Jiohotstar Releases: మలయాళ థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు.. జియోహాట్‌స్టార్‌లో ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్

Jiohotstar Releases: జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. వీటిలో హారర్ థ్రిల్లర్, థ్రిల్లర్ తోపాటు రియాల్టీ షోలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

Published on: Sep 16, 2026, 17:53:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jiohotstar Releases: ఓటీటీ లవర్స్ వీకెండ్ బింజ్ వాచ్ ప్లాన్ చేసుకోవడానికి జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ వారం హారర్ థ్రిల్లర్, మలయాళం థ్రిల్లర్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, అన్‌లిమిటెడ్ కామెడీ సినిమాలు, వెబ్ సిరీస్ తోపాటు బిగ్గెస్ట్ రియాలిటీ షోలు ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాయి.

Jiohotstar Releases: మలయాళ థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు.. జియోహాట్‌స్టార్‌లో ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్
Jiohotstar Releases: మలయాళ థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు.. జియోహాట్‌స్టార్‌లో ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్

అనిల్ కపూర్ కొత్త గేమ్ షో నుంచి మలయాళం మార్షల్ ఆర్ట్స్ మూవీ దాకా డిఫరెంట్ జానర్ కంటెంట్‌తో జియోహాట్‌స్టార్ ఈ వారాన్ని చాలా కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేసింది. ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగ్గట్టుగా రిలీజ్ అవుతున్న ఆ 6 ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ - సీజన్ 16

గ్లోబల్ వైడ్‌గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ డ్రామా 'ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ' కొత్త సీజన్ ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. న్యూయార్క్ హై-సొసైటీ మహిళల రియల్ లైఫ్ డ్రామా, ఫన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ షో కొత్త ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి.

ది మమ్మీ (The Mummy)

హారర్, సూపర్‌నేచురల్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం 'ది మమ్మీ' అనే డిఫరెంట్ మూవీ సిద్ధమైంది. అస్వస్థతకు గురై కనిపించకుండా పోయిన తమ కుమార్తె తిరిగి వచ్చిన తర్వాత, ఆమె ప్రవర్తనలో గమనించే వింత మార్పులు ఆ కుటుంబాన్ని ఎలాంటి భయాందోళనలకు గురిచేశాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇండియాస్ టాప్ 1 పర్సెంట్ (India's Top 1 Percent)

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ హోస్ట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ రియాలిటీ గేమ్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కంటెస్టెంట్ల తెలివితేటలకు, లాజికల్ థింకింగ్‌కు పరీక్ష పెట్టే వినూత్నమైన ప్రశ్నలతో ఈ షో సాగనుంది. ఈ పవర్ ప్యాక్డ్ గేమ్ షో సెప్టెంబర్ 18 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

తుడక్కమ్ (Thudakkam)

మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న రా అండ్ రస్టిక్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా 'తుడక్కమ్'. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ఓటీటీ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ రియలిస్టిక్ డ్రామా సెప్టెంబర్ 18 నుంచి అందుబాటులోకి వస్తుంది.

మాబ్‌ ల్యాండ్ - సీజన్ 2 (Mob Land Season 2)

లండన్ నగరం వేదికగా రెండు ప్రత్యర్థి నేరపూరిత ముఠాల మధ్య సాగే అధికారం, ఆధిపత్య పోరు ఆధారంగా రూపొందిన ఇంగ్లీష్ క్రైమ్ వెబ్ సిరీస్ 'మాబ్‌ ల్యాండ్'. మొదటి సీజన్ సక్సెస్ తర్వాత మరింత ఇంటెన్స్ యాక్షన్, ట్విస్టులతో వస్తున్న సీజన్ 2 సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

బిగ్ బాస్ 10 (Bigg Boss 10), బిగ్ బాస్ 20

సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 10 తెలుగు', బిగ్ బాస్ 20 హిందీ ప్రతిరోజూ జియోహాట్‌స్టార్‌లో ఎంటర్‌టైన్ చేస్తోంది. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌లో హిందీలో.. కింగ్ నాగార్జున తెలుగులో ఈ షోలను రక్తి కట్టిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More