Web Series OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీజన్ 2..రెండేళ్ల తర్వాత అనౌన్స్ మెంట్..అనన్య పాండే, శృతి హాసన్ రచ్చ
Web Series OTT: ఓటీటీలోకి మరో బ్లాక్ బస్టర్ సిరీస్ కొత్త సీజన్ రాబోతుంది. అనన్య పాండే ఓటీటీ ఎంట్రీ ఇస్తూ నటించిన ‘కాల్ మీ బే’ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సారి సిరీస్ లోకి శృతి హాసన్ ఎంట్రీ ఉండబోతుంది.
Web Series OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’. 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ కాల్ మీ బే సిరీస్ నుంచి సీజన్ 2 రాబోతుంది. ఈ సీజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

కాల్ మీ బే సీజన్ 2 ఓటీటీ
ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘కాల్ మీ బే’ వెబ్ సిరీస్ సీజన్ 2 గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో అదిరిపోయే అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. కామెడీ, సస్పెన్స్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా తదితర అంశాలతో తెరకెక్కుతున్న కాల్ మీ బే వెబ్ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించింది.
శృతి హాసన్ ఎంట్రీ
కాల్ మీ బే వెబ్ సిరీస్ సీజన్ 2 లో జోష్ ను మరింత పెంచేలా మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ఈ సీజన్ 2లో కీలక పాత్ర పోషించనుందని తెలిసింది. ఈ క్రేజీ సిరీస్ కు కొలిన్ డైరెక్టర్. ధర్మాటిక్ ఎంటర్ టైన్మెంట్స్ పై కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ సీజన్ 1 స్టోరీ ఇదే?
కాల్ మీ బే వెబ్ సిరీస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఢిల్లీలోని ఓ రాజవంశపు కుటుంబానికి చెందిన బెల్లా అలియాస్ బే (అనన్య పాండే) చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఆమెను డబ్బు కోసం ఓ బడా వ్యాపారవేత్తకు ఇచ్చి పెళ్లి చేస్తారు. డబ్బు ఉన్నా బెల్లాకు ప్రేమ మాత్రం దొరకదు.
దీంతో జిమ్ ట్రైనర్ ప్రిన్స్ (వరుణ్ సూద్)తో బెల్లా అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. తన భర్త ఏర్పాటు చేసిన ఓ పెద్ద పార్టీలోనే ప్రిన్స్ ను కిస్ చేస్తూ బే దొరికిపోతుంది. దీంతో ఆమెను ఇంటి నుంచి గెంటేస్తారు.
ముంబయికి వెళ్లిన బే ఓ జర్నలిస్ట్ గా మారుతుంది. మహిళలను వేధించే ఓ పెద్ద మనిషి రహస్యాలను బే బయటపెడుతుంది. దీంతో ఆమెపై అందరికీ మళ్లీ మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది.
రెండో సీజన్ లో ఇలా
కాల్ మీ బే సెకండ్ సీజన్ లో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. తన మాజీ భర్త బే కోసం తిరిగొస్తాడు. మరోవైపు ఆఫీస్ బాస్ పై బేకు ఇష్టం కలుగుతుంది. మరోవైపు కొత్త షో స్టార్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో స్టోరీ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


