...
...
Next Story

Jiohotstar Top 10: జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. మలయాళం, తెలుగు థ్రిల్లర్ సినిమాల హవా

Jiohotstar Top 10: జియోహాట్‌స్టార్ ఓటీటీలో ప్రస్తుతం టాప్ 10లో ట్రెండింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా ఇక్కడ చూడండి. వీటిలో ఓ మలయాళ థ్రిల్లర్, తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఉండటం విశేషం.

Published on: Aug 12, 2026, 16:09:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jiohotstar Top 10: ఓటీటీ ప్రేమికులకు జియోహాట్‌స్టార్ సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కాంబోను అందిస్తోంది. ఆగస్టు 12 నాటికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ను ఈ ఓటీటీ రివీల్ చేసింది. రొమాంటిక్ పొలిటికల్ డ్రామాలు, గూస్‌బంప్స్ తెప్పించే సైకాలజికల్ థ్రిల్లర్లు, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో హాట్‌స్టార్ వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలవుతున్నాయి.

1. థుక్రా కే మేరా ప్యార్ - సీజన్ 2

Jiohotstar Top 10: జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. మలయాళం, తెలుగు థ్రిల్లర్ సినిమాల హవా
Jiohotstar Top 10: జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. మలయాళం, తెలుగు థ్రిల్లర్ సినిమాల హవా

IMDb రేటింగ్: 6.5/10

జానర్: రొమాంటిక్ పొలిటికల్ రివేంజ్ డ్రామా

లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది 'థుక్రా కే మేరా ప్యార్' సీజన్ 2. తీవ్రమైన పగ, రాజకీయ శత్రుత్వాలు, ప్రేమ నేపథ్యంతో సాగే ఈ ఇంటెన్స్ వెబ్ సిరీస్ ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్‌పై విపరీతమైన బజ్ నెలకొంది.

2. ది తాజ్ స్టోరీ (The Taj Story)

IMDb రేటింగ్: 5.3/10

జానర్: హిస్టారికల్ డ్రామా / కోర్ట్‌రూమ్ ఫిల్మ్

రెండో స్థానంలో బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావ్, జాకిర్ హుస్సేన్, నమిత్ దాస్ నటించిన 'ది తాజ్ స్టోరీ' నిలిచింది. తుషార్ అమ్రీష్ గోయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. చారిత్రక అంశాలు, ట్విస్టులతో నిండిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో వ్యూయర్‌షిప్ రాబడుతోంది.

3. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ - సీజన్ 3

IMDb రేటింగ్: 8.3/10

జానర్: ఎపిక్ ఫాంటసీ / డ్రామా

IMDb రేటింగ్: 8.2/10

జానర్: యాక్షన్ థ్రిల్లర్

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్: ది రివేంజ్' నాలుగో స్థానంలో ఉంది. ఈ ఏడాది విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రణ్‌వీర్ సింగ్ మాస్ యాక్షన్, ఆదిత్య ధర్ టేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

5. ఉయిర్ (Uyir)

IMDb రేటింగ్: 6.5/10

జానర్: మలయాళం ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్' ఐదో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంటెన్స్ సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఓటీటీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి.

6. రేజర్ (Razor)

IMDb రేటింగ్: 4.3/10

జానర్: తెలుగు సైకాలజికల్ థ్రిల్లర్

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రవిబాబు డైరెక్ట్ చేసిన 'రేజర్' సినిమా ఆరో స్థానంలో ఉంది. మైండ్ గేమ్స్, సైకాలజికల్ థ్రిల్స్ ఇష్టపడే తెలుగు ప్రేక్షకులను ఈ డార్క్ థ్రిల్లర్ ఆకట్టుకుంటోంది.

7. ధురంధర్ - పార్ట్ 1 (Dhurandhar)

IMDb రేటింగ్: 8.2/10

జానర్: హై-వోల్టేజ్ యాక్షన్

రెండో భాగం రిలీజ్ అయి ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో, 2025లో రిలీజ్ అయిన మొదటి భాగం 'ధురంధర్' మళ్లీ ఏడో స్థానానికి చేరుకుంది. రణ్‌వీర్ సింగ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు సీక్వెల్ చూడటానికి ముందు ప్రేక్షకులు మళ్లీ రిపీట్ మోడ్‌లో చూస్తున్నారు.

8. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్

IMDb రేటింగ్: 8.1/10

జానర్: మార్వెల్ సూపర్‌హీరో అడ్వెంచర్

2021లో ప్రపంచ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన మార్వెల్ బిగ్గెస్ట్ హిట్ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇటీవల థియేటర్లలో 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' రిలీజ్ కావడంతో, పాత పార్ట్‌ను చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు.

9. లాఫ్టర్ షెఫ్స్ - సీజన్ 3

IMDb రేటింగ్: 8.4/10

జానర్: సెలబ్రిటీ కామెడీ కుకింగ్ షో

కలర్స్ టీవీ ప్రసారం చేసిన పాపులర్ కామెడీ కుకింగ్ షో 'లాఫ్టర్ షెఫ్స్' తొమ్మిదో స్థానంలో ఉంది. ఇటీవల ముగిసిన మూడో సీజన్ గ్రాండ్ ఫినాలేలో అలీ గోని, జన్నత్ జుబేర్ విజేతలుగా నిలిచారు. సెలబ్రిటీల నవ్వులు, వంటల హంగామా కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.

10. ప్రీతమ్ అండ్ పెడ్రో

IMDb రేటింగ్: 7.8/10

జానర్: సైబర్ క్రైమ్ థ్రిల్లర్

దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ నిర్మించిన 'ప్రీతమ్ అండ్ పెడ్రో' పదో స్థానంలో ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో అర్షద్ వార్సీ, వీర్ హిరానీ, విక్రాంత్ మాస్సే కీలక పాత్రలు పోషించారు. కొత్త రకం కథాంశంతో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా యూత్‌ను ఆకట్టుకుంటోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe