...
...
Next Story

Jr NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్‌లో ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్లు.. విలన్‌గా స్టార్ హీరో

Jr NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలోకి ఇద్దరు బాలీవుడ్ స్టార్లు అడుగుపెట్టారు. విలన్ పాత్రలో స్టార్ హీరో షాహిద్ కపూర్, మరో స్టార్ నటి ఆలియా భట్ కూడా ఇందులో నటించడం కన్ఫమ్ అయినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి.

Published on: Sep 3, 2026, 16:43:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jr NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon) కాస్టింగ్ గురించి ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ అధికారికంగా జాయిన్ అయ్యారు.

ఆలియా, షాహిద్ కపూర్ కంబ్యాక్.. డ్రాగన్‌లో హైలైట్

Jr NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్‌లో ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్లు.. విలన్‌గా స్టార్ హీరో
Jr NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్‌లో ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్లు.. విలన్‌గా స్టార్ హీరో

ప్రముఖ ఫిలిం పోర్టల్ గుల్టే (Gulte) రిపోర్టు ప్రకారం.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎపిక్‌లో షాహిద్ కపూర్, ఆలియా భట్ అత్యంత కీలకమైన పాత్రల్లో నటించనున్నారు. గతంలో 'ఉడ్తా పంజాబ్', 'షాందార్' వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్, ఇప్పుడు ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమా ద్వారా మళ్లీ ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.

పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలున్న ఈ సినిమాలో ఆలియా భట్ క్యారెక్టర్ డ్రామాకు ప్రాణం పోస్తుందని, షాహిద్ కపూర్ పాత్ర మాస్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

అనిల్ కపూర్ నుంచి రుక్మిణి వసంత్ దాకా..

డ్రాగన్ సినిమాలో కేవలం షాహిద్, ఆలియా మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలోని దిగ్గజ నటులు భాగమవుతున్నారు. బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ స్టార్ అనిల్ కపూర్, 'సప్త సాగరదాచే ఎల్లో' ఫేమ్ రుక్మిణి వసంత్, మలయాళ వర్సటైల్ యాక్టర్ బిజు మీనన్, సీనియర్ నటుడు అశుతోష్ రాణా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చిన్నపాటి సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన రికవరీ అవుతుండగానే, మేకర్స్ హైదరాబాద్‌లోని స్పెషల్ సెట్స్‌లో షూటింగ్‌ను ఏమాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూ చేస్తున్నారు.

ప్రస్తుతం వేగంగా జరుగుతున్న ఈ చిత్రీకరణను పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేసి.. 2027 జూన్ నెలలో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రశాంత్ నీల్.. 'ఆర్‌ఆర్‌ఆర్', 'దేవర' చిత్రాలతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్న ఈ 'డ్రాగన్' థియేటర్లలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe