Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ వచ్చి 24 గంటలు కూడా కాకముందే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌ను 'లూగర్' (Luger) అనే అత్యంత పవర్‌ఫుల్, షార్ప్ అసాసిన్ పాత్రలో ప్రశాంత్ నీల్ పరిచయం చేశారు. థియేట్రికల్ విజువల్స్ పక్కన పెడితే.. ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ లేని విధంగా చాలా సన్నగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ లుక్ వెనుక తారక్ పడిన కఠోర శ్రమను దర్శకుడు ప్రశాంత్ నీల్ బయటపెట్టారు.
"లైట్‌గా చెబితే.. వైల్డ్‌గా మారాడు" – ప్రశాంత్ నీల్

నిజానికి ఎన్టీఆర్‌ను ఇంత సన్నగా మార్చాలనేది మొదట అనుకున్న ప్లాన్ కాదట. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన ప్రీ-ప్రొడక్షన్ లుక్ టెస్టుల సమయంలో ఈ ఆలోచన వచ్చింది. సాధారణ యాక్షన్ హీరో బాడీ కంటే ఈ ఇంటెన్స్ హంతకుడి పాత్రకు కొంచెం భిన్నమైన లుక్ ఉంటే బాగుంటుందని నీల్ భావించారు.
"నేను తారక్‌తో చాలా సాధారణంగా అన్నాను.. 'నువ్వు ఈ పాత్ర కోసం కొంచెం బరువు తగ్గి, సన్నగా కనిపిస్తే క్యారెక్టర్‌కు చాలా హెల్ప్ అవుతుంది' అని చెప్పాను. నేను క్యాజువల్‌గా ఒక నోట్ లాగే చెప్పాను. కానీ ఎన్టీఆర్ దానిని ఒక పర్సనల్ మిషన్‌లా తీసుకున్నాడు. వెంటనే తన డైరీని ఖాళీ చేసి, మిగతా ప్రాజెక్టులన్నింటికీ బ్రేక్ ఇచ్చి, కఠినమైన ఫిట్‌నెస్ జర్నీని ప్రారంభించాడు"
ఎన్టీఆర్ భార్య, అమ్మ నాపై విరుచుకుపడ్డారు
తారక్ ఎంతలా మొండిగా కష్టపడ్డాడంటే.. తదుపరి నాలుగు నెలల పాటు ఆయన ఎలాంటి షూటింగ్‌లలో పాల్గొనలేదు. కేవలం వర్కౌట్లు, డైట్‌తో ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు.
"ఆయన అంత వేగంగా బరువు తగ్గడం చూసి నేను చాలాసార్లు వద్దని వారించాను. ఎందుకంటే ఆయన చాలా బలహీనంగా, పేలవంగా కనిపించడం స్టార్ట్ అయింది. కానీ తారక్ ఎక్కడా ఆగలేదు. బరువు అంత వేగంగా తగ్గడంతో ఆయన చుట్టూ ఉన్నవారంతా తెగ కంగారుపడిపోయారు. అందరూ నన్నే బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ భార్య (ప్రణతి) నాపై సీరియస్ అయింది. ఆయన తల్లి (శాలిని) నన్ను కోప్పడింది. చివరకు నా టీమ్ కూడా నాపై అసహనం వ్యక్తం చేసింది. కానీ నేనేం చేయలేదు బాబోయ్.. నేను జస్ట్ కొంచెం బరువు తగ్గమన్నాను. తారక్ ఏమో దాన్ని సీరియస్‌గా తీసుకుని విరుచుకుపడ్డాడు" అంటూ ప్రశాంత్ నీల్ నవ్వుతూ ఆనాటి సంగతులను పంచుకున్నారు.
'ఓజెంపిక్' రూమర్లకు చెక్ పెట్టిన ట్రైనర్
కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ లీన్ లుక్కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయినప్పుడు, అంత త్వరగా ఎలా బరువు తగ్గారంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. 'ఓజెంపిక్' (Ozempic) లాంటి వెయిట్ లాస్ ఇంజెక్షన్లు లేదా షార్ట్‌కట్స్ వాడారంటూ కొందరు పుకార్లు పుట్టించారు.
{{/usCountry}}కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ లీన్ లుక్కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయినప్పుడు, అంత త్వరగా ఎలా బరువు తగ్గారంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. 'ఓజెంపిక్' (Ozempic) లాంటి వెయిట్ లాస్ ఇంజెక్షన్లు లేదా షార్ట్‌కట్స్ వాడారంటూ కొందరు పుకార్లు పుట్టించారు.
{{/usCountry}}అయితే ఎన్టీఆర్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ ఈ రూమర్లకు గట్టిగా సమాధానం ఇచ్చారు. తారక్ ట్రాన్స్‌ఫర్మేషన్ 100% సహజమైనదని, కేవలం పక్కా క్రమశిక్షణ, క్యాలిక్యులేటెడ్ న్యూట్రిషన్, జిమ్‌లో గంటల తరబడి చేసిన కఠినమైన వర్కౌట్ల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
కేవలం మొదటి 7 వారాల్లోనే తారక్ ఏకంగా 9.5 కిలోల బరువు తగ్గినట్లు ఆయన వెల్లడించారు. ఈ లుక్ కోసం సినిమా షూటింగ్‌ను కూడా కొన్ని నెలలు వాయిదా వేయాల్సి వచ్చిందని, కానీ అవుట్‌పుట్ చూశాక ఆ ఆలస్యం వంద శాతం వర్త్ అని ప్రశాంత్ నీల్ సంతోషం వ్యక్తం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా, రుక్మిణీ వసంత్, బిజు మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.