Dragon: జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ బర్డీస్‌ను చూశారా? జపాన్ నుంచి తెచ్చుకున్న పక్షులను పరిచయం చేసిన డ్రాగన్
Dragon: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా లభించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon) గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. తారక్ తన ఇంట్లోని కొత్త అతిథులను పరిచయం చేశాడు.
Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియా వేదికగా అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున తారక్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీకి ఊహించినట్లే డ్రాగన్ అనే టైటిల్ పెట్టగా.. ఇప్పుడు ఎన్టీఆర్ తన బర్త్ డే నాడు తన బెస్ట్ పెట్స్ ను పరిచయం చేయడం విశేషం.

ఇంట్లోకి కొత్త అతిథులు.. బర్త్ డే వేళ తారక్ క్యూట్ పోస్ట్
ఒకవైపు 'డ్రాగన్' సోషల్ మీడియాలో గర్జిస్తుంటే.. మరోవైపు తారక్ తన పుట్టినరోజును ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక అందమైన ఫొటోను షేర్ చేసి, తన ఇంట్లోకి వచ్చిన కొత్త పెంపుడు పక్షులను అభిమానులకు పరిచయం చేశారు. "నా సరికొత్త స్నేహితులు అసాహి (Asahi), యూహి (Yuuhi)లను మీకు పరిచయం చేస్తున్నాను.. జపాన్ పై నాకున్న ప్రేమకు ఇవి ప్రతిరూపాలు" అంటూ ఎన్టీఆర్ క్యాప్షన్ ఇచ్చారు.
నెరిసిన గడ్డంతో రగ్గడ్ లుక్‌లో ఉన్న తారక్.. నేలపై కూర్చుని ఆ పక్షులతో సరదాగా గడుపుతున్న ఈ పిక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలో అంత వాయ్‌లెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తూ, రియల్ లైఫ్‌లో ఇంత సాఫ్ట్‌గా పక్షులతో ఆడుకోవడం తారక్‌కే చెల్లిందని నెటిజన్లు మురిసిపోతున్నారు.
'డ్రాగన్' గ్లింప్స్‌తో ప్రశాంత్ నీల్ సంచలనం
'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌ను సరికొత్త రగ్గడ్ లుక్‌లో ప్రెజెంట్ చేశారు. గ్లింప్స్‌లో చూపించిన వరల్డ్ బిల్డింగ్, ఎన్టీఆర్ ఎలివేషన్ షాట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ అన్ని రికార్డులను తిరగరాస్తూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
'డ్రాగన్' మూవీ విశేషాలు
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ డ్రామా జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య విశేషాలను చూస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఏమిటి?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు.
2. ఎన్టీఆర్ తన పుట్టినరోజున పరిచయం చేసిన పెంపుడు పక్షుల పేర్లు ఏమిటి?
ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసిన రెండు అందమైన పెంపుడు పక్షుల పేర్లు 'అసాహి' (Asahi), 'యూహి' (Yuuhi).
3. 'డ్రాగన్' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
4. 'డ్రాగన్' సినిమాలో హీరోయిన్ ఎవరు, ఇతర ముఖ్య నటులు ఎవరు?
ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


