Jiohotstar Web Series: ఓటీటీలో థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలు ఫుల్ వ్యూస్. అందుకే జియోహాట్‌స్టార్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఈ జానర్లలో కంటెంట్ ఎక్కువగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఓటీటీలో చెప్పుకోదగిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎన్నో స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇవన్నీ ఆడియెన్స్ ను సీట్ అంచున కూర్చోబెట్టే థ్రిల్ అందించేవే.
1. స్పెషల్ ఆప్స్ (Special OPS) — IMDb రేటింగ్: 8.5/10

ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన మోస్ట్ పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ స్పై థ్రిల్లర్ 'స్పెషల్ ఆప్స్' (Special OPS). ప్రముఖ నటుడు కేకే మీనన్ (Kay Kay Menon) ఇందులో 'హిమ్మత్ సింగ్' అనే రా (RAW) ఆఫీసర్‌గా జీవించారు.
2001లో ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై జరిగిన ఉగ్రదాడి వెనుక 5 మంది కాకుండా 6వ సూత్రధారి ఉన్నాడని నమ్మి, తన సొంత వనరులతో 19 ఏళ్ల పాటు అంతర్జాతీయంగా రహస్య విచారణ జరిపే ఆఫీసర్ కథ ఇది. ప్రతి ఎపిసోడ్‌లో కళ్లు చెదిరే ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ఐఎమ్‌డిబిలో ఏకంగా 8.5/10 రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
2. క్రిమినల్ జస్టిస్ (Criminal Justice) — IMDb రేటింగ్: 7.8/10
2019లో ప్రారంభమై ఇప్పటివరకు విజయవంతంగా 4 సీజన్లు పూర్తి చేసుకున్న పాపులర్ లీగల్ అండ్ క్రైమ్ డ్రామా సిరీస్ 'క్రిమినల్ జస్టిస్' (Criminal Justice). వర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) ఇందులో 'మాధవ్ మిశ్రా' అనే న్యాయవాదిగా ప్రతి సీజన్‌లోనూ ఒక క్లిష్టమైన మర్డర్ కేస్‌ను ఛేదిస్తారు.
ఒక అమాయకపు వ్యక్తి నేరంలో ఇరుక్కుని జైలు పాలవ్వడం, కోర్టు గదుల్లో సాగే ఉత్కంఠభరిత వాదనలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. విక్రాంత్ మాస్సే నటించిన తొలి సీజన్ నుంచి ఇటీవల వచ్చిన సీజన్ల వరకు ఇది 7.8/10 ఐఎమ్‌డిబి రేటింగ్‌తో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
3. ద నైట్ మేనేజర్ (The Night Manager) — IMDb రేటింగ్: 7.6/10
{{/usCountry}}ఒక అమాయకపు వ్యక్తి నేరంలో ఇరుక్కుని జైలు పాలవ్వడం, కోర్టు గదుల్లో సాగే ఉత్కంఠభరిత వాదనలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. విక్రాంత్ మాస్సే నటించిన తొలి సీజన్ నుంచి ఇటీవల వచ్చిన సీజన్ల వరకు ఇది 7.8/10 ఐఎమ్‌డిబి రేటింగ్‌తో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
3. ద నైట్ మేనేజర్ (The Night Manager) — IMDb రేటింగ్: 7.6/10
{{/usCountry}}హాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆధారంగా బాలీవుడ్‌లో రీమేక్ చేసిన స్పై డ్రామా 'ద నైట్ మేనేజర్' (The Night Manager). ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో పోటీపడి నటించారు. ఇందులో శోభిత చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ ఆశ్చర్యపరిచాయి.
ఒక హోటల్ నైట్ మేనేజర్ అక్రమ ఆయుధాల వ్యాపారం చేసే అంతర్జాతీయ గ్యాంగ్‌లోకి అండర్‌కవర్ ఏజెంట్‌గా ఎలా చొరబడ్డాడు అనేదే ఈ సిరీస్ కథాంశం. ఈ రీమేక్ రెండు భాగాలుగా వచ్చి 7.6/10 రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
4. ఆర్య (Aarya) — IMDb రేటింగ్: 7.7/10
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించిన గ్రిప్పింగ్ ఫ్యామిలీ అండ్ డ్రగ్ ల్యాండ్ క్రైమ్ డ్రామా 'ఆర్య' (Aarya). 2020లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఆర్య అనే సాధారణ గృహిణి, తన భర్త హత్య తర్వాత పిల్లల రక్షణ కోసం ఇష్టం లేకపోయినా డ్రగ్స్, నేర సామ్రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. సుస్మితా సేన్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో సాగే ఈ సిరీస్ ఐఎమ్‌డిబిలో 7.7/10 రేటింగ్ సాధించింది.
5. లూటేరే (Lootere) — IMDb రేటింగ్: 7.0/10
'స్కామ్ 1992' వంటి ఇండస్ట్రీ హిట్ సిరీస్‌ను అందించిన దిగ్గజ దర్శకుడు హన్సల్ మెహతా క్రియేషన్ లో వచ్చిన మరో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'లూటేరే' (Lootere). సోమాలియా సముద్ర తీరంలో ఒక భారతీయ కార్గో షిప్‌ను సముద్ర దొంగలు హైజాక్ చేసి, అందరినీ బంధీలుగా మార్చిన నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది.
ఓడలో ఉన్న అతిముఖ్యమైన రహస్య కన్సైన్‌మెంట్ బయటకు రాకుండా సాగే ఉత్కంఠభరిత నెరేషన్ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఈ సిరీస్ ఐఎమ్‌డిబిలో 7.0/10 రేటింగ్‌తో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.