Jo Jo: భిన్నమైన జోనర్లోకి డైరెక్టర్ దేవ కట్టా- రొమాంటిక్ అడ్వెంచర్ కామెడీగా జో జో- జీవితాలు మార్చే వజ్రం కోసం సాగే వేట!

Director Deva Katta Jo Jo Movie First Look: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దేవ కట్టా సమర్పణలో తెరకెక్కుతున్న రొమాంటిక్ అడ్వెంచర్ కామెడీ చిత్రంగా జో జో. మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అంటూ స్వీట్ వార్నింగ్‌తో జో జో ఫస్ట్ లుక్‌ను తాజాగా ఇవాళ విడుదల చేశారు మేకర్స్. ఓ వజ్రం కోసం సాగే వేటగా సినిమా కథ ఉండనుంది.

Published on: Aug 14, 2026, 19:17:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Director Deva Katta Jo Jo Movie First Look: వైవిధ్యంగా, సీరియస్‌గా, ఆలోచింపజేసే కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన సమర్పణలో రూపొందనున్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జో జో’.

భిన్నమైన జోనర్లోకి డైరెక్టర్ దేవ కట్టా- రొమాంటిక్ అడ్వెంచర్ కామెడీగా జో జో- జీవితాలు మార్చే వజ్రం కోసం సాగే వేట!
భిన్నమైన జోనర్లోకి డైరెక్టర్ దేవ కట్టా- రొమాంటిక్ అడ్వెంచర్ కామెడీగా జో జో- జీవితాలు మార్చే వజ్రం కోసం సాగే వేట!

మయసభ ఓటీటీ సిరీస్ డైరెక్టర్

జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఈ జో జో సినిమా సాగుతుంది. మయసభ ఓటీటీ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కిరణ్ జయ్ కుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, కొత్త జీవితంపై ఆశ‌లు, జీవితంలో ఎదగాలనే తపన.. మెరుగైన జీవితం కోసం మనుషులు ఎంత దూరమైన వెళ్లే తీరుని వ్యంగ్య హాస్యంతో ‘జో జో’ చిత్రంలో ఆవిష్కరించనున్నారు.

జీవితాలను మార్చే వజ్రం కోసం వేట

ఎండిపోయిన జొన్నగిరి డైమండ్ ఫీల్డ్స్‌లో ఇద్దరు పేద యువకులు, ఒక ధైర్యమైన యువతి తమ జీవితాలను ఒక్కసారిగా మార్చేయగల ఓ వజ్రం కోసం వేట మొదలుపెడతారు. ఆ ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని, జీవితాలు మారిపోతాయని వారు ఆశపడతారు.

అత్యాశ, మోసం, ప్రమాదాలు

అయితే డబ్బు కోసం మొదలైన వారి వేట అంత సులభంగా సాగదు. ప్రేమ, సరదా సంఘటనలు, అత్యాశ, మోసం, ప్రమాదాలు.. ఇలా ఊహించని పరిణామాలతో వారి ప్రయాణం గందరగోళంగా మారుతుంది. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని మలుపులతో ఆ వజ్రం కోసం సాగించే వేట మరింత ఆసక్తికరంగా మారుతుంది.

భిన్నమైన నేటివిటీతో రొమాంటిక్ అడ్వెంచర్ కామెడీగా

ఈ క్రమంలో అక్కడి విచిత్రమైన మనుషులు, పరిస్థితుల చుట్టూ ‘జో జో’ ఓ భిన్నమైన, నేటివిటీతో కూడిన రొమాంటిక్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోంది. తాజాగా ఇవాళ శుక్ర‌వారం (ఆగస్ట్ 14) రోజున మేక‌ర్స్ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

జొన్నగిరి ప్రాంతపు ల్యాండ్‌స్కేప్

ఈ పోస్టర్ గమనిస్తే.. రా అండ్ ఎర్తీ నేచర్‌ను ప్రతిబింబించేలా, పచ్చి నేటివిటీతో కూడిన విజువల్స్‌తో పోస్ట‌ర్‌ను రూపొందించారు. జొన్నగిరి ప్రాంతపు ల్యాండ్‌స్కేప్‌ను బ్యాక్‌డ్రాప్‌గా చూపిస్తూ, పోస్టర్‌లో ప్రధాన పాత్రను ప్రత్యేకంగా హైలైట్ చేశారు.

హెచ్చరిక బోర్డ్

అలాగే “హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!” అంటూ సరదాగా ఇచ్చిన వార్నింగ్‌తో సినిమాకు ఉన్న డిఫరెంట్ కామెడీ టోన్‌ను మేకర్స్ స్పష్టం చేశారు. ప్రేమ, కామెడీని ఎలాంటి హద్దులు, దాపరికాలు లేకుండా తమదైన శైలిలో చూపించబోతున్నామనే సంకేతాన్ని ఈ హెచ్చరిక ఇస్తోంది.

నిర్మాత, డైరెక్టర్ కాంబో

‘జో జో’ చిత్రాన్ని విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. కిరణ్ జయ్ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మ‌య‌స‌భ ఓటీటీ సిరీస్ త‌ర్వాత వీరి కాంబోలో వ‌స్తోన్న సినిమా ఇది. ఇందులో కృష్ణ‌ కమల్ ‘శీను’.. మాహీ శ్రీ ‘సుప్రజ’ పాత్ర‌ల్లో అల‌రించ‌నున్నారు.

సాంకేతిక వర్గం

ఫణీంద్ర దేవరపల్లి వెంకటేష్‌గా, ప్రభావతి విజయమ్మగా, మహబూబ్ బాషా సూరిగా, సతీష్ దేవట్టే తంజోర్ రంగసామిగా, పూడూరు శరత్ బాబు రమణగా, మకరంద్ దేశ్‌పాండే ముఖేష్ షాగా కనిపించనున్నారు. టెక్నిక‌ల్‌గా రోహిత్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేష్ శంకర్ సంగీత దర్శకుడిగా, మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రెహమాన్, శ్రీనివాస్ మౌళి, రామచంద్ర సాహిత్యాన్ని అందిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More