జియో హాట్‌స్టార్ (JioHotstar) కంటెంట్ విషయంలో దూసుకుపోతోంది. అయితే ఈ ఓటీటీలోని హిందీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే వీటిలో తెలుగు డబ్బింగ్ సినిమాల హవా చూడొచ్చు. తొలి స్థానంలో నితిన్ రాబిన్‌హుడ్ మూవీతోపాటు ఎప్పుడో 30 ఏళ్ల కిందట వచ్చిన అందాజ్ అప్నా అప్నాలాంటి సినిమాలు ఉన్నాయి. హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆ టాప్ 10 సినిమాలు, వాటి ఐఎండీబీ రేటింగ్స్ వివరాలు ఇవే.
టాప్ 10 సినిమాల లిస్ట్

రాబిన్‌హుడ్ (Robinhood): లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది తెలుగు యాక్షన్ డ్రామా 'రాబిన్‌హుడ్'. నితిన్ లీడ్ రోల్లో నటించి, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ వెర్షన్ జియోహాట్‌స్టార్‌లో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ కేవలం 4.5 మాత్రమే.
మర్డర్‌బాద్ (Murderbad): ఇదొక హిందీ రొమాంటిక్-థ్రిల్లర్. అర్నబ్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది జులైలో విడుదలైంది. దీనికి కూడా ఐఎండీబీ రేటింగ్ కేవలం 4.4 మాత్రమే కావడం గమనార్హం.
పక్కా కమర్షియల్: గోపీచంద్ నటించిన ఈ తెలుగు కోర్ట్‌రూమ్ యాక్షన్ కామెడీ సినిమా కూడా హిందీలో అందుబాటులో ఉంది. దీనికి 4.2 రేటింగ్ ఉంది.
హౌ టు హావ్ సెక్స్: ఇదొక టీనేజ్ డ్రామా సినిమా. ఈ ఇంగ్లిష్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ నాలుగో స్థానంలో ఉంది. దీనికి 6.4 రేటింగ్.
జాలీ ఎల్‌ఎల్‌బీ 2: అక్షయ్ కుమార్ నటించిన సూపర్ హిట్ కోర్ట్‌రూమ్ డ్రామా (2017) ఇది. ఇటీవల దీనికి మూడో పార్ట్ కూడా వచ్చింది. ఈ మూవీకి ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉండటం విశేషం.
తమ్ముడు: నితిన్ నటించిన మరో మూవీ ఇది. 2025లో వచ్చిన ఈ తెలుగు యాక్షన్ డ్రామా టాప్ 10లో ఉంది. దీనికైతే మరీ దారుణంగా ఐఎండీబీ రేటింగ్ 3.7 మాత్రమే.
సలార్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మాస్ యాక్షన్ సినిమా కూడా టాప్ 10 లిస్ట్‌లో ఉంది. ది రాజా సాబ్ రిలీజైన వేళ అతని ఈ యాక్షన్ మూవీ ట్రెండింగ్ లో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 6.6గా ఉంది.
{{/usCountry}}సలార్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మాస్ యాక్షన్ సినిమా కూడా టాప్ 10 లిస్ట్‌లో ఉంది. ది రాజా సాబ్ రిలీజైన వేళ అతని ఈ యాక్షన్ మూవీ ట్రెండింగ్ లో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 6.6గా ఉంది.
{{/usCountry}}జాలీ ఎల్‌ఎల్‌బీ: అర్షద్ వార్సీ నటించిన ఈ ఫ్రాంచైజీ మొదటి పార్ట్. ఇది కూడా కామెడీ లీగల్ డ్రామా. దీనికి ఐఎండీబీ రేటింగ్ 7.5గా ఉంది.
హృదయపూర్వం: మలయాళ రొమాంటిక్ కామెడీ-డ్రామా మూవీ. మోహన్‌లాల్ నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. దీనికి 6.7 రేటింగ్ నమోదైంది.
అందాజ్ అప్నా అప్నా: బాలీవుడ్ కల్ట్ క్లాసిక్. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి నటించిన ఈ సినిమా 1994లో వచ్చింది. ఇప్పటికీ ఇది హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనికి 8 రేటింగ్ ఉండటం విశేషం.