...
...
Next Story

Netflix Trending: చిన్న ద్వీపం.. పెద్ద రహస్యాలు.. 14 ఏళ్ల తర్వాత ఓటీటీలో సంచలనం.. నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ లో థ్రిల్లర్

Netflix Trending: 2012లో థియేటర్లను ఊపేసిన ఓ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. 14 ఏళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ లో సంచలనంగా మారింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇండియాలో టాప్-10 ట్రెండింగ్ మూవీగా నిలిచిన ఈ థ్రిల్లర్ పై ఓ లుక్కేయండి.

Published on: Jul 26, 2026, 20:32:00 IST
Advertisement

Netflix Trending: సినీ ప్రపంచంలో కొన్ని సినిమాలు ఎంతకాలమైనా తమ క్రేజ్‌ను కోల్పోవు. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకులకు అందించిన అద్భుతమైన అనుభూతిని దశాబ్దాల తర్వాత కూడా డిజిటల్ వేదికలపై పునరావృతం చేస్తుంటాయి. సరిగ్గా అలాంటి అరుదైన ఘనతనే సాధించింది ప్రముఖ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మిస్టరీ చిత్రం 'జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్' (Journey 2: The Mysterious Island).

14 ఏళ్ల తర్వాత

చిన్న ద్వీపం.. పెద్ద రహస్యాలు.. 14 ఏళ్ల తర్వాత ఓటీటీలో సంచలనం.. నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ లో థ్రిల్లర్
చిన్న ద్వీపం.. పెద్ద రహస్యాలు.. 14 ఏళ్ల తర్వాత ఓటీటీలో సంచలనం.. నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ లో థ్రిల్లర్

బాక్సాఫీస్ వద్ద విడుదలైన దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఈ జర్నీ 2 ది మిస్టీరియస్ ఐలాండ్ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. 2012లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో అదరగొడుతోంది.

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో హల్‌చల్

ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఈ చిత్రం కొత్త సినిమాలను సైతం అధిగమిస్తూ ఇండియాలోని 'టాప్ 10' ట్రెండింగ్ సినిమాల జాబితాలోకి దూసుకొచ్చింది. 14 ఏళ్ల క్రితం నాటి సినిమా అయినప్పటికీ, నేటి తరం ఓటీటీ వీక్షకులను సైతం తన వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో విశేషంగా ఆకట్టుకుంటోంది.

గంటా 33 నిమిషాల క్రిస్పీ నిడివితో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ చివరి వరకు బోర్ కొట్టకుండా సాగుతుంది. ప్రస్తుతం ఇండియాలో టాప్ 10 నెట్‌ఫ్లిక్స్‌ సినిమాల్లో జర్నీ 2 పదో ప్లేస్ లో ఉండటం విశేషం.

చిన్న ద్వీపం.. పెద్ద రహస్యాలు!

ఈ సినిమా కథ ఒక రహస్యమైన ద్వీపం చుట్టూ తిరుగుతుంది. కథానాయకుడు సీన్ అండర్సన్ (జోష్ హచర్సన్) కు మ్యాప్‌లో కూడా లేని దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అపరిచిత ప్రాంతం నుంచి రహస్యమైన డిస్ట్రెస్ సిగ్నల్ అందుతుంది. ఆ సిగ్నల్ అక్కడ చిక్కుకుపోయిన తన తాత అలెక్సాండర్ (మైఖేల్ కేన్) నుంచే వచ్చిందని సీన్ గ్రహిస్తాడు.

అంతేకాకుండా, అపారమైన రహస్యాలతో నిండిన ఆ ద్వీపం కొద్ది గంటల్లోనే సముద్రంలో మునిగిపోయే ప్రమాదంలో ఉందని వారికి తెలుస్తుంది. ఆ విపత్తు నుంచి తమను తాము కాపాడుకుంటూ, తాతను సురక్షితంగా వెనక్కి ఎలా తీసుకొచ్చారనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

సైన్స్ ఫిక్షన్ లవర్స్ ఎందుకు మిస్ కాకూడదు?

బ్రాడ్ పేటన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2008లో వచ్చిన 'జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్' కు సీక్వెల్ గా తెరకెక్కింది. ఇందులో హాలీవుడ్ మాస్ యాక్షన్ స్టార్ డ్వేన్ జాన్సన్ (ది రాక్) తన కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్ తోనూ అదరగొట్టాడు. మైఖేల్ కేన్, జోష్ హచర్సన్, వెనెస్సా హడ్జెన్స్, లూయిస్ గుజ్మాన్, క్రిస్టిన్ డేవిస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ముఖ్యంగా నేటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్న డార్క్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లతో విసిగిపోయిన కుటుంబ ప్రేక్షకులకు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కలర్‌ఫుల్ విజువల్ ఫాంటసీ ఆద్యంతం రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తుంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ గ్రాఫిక్స్, ఉత్కంఠ రేకెత్తించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉన్న ఈ 'ఫ్యామిలీ ఫ్రెండ్లీ విజువల్ వండర్' ప్రయాణాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks