Jiohotstar Web Series: జియోహాట్‌స్టార్‌లోని ఈ 5 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూస్తే మతి పోతుంది.. శోభిత బోల్డ్ సిరీస్
Jiohotstar Web Series: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్ కోసం చూస్తున్న ఆడియెన్స్ కోసం 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లో టాప్ 5 లిస్ట్ ఇక్కడ ఉంది. వీటిలో శోభితా ధూళిపాళ్ల నటించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఉంటం విశేషం. వీటిలో 8.5 ఐఎండీబీ రేటింగ్ సిరీస్ కూడా ఉన్నాయి. మరి ఆ టాప్ 5లో ఏవి ఉన్నాయో చూడండి.
Jiohotstar Web Series: ఓటీటీలో థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలు ఫుల్ వ్యూస్. అందుకే జియోహాట్‌స్టార్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఈ జానర్లలో కంటెంట్ ఎక్కువగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఓటీటీలో చెప్పుకోదగిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎన్నో స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇవన్నీ ఆడియెన్స్ ను సీట్ అంచున కూర్చోబెట్టే థ్రిల్ అందించేవే.

1. స్పెషల్ ఆప్స్ (Special OPS) — IMDb రేటింగ్: 8.5/10
ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన మోస్ట్ పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ స్పై థ్రిల్లర్ 'స్పెషల్ ఆప్స్' (Special OPS). ప్రముఖ నటుడు కేకే మీనన్ (Kay Kay Menon) ఇందులో 'హిమ్మత్ సింగ్' అనే రా (RAW) ఆఫీసర్‌గా జీవించారు.
2001లో ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై జరిగిన ఉగ్రదాడి వెనుక 5 మంది కాకుండా 6వ సూత్రధారి ఉన్నాడని నమ్మి, తన సొంత వనరులతో 19 ఏళ్ల పాటు అంతర్జాతీయంగా రహస్య విచారణ జరిపే ఆఫీసర్ కథ ఇది. ప్రతి ఎపిసోడ్‌లో కళ్లు చెదిరే ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ఐఎమ్‌డిబిలో ఏకంగా 8.5/10 రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
2. క్రిమినల్ జస్టిస్ (Criminal Justice) — IMDb రేటింగ్: 7.8/10
2019లో ప్రారంభమై ఇప్పటివరకు విజయవంతంగా 4 సీజన్లు పూర్తి చేసుకున్న పాపులర్ లీగల్ అండ్ క్రైమ్ డ్రామా సిరీస్ 'క్రిమినల్ జస్టిస్' (Criminal Justice). వర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) ఇందులో 'మాధవ్ మిశ్రా' అనే న్యాయవాదిగా ప్రతి సీజన్‌లోనూ ఒక క్లిష్టమైన మర్డర్ కేస్‌ను ఛేదిస్తారు.
ఒక అమాయకపు వ్యక్తి నేరంలో ఇరుక్కుని జైలు పాలవ్వడం, కోర్టు గదుల్లో సాగే ఉత్కంఠభరిత వాదనలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. విక్రాంత్ మాస్సే నటించిన తొలి సీజన్ నుంచి ఇటీవల వచ్చిన సీజన్ల వరకు ఇది 7.8/10 ఐఎమ్‌డిబి రేటింగ్‌తో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
3. ద నైట్ మేనేజర్ (The Night Manager) — IMDb రేటింగ్: 7.6/10
హాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆధారంగా బాలీవుడ్‌లో రీమేక్ చేసిన స్పై డ్రామా 'ద నైట్ మేనేజర్' (The Night Manager). ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో పోటీపడి నటించారు. ఇందులో శోభిత చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ ఆశ్చర్యపరిచాయి.
ఒక హోటల్ నైట్ మేనేజర్ అక్రమ ఆయుధాల వ్యాపారం చేసే అంతర్జాతీయ గ్యాంగ్‌లోకి అండర్‌కవర్ ఏజెంట్‌గా ఎలా చొరబడ్డాడు అనేదే ఈ సిరీస్ కథాంశం. ఈ రీమేక్ రెండు భాగాలుగా వచ్చి 7.6/10 రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
4. ఆర్య (Aarya) — IMDb రేటింగ్: 7.7/10
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించిన గ్రిప్పింగ్ ఫ్యామిలీ అండ్ డ్రగ్ ల్యాండ్ క్రైమ్ డ్రామా 'ఆర్య' (Aarya). 2020లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఆర్య అనే సాధారణ గృహిణి, తన భర్త హత్య తర్వాత పిల్లల రక్షణ కోసం ఇష్టం లేకపోయినా డ్రగ్స్, నేర సామ్రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. సుస్మితా సేన్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో సాగే ఈ సిరీస్ ఐఎమ్‌డిబిలో 7.7/10 రేటింగ్ సాధించింది.
5. లూటేరే (Lootere) — IMDb రేటింగ్: 7.0/10
'స్కామ్ 1992' వంటి ఇండస్ట్రీ హిట్ సిరీస్‌ను అందించిన దిగ్గజ దర్శకుడు హన్సల్ మెహతా క్రియేషన్ లో వచ్చిన మరో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'లూటేరే' (Lootere). సోమాలియా సముద్ర తీరంలో ఒక భారతీయ కార్గో షిప్‌ను సముద్ర దొంగలు హైజాక్ చేసి, అందరినీ బంధీలుగా మార్చిన నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది.
ఓడలో ఉన్న అతిముఖ్యమైన రహస్య కన్సైన్‌మెంట్ బయటకు రాకుండా సాగే ఉత్కంఠభరిత నెరేషన్ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఈ సిరీస్ ఐఎమ్‌డిబిలో 7.0/10 రేటింగ్‌తో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


