Jr NTR Review: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble The Trouble) సినిమా చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూసిన తర్వాత తారక్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో సుదీర్ఘమైన రివ్యూ పోస్ట్ చేశారు.
తారక్ ఎమోషనల్ రివ్యూ.. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా ప్రతీ చిన్నారికి, ప్రతీ తండ్రికి, తనలో ఇంకా ఆ బాల్యాన్ని దాచుకున్న ప్రతీ ఒక్కరికీ సొంతం అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత కుటుంబ సమేతంగా కూర్చుని ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ సినిమా వచ్చిందని తారక్ ఆనందం వ్యక్తం చేశారు.
"సినిమా చూస్తున్నంతసేపు ఒక ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్‌లో ఉన్నట్లు అనిపించింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు నన్ను బాగా కదిలించాయి. ఆ ఫీలింగ్ నుంచి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను" అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
'సూరి'గా ఫహాద్ రచ్చ.. డెబ్యూ డైరెక్టర్‌పై తారక్ ప్రశంసలు
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాలో 'సూరి' పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ తనను విపరీతంగా ఆకట్టుకుందని తారక్ కొనియాడారు. "ఫహాద్ సర్.. సూరిగా మీ నటన అద్భుతం. ప్రతీ ఫ్రేమ్‌కి మీరు ప్రాణం పోసే తీరు నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసింది" అని ప్రశంసించారు.
అలాగే డెబ్యూ డైరెక్టర్ శశాంక్ ఏలేటి వర్కింగ్ స్టైల్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మొదటి సినిమాతోనే పిల్లలు, కుటుంబాలకు కనెక్ట్ అయ్యేంత స్వచ్ఛమైన భావోద్వేగాలను చాలా స్పష్టతతో తెరకెక్కించారని, శశాంక్‌కి భవిష్యత్తులో పెద్ద సక్సెస్ దక్కుతుందని విష్ చేశారు.
{{/usCountry}}అలాగే డెబ్యూ డైరెక్టర్ శశాంక్ ఏలేటి వర్కింగ్ స్టైల్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మొదటి సినిమాతోనే పిల్లలు, కుటుంబాలకు కనెక్ట్ అయ్యేంత స్వచ్ఛమైన భావోద్వేగాలను చాలా స్పష్టతతో తెరకెక్కించారని, శశాంక్‌కి భవిష్యత్తులో పెద్ద సక్సెస్ దక్కుతుందని విష్ చేశారు.
{{/usCountry}}ఇక చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ నటన తన గుండెను హత్తుకుందని చెప్పారు. "చిన్నారి సారా.. నువ్వు నా మనసు దోచుకున్నావ్. చాలా సహజంగా, ఎంతో అమాయకత్వంతో ప్రతి ఎమోషన్‌ను పండించావ్" అని తారక్ కాంప్లిమెంట్ ఇచ్చారు.
కాలభైరవ బీజీఎం మ్యాజిక్.. కార్తికేయకు ఎన్టీఆర్ స్పెషల్ మెసేజ్
సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణమని ఎన్టీఆర్ కొనియాడారు. బీజీఎం సినిమాలోని ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందని చెప్పారు.
తన సొంత తమ్ముడిలా భావించే ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయను ఉద్దేశించి మాట్లాడిన తారక్.. "నానా కార్తికేయ.. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అక్టోబర్ 2న థియేటర్లలో ప్రపంచం ఈ మ్యాజిక్ చూడబోతోంది" అని ముగించారు.
మహేష్ బాబు తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అని ప్రశంసించడంతో, అక్టోబర్ 2న రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే మహేష్ కూడా ఈ మూవీ రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫహాద్ సార్ మీ నటన అద్భుతం అంటూ సూపర్ స్టార్ కూడా కొనియాడారు.