రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. దీంతో జియోహాట్‌స్టార్ గంట గంటకూ ఓ పోస్ట్ తో సోషల్ మీడియాలో మూవీ హైప్ ను పెంచేస్తోంది. థియేటర్లలో దారుణంగా బోల్తా పడినా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు మాత్రం ఎంతలా ఎదురు చూస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ది రాజా సాబ్ వచ్చేస్తున్నాడు

సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడిన ప్రభాస్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కాగా నెల రోజుల్లోపే అంటే శుక్రవారం (ఫిబ్రవరి 6) నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రభాస్ రేంజ్, సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో చాలా త్వరగానే డిజిటల్ ప్రీమియర్ అవుతుందని చెప్పొచ్చు.
దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృత మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే మూవీ కోసం జియోహాట్‌స్టార్ ఏర్పాటు చేసిన ‘రిమైండ్ మి’ బటన్ ను తెగ నొక్కేస్తున్నారట. ఒక్కసారిగా ఈ ప్లాట్‌ఫామ్ పైకి ట్రాఫిక్ పెరిగిపోతోందట. ఇదే విషయాన్ని జియోహాట్‌స్టార్ వెల్లడిస్తూ.. పెరుగుతున్న డిమాండ్ కు తగినట్లుగా తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు ట్వీట్ చేసింది. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ కట్
రాజా సాబ్ మూవీపై ఓటీటీ ప్రేక్షకుల్లో ఇంతలా ఆసక్తి పెరగడానికి మరో కారణం ఈ సినిమా ఎక్స్‌టెండెడ్ కట్ రాబోతోంది. థియేటర్లలో డిలీట్ చేసిన సీన్లను కూడా ఓటీటీలో చూపించబోతున్నారు. దీంతో ఫుల్ మూవీ కోసం ఫ్యాన్స్ వేచి చూడలేకపోతున్నారు. ఇది చాలదన్నట్లు జియోహాట్‌స్టార్ కూడా ప్రతి గంట కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. గురువారం (ఫిబ్రవరి 5) ఉదయం నుంచే ఎక్స్ అకౌంట్లో ఈ హంగామా మొదలైంది.
మరోవైపు భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా నెగటివ్ టాక్ కారణంగా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చిన విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందు మూవీ గురించి గొప్పగా మాట్లాడిన డైరెక్టర్ మారుతికి కూడా ట్రోలింగ్ తప్పలేదు. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత రాజా సాబ్ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
{{/usCountry}}మరోవైపు భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా నెగటివ్ టాక్ కారణంగా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చిన విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందు మూవీ గురించి గొప్పగా మాట్లాడిన డైరెక్టర్ మారుతికి కూడా ట్రోలింగ్ తప్పలేదు. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత రాజా సాబ్ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
{{/usCountry}}