...
...
Next Story

జియోహాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, షోస్ ఇవే.. లిస్టులో ఒక తెలుగు సినిమా, మలయాళం హారర్ థ్రిల్లర్

జియోహాట్‌స్టార్ ఓటీటీలో బుధవారం (డిసెంబర్ 10) ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 మూవీస్ లిస్ట్ ఇది. ఇందులో ఒక తెలుగు సినిమాతోపాటు ఓ మలయాళం హారర్ థ్రిల్లర్ కూడా ఇందులో ఉన్నాయి. ఆ పూర్తి జాబితా ఇక్కడ చూడండి.

Published on: Dec 10, 2025, 16:10:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

జియోహాట్‌స్టార్‌లో ఈరోజు అంటే బుధవారం (డిసెంబర్ 10) టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, షోస్ ఏవో చూడండి. ఇందులో ఈ మధ్యే ముగిసిన హిందీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 19' మొదటి స్థానంలో నిలవగా, తెలుగు సూపర్ హిట్ మూవీ 'మిరాయ్', మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ 'డైస్ ఇరే' కూడా టాప్ 10లో స్థానం సంపాదించుకున్నాయి.

జియోహాట్‌స్టార్ టాప్ 10 మూవీస్, షోస్

బిగ్ బాస్ 19

జియోహాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, షోస్ ఇవే.. లిస్టులో ఒక తెలుగు సినిమా, మలయాళం హారర్ థ్రిల్లర్ (IMDb)
జియోహాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, షోస్ ఇవే.. లిస్టులో ఒక తెలుగు సినిమా, మలయాళం హారర్ థ్రిల్లర్ (IMDb)

కలర్స్ టీవీలో ప్రసారమైన పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 19 ఇటీవల డిసెంబర్ 7న గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. గౌరవ్ ఖన్నా ఈ సీజన్ విజేతగా నిలిచాడు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలవగా, ప్రణీత్ మోరే మూడో స్థానంలో నిలిచాడు. ఆగస్టు 24న మొదలైన ఈ షో.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

లాఫర్ షెఫ్స్: సీజన్ 3

రెండో స్థానంలో కూడా కలర్స్ ఛానెల్ కే చెందిన రియాలిటీ షో ఉంది. భారతీ సింగ్ హోస్ట్ చేస్తున్న ఈ కుకింగ్ కామెడీ షోలో అలీ గోని, జన్నత్ జుబైర్, కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ వంటి ప్రముఖ టీవీ స్టార్లు సందడి చేస్తున్నారు. హర్పాల్ సింగ్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.

జిద్దీ ఇష్క్ వెబ్ సిరీస్

మూడో స్థానంలో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉంది. ఈ డ్రామా థ్రిల్లర్ సిరీస్ ఐఎండీబీ రేటింగ్ 4.3 మాత్రమే. ఇందులో బర్ఖా బిష్త్, రియా సేన్ వంటి నటీమణులు నటించారు.

డైస్ ఇరే

ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ డైస్ ఇరే నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇది సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. దీని ఐఎండీబీ రేటింగ్ 7.1గా ఉంది.

ఇట్: వెల్‌కమ్ టు డెర్రీ

ఈ ఏడాది జులై 2న థియేటర్లలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ ఆరో స్థానంలో ఉంది. ఈ మూవీ ఐఎండీబీ రేటింగ్ 5.9గా ఉంది.

మిరాయ్

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జా మరో సూపర్ హీరో మూవీ 'మిరాయ్' ఏడో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ యాక్షన్-అడ్వెంచర్ సినిమాకు ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉంది. టాప్ 10లో ఉన్న ఏకైక తెలుగు మూవీ ఇది.

గేమ్ ఆఫ్ థ్రోన్స్

ఎవర్ గ్రీన్ హాలీవుడ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. దీని 8 సీజన్లు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ఐఎండీబీ రేటింగ్ 9.2.

మహాభారత్: ఏక్ ధర్మయుధ్

ఇదొక ఏఐ (AI) జనరేటెడ్ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే దీని ఐఎండీబీ రేటింగ్ చాలా తక్కువగా అంటే 1.2గానే ఉంది.

డోరేమాన్

పిల్లల ఫేవరెట్ కార్టూన్ షో డోరేమాన్ పదో స్థానంలో నిలిచింది. ఈ షో ఐఎండీబీ రేటింగ్ 8.2గా ఉండటం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks