జియోహాట్‌స్టార్‌లోకి రాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్.. మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ నుంచి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వరకు

ఫిబ్రవరిలో మిగిలిన రెండు వారాలు ఓటీటీ ప్రియులకు పండగ వాతావరణాన్ని తీసుకురాబోతున్నాయి. జియోహాట్‌స్టార్ (JioHotstar) విభిన్నమైన జోనర్స్ తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

Published on: Feb 17, 2026, 16:48:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మీకు ఉందా? అయితే ఫిబ్రవరి నెల మిగిలిన రోజుల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇందులోకి రాబోతున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాస్ లాంటివి ఇందులో ఉండనున్నాయి. మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ నుంచి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వరకు ఫిబ్రవరి 18 నుంచి 27 మధ్య రానున్న మూవీస్, సిరీస్ ఏవో చూడండి.

జియోహాట్‌స్టార్‌లోకి రాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్.. మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ నుంచి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వరకు
జియోహాట్‌స్టార్‌లోకి రాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్.. మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ నుంచి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వరకు

సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ - ఫిబ్రవరి 27

మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రోస్లిన్' ఈ నెల చివర్లో రాబోతోంది. రోస్లిన్ అనే 17 ఏళ్ల అమ్మాయికి పీడకలలు వస్తుంటాయి. ఆకుపచ్చ కళ్ళు ఉన్న ఒక ఆగంతకుడు ఆమెను వెంటాడుతుంటాడు. ఆ మిస్టరీ ఏంటో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. జీతూ జోసెఫ్ షో రన్నర్ గా ఉన్న ఈ సిరీస్ లో మీనా, వినీత్ లాంటి సీనియర్ నటీనటులు నటించారు.

లక్కీ: ది సూపర్ స్టార్ - ఫిబ్రవరి 20

జంతు ప్రేమికులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే తమిళ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఈ లక్కీ: ది సూపర్ స్టార్. జీవీ ప్రకాష్ కుమార్, అనస్వర రాజన్ ఇందులో నటించారు. తప్పిపోయిన ఒక అమాయకపు కుక్కపిల్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ కుక్కపిల్ల ఒక కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. కానీ ఒక రాజకీయ నాయకుడు దాన్ని తన స్వార్థానికి వాడుకోవాలని చూసినప్పుడు కథలో ఎలాంటి గందరగోళం ఏర్పడిందో ఉదయ్ మహేష్ ఈ సినిమాలో చూపించాడు.

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ - ఫిబ్రవరి 26

ఈ నెలలోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే అని చెప్పవచ్చు. హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio) నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఇది. ప్రఖ్యాత దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ దీన్ని తెరకెక్కించాడు. బాబ్ ఫెర్గూసన్ అనే మాజీ విప్లవకారుడు, కిడ్నాప్ అయిన తన కూతురు విల్లా కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఇందులో షాన్ పెన్ విలన్ పాత్రలో కనిపిస్తాడు.

సంగమర్మర్ - ఫిబ్రవరి 26

సూరజ్ బర్జాత్యాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ అందిస్తున్న హిందీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఇది. భారతీయ కుటుంబాల విలువలు, ప్రేమానురాగాలు, బాధ్యతల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రతీ గురువారం దీని కొత్త ఎపిసోడ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

రెంటల్ ఫ్యామిలీ - ఫిబ్రవరి 18

ఇది ఒక అమెరికన్-జపనీస్ కామెడీ డ్రామా మూవీ. బ్రెండన్ ఫ్రేజర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు హికారి దర్శకత్వం వహించాడు. జపాన్‌లో కుటుంబ సభ్యులను, స్నేహితులను అద్దెకు తీసుకునే ఒక వింతైన సంప్రదాయం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. టోక్యోలో ఒంటరిగా ఉంటూ, జీవితంలో నిరాశలో ఉన్న ఫిలిప్ అనే అమెరికన్ నటుడి కథ ఇది. అతను ఇలా అద్దెకు మనుషులుగా నటించే కంపెనీలో చేరడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

ప్యారడైజ్ సీజన్ 2 - ఫిబ్రవరి 23

థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారికి గుడ్ న్యూస్. 'ప్యారడైజ్' రెండో సీజన్ ఫిబ్రవరి 23న రాబోతోంది. ఇందులో రెండు కథలు సమాంతరంగా నడుస్తాయి. ఒకటి జేవియర్ (స్టెర్లింగ్ కె. బ్రౌన్) ప్రమాదకరమైన ప్రపంచంలో తన భార్య కోసం వెతకడం.. మరొకటి బంకర్ లోపల అధికార పోరాటం ఎలా సాగుతుందనేది ఉత్కంఠభరితంగా చూపించనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More