Top OTT Releases: నెట్‌ఫ్లిక్స్ టు ఆహా.. ఈ వారం ఓటీటీలో ఆహా అనిపించే టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. క్రేజీ లిస్ట్!

Top OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే. నెట్‌ఫ్లిక్స్, ఆహా, సోనీలివ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న టాప్ రిలీజ్‌లపై ఓ లుక్కేయండి.

Published on: Nov 16, 2026, 14:30:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Top OTT Releases: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ వారం ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 20 నుంచి రెండు క్రేజీ ప్రాజెక్టులు ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో మొదటిది ‘418’. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా స్థాయిలో అలరించనుంది. ఇక రెండోది తమిళ చిత్రం 'హైకూ' (Haiku). శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.

నెట్‌ఫ్లిక్స్ టు ఆహా.. ఈ వారం ఓటీటీలో ఆహా అనిపించే టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. క్రేజీ లిస్ట్!
నెట్‌ఫ్లిక్స్ టు ఆహా.. ఈ వారం ఓటీటీలో ఆహా అనిపించే టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. క్రేజీ లిస్ట్!

సోనీలివ్, ఆహాలో అదిరిపోయే కంటెంట్

కంటెంట్ ఓరియెంటెడ్, అవార్డ్ విన్నింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సోనీలివ్ (SonyLIV) ఈ వారం 'అన్బిల్ అవన్' (Anbil Avan) అనే తమిళ సర్వైవల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 20 నుంచి ఈ మూవీ తెలుగు, తమిళ సహా ఐదు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక మన అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) సినిమాల విషయానికొస్తే.. ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన 'క్రేజీ కళ్యాణం' (Crazy Kalyanam) నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీకెండ్‌లో ఇంట్లో వాళ్లతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇది బెస్ట్ ఛాయిస్.

జియోహాట్‌స్టార్, జీ5 లలో వెబ్ సిరీస్‌ల హవా

సినిమాలతో పాటే ఈ వారం యూత్‌ను ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీలోకి క్యూ కట్టాయి. కొత్తగా అప్డేట్ అయిన జియోహాట్‌స్టార్‌లో (JioHotstar) నవంబర్ 18 నుంచే 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' (Mr & Mrs Office) అనే సరికొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ కామెడీ సిరీస్‌ ఇది.

అలాగే ప్రముఖ ఓటీటీ జీ5 (Zee 5)లో నవంబర్ 20 నుంచి 'తీన్ తిగాడ' (Teen Tigada) అనే వెబ్ సిరీస్ సందడి చేయనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ యూత్ కు కనెక్ట్ అయ్యే సిరీస్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.

రెంటల్ ఆప్షన్‌లో హాలీవుడ్ మూవీ

హాలీవుడ్ సినిమాలు, వరల్డ్ క్లాస్ అడ్వెంచర్స్ ఇష్టపడే వారికి కూడా ఈ వారం అదిరిపోయే ఆప్షన్ ఉంది. 'ది ఒడిస్సీ' (The Odyssey) అనే కల్ట్ మూవీ నవంబర్ 18 నుంచి యాపిల్ టీవీ (Apple TV), బుక్‌మైషో స్ట్రీమ్ (BookMyShow Stream), అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వస్తుంది. అయితే ఇది డైరెక్ట్ ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా బై అండ్ రెంట్ (Buy & Rent) పద్ధతిలో మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుండటం గమనార్హం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More