Jo Jo Caution 2: మొగోనివేనా నువ్వు.. బాలయ్య బాబు టైపు.. జో జో రెండో ప్రమాద హెచ్చరిక అదుర్స్- ప్రచారంలో సరికొత్త వ్యూహం
Jo Jo Caution 2 Released: కృష్ణ కమల్, మహీ శ్రీ జంటగా నటిస్తున్న 'జో జో' చిత్రం నుంచి మేకర్స్ తాజాగా 'కాషన్ 2' పేరిట మరో హెచ్చరిక వీడియోను విడుదల చేశారు. గ్రామీణ వాతావరణం, ఆకట్టుకునే ప్రేమకథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రమోషనల్ వీడియో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Jo Jo Caution 2 Released: టాలీవుడ్లో ఇటీవల వినూత్న ప్రచార చిత్రాలతో వినోదప్రియుల దృష్టిని ఆకర్షించే సంస్కృతి పెరిగింది. అదే బాటలో సరికొత్త కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న తెలుగు చిత్రం 'జో జో' సినీ వర్గాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంటోంది.

కాషన్ 2 పేరుతో వీడియో
ఇప్పటికే విడుదల చేసిన మొదటి హెచ్చరిక వీడియో 'కాషన్ 1'తో అందరిలోనూ ఉత్సుకత పెంచిన జో జో చిత్ర బృందం, తాజాగా 'కాషన్ 2' పేరుతో రెండో ప్రమోషనల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. రెండో ప్రమాద హెచ్చరిక అంటూ వచ్చిన జో జో వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ 'జో జో కాషన్ 2' వీడియోను పరిశీలిస్తే సినిమా ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రకృతి రమణీయమైన పల్లె వాతావరణం, సహజసిద్ధమైన లొకేషన్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
హీరో హీరోయిన్ లవ్ ఎమోషన్స్
హీరో సీను, హీరోయిన్ సుప్రజల మధ్య సాగే సన్నివేశాలు, వారి పరిచయం కథలోని ప్రేమ భావోద్వేగాలను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. సాంప్రదాయ పల్లె జీవితానికి వినోదాన్ని, తగినంత ఉత్కంఠను జోడించి ఈ చిత్రాన్ని మలచినట్లు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతోంది.
జో జో కాషన్ 2 వీడియోలో సీనును "మొగోనివేనా నువ్వు.." అని సుప్రజ అడిగితే.. "మో.. ఏంటీ అట్ట అడుగుతున్నవ్.. కానస్తాండ్లా (కనిపించట్లేదా)" అని సీను అంటాడు. "కింద గోలికాయలు ఉన్నా ప్రతోడు మొగోడే అనుకుంటాడు. గోలికాయలు ఒక్కటేనా గుండె కాయ కూడా ఉందా అని" అని సుప్రజ అంటుంది.
పనిగానిచ్చుకుని పారిపోయే టైపా
"అంటే" అని ఆశ్చర్యంగా సీను అడుగుతాడు. "పడుసుపిల్ల కానొస్తే.. ఓ నాలుగు దినాలు వెనుకబడి పనిగానిచ్చుకుని పారిపోయే టైపా.. ఇష్టపడిని పిల్లను దాని బాధ్యతలతో సహా పెళ్లి చేసుకుని దాన్ని జీవితాంతం మోసే అంతా గుండెకాయ ఉన్న మొగోని టైపా అని.." అని సుప్రజ బదులిస్తుంది.
"సత్తేప్రమాణకంగా చెబుతుండా.. ఓ తూరి మాటిచ్చానంటే మడమతిప్పని వంశం మాది.. బాలయ్య బాబు టైపు.." అని హీరో సీను సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్స్ జో జో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశాయి.
బలమైన తారాగణం.. వైవిధ్యమైన పాత్రలు
ఈ చిత్రంలో కథానాయకుడు సీను పాత్రలో కృష్ణ కమల్ నటిస్తుండగా, సుప్రజ పాత్రలో మహీ శ్రీ కనిపించనున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు కీలకమని మూవీ టీమ్ పేర్కొంటోంది. విలక్షణ నటుడు మకరంద్ దేశ్‌పాండే 'ముకేష్ షా' అనే విభిన్నమైన పాత్రలో మెరవనుండడం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనుంది.
వెంకటేష్ పాత్రలో ఫణీంద్ర దేవరపల్లి, విజయమ్మగా ప్రభావతి, సూరిగా మహబూబ్ బాషా, తంజావూరు రంగస్వామిగా సతీష్ దేవత్తే, రమణ పాత్రలో పుదూర్ శరత్ బాబు కీలక పాత్రల్లో అలరించనున్నారు. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండేలా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు.
సాంకేతిక బృందం పనితనం
రోహిత్ కుమార్ కెమెరా పనితనం గ్రామీణ అందాలను అందంగా చూపించారు. మహేష్ శంకర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని మూడ్‌ను మరింతగా పెంచేలా ఉన్నాయి. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, రెహమాన్, శ్రీనివాస్ మౌళి, రామచంద్ర పాటలను సమకూర్చారు.
ప్రచారంలో సరికొత్త వ్యూహం
సాధారణంగా సినిమాల కథను ముందే టీజర్లు, ట్రైలర్ల ద్వారా స్పష్టంగా చెప్పేస్తుంటారు. కానీ 'జో జో' చిత్రబృందం మాత్రం ఆ దారిలో వెళ్లకుండా 'కాషన్' పేరుతో చిన్న చిన్న గ్లింప్స్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచుతోంది.
కథలోని ప్రధాన అంశాలను గోప్యంగా ఉంచుతూనే, సినిమాపై అంచనాలను పెంచడంలో ఈ వ్యూహం బాగా పనిచేస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


