడుదలైన 6 ఎపిసోడ్ల సస్పెన్స్ థ్రిల్లర్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' ప్రస్తుతం టాప్ 10 జాబితాలో ట్రెండ్ అవుతోంది. కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'కు స్పిన్-ఆఫ్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ పూర్తి భిన్నంగా, ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ సాగుతుంది.

Published on: Nov 18, 2026, 15:48:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Thriller Web Series: సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్‌లను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల కోసం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఒక ఆసక్తికరమైన సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం 6 ఎపిసోడ్లతో రూపొందిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (Student of the Year: After Dark) నవంబర్ 13న విడుదలైనప్పటి నుంచి జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో దూసుకుపోతోంది.

Thriller Web Series: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హవా.. 6 ఎపిసోడ్లు.. ఊహించని మర్డర్ మిస్టరీ.. మీరు చూశారా?
Thriller Web Series: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హవా.. 6 ఎపిసోడ్లు.. ఊహించని మర్డర్ మిస్టరీ.. మీరు చూశారా?

బాలీవుడ్ స్టార్ కపుల్ సంజయ్ కపూర్, మహీప్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ ఈ సిరీస్ ద్వారా ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె డ్యుయల్ రోల్లో నటించడం విశేషం. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? చూడొచ్చా లేదా అన్నది ఈ రివ్యూలో చూడండి.

రొమాంటిక్ ఫ్రాంచైజీ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వైపు..

2012లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఒక క్యాంపస్ రొమాంటిక్ కామెడీగా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతోనే ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 2019లో టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో సీక్వెల్ వచ్చింది.

అయితే ఈ ఫ్రాంచైజీకి స్పిన్-ఆఫ్‌గా వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' గత చిత్రాలకు పూర్తి భిన్నంగా డార్క్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కింది. రీమా మాయా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, ఆదార్ పూనావాలా, అపూర్వ మెహతా నిర్మించారు.

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్టర్ డార్క్ కథేంటంటే?

సెయింట్ థెరెసాలో ఎంతో పాపులర్ అయిన ఆయేషా (షనాయా కపూర్) అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. క్యాంపస్ సమీపంలోని అడవిలో ఉన్న గడ్డకట్టిన సరస్సులో ఆమె మృతదేహం లభ్యమవుతుంది.

ఈ వార్త తెలిసి షాక్‌కు గురైన ఆయేషా కవల సోదరి అదితి (షనాయా కపూర్), తన సోదరి హత్య వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టేందుకు అదే విద్యాసంస్థలో అడ్మిషన్ తీసుకుంటుంది.

క్యాంపస్‌లో అడుగుపెట్టిన అదితికి ఆయేషా స్నేహితులు, శత్రువులు పరిచయమవుతారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో తెలియని పరిస్థితుల్లో ఆమె ఒక్కో రహస్యాన్ని ఛేదిస్తూ వెళ్తుంది. చివరికి ఆయేషాను ఎవరు, ఎందుకు హత్య చేశారన్నదే అసలు సస్పెన్స్.

ప్లస్ పాయింట్లు, మైనస్‌లు ఏంటి?

మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను కథలో లీనం చేయడంలో దర్శకురాలు రీమా మాయా సఫలమయ్యారు. స్క్రీన్‌ప్లే వేగంగా సాగుతూ తదుపరి ఏం జరుగుతుందన్న ఉత్కంఠను చివరి వరకు నిలబెడుతుంది.

అయితే కథలో కీలకమైన 'సీక్రెట్ కాంపిటీషన్' ఎపిసోడ్లు వచ్చినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కొరియన్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' (Squid Game) ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ పోటీ నియమాలు, కాస్ట్యూమ్స్ విషయంలో మేకర్స్ కొత్తగా ఆలోచించకుండా స్క్విడ్ గేమ్ కాన్సెప్ట్‌ను అనుకరించారనే విమర్శ వినిపిస్తోంది.

నటీనటులు ఎలా నటించారంటే?

తొలి వెబ్ సిరీస్‌లోనే షనాయా కపూర్ కవల సోదరీమణులుగా డబుల్ రోల్‌లో పరిణతితో కూడిన నటనను కనబరిచారు. ఆమెతో పాటు దివిక్ శర్మ, అభినవ్ సింగ్, మాన్యా గ్రోవర్, దియా దామిని, ఆది మాలిక్ కీలక పాత్రల్లో నటించారు.

సీనియర్ నటులు షీబా చద్దా, వివేక్ గోంబర్, నీరజ్ కబీ తమ అనుభవంతో సిరీస్‌కు అదనపు బలాన్ని చేకూర్చారు. వీకెండ్‌లో ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks