...
...
Next Story

Jr NTR Injury: షాకింగ్.. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయం.. 8 వారాల రెస్ట్.. ఆగిపోయిన షూటింగులు

Jr NTR Injury: యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో డాక్టర్లకు ఆయనకు 6 నుంచి 8 వారాల రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. దీని కారణంగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న డ్రాగన్ మూవీ మరింత ఆలస్యం కానుంది.

Published on: Jul 27, 2026, 21:55:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jr NTR Injury: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. తాజాగా తారక్ భుజానికి తీవ్ర గాయమైంది. రీసెంట్‌గా హాస్పిటల్‌లో సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు డాక్టర్లు ఏకంగా 6 నుంచి 8 వారాల పాటు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్-ఇండియా సినిమాల షూటింగ్స్ తాత్కాలికంగా ఆగిపోయాయి.

Jr NTR Injury: షాకింగ్.. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయం.. 8 వారాల రెస్ట్.. ఆగిపోయిన షూటింగులు
Jr NTR Injury: షాకింగ్.. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయం.. 8 వారాల రెస్ట్.. ఆగిపోయిన షూటింగులు

ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్‌గా వచ్చిన ఈ హెల్త్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తారక్ భుజానికి ఈ గాయం ఎలా అయింది, షూటింగ్ సెట్స్‌లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా జరిగిందా లేదా జిమ్ వర్కౌట్స్ వల్ల జరిగిందా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

భయం వద్దు.. భరోసా ఇచ్చిన తారక్ టీమ్!

జూనియర్ ఎన్టీఆర్ కు తీవ్ర గాయం అనే వార్త తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తారక్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత టీమ్ స్పష్టం చేసింది. భుజం నొప్పి పూర్తిగా తగ్గిపోయి నార్మల్ అవ్వడానికి మాత్రమే డాక్టర్లు ఈ రెస్ట్ పీరియడ్ ఇచ్చారని తెలిపారు.

హెల్త్‌కు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ ఉన్నా అఫీషియల్‌గా వెల్లడిస్తామని మేకర్స్ భరోసా ఇచ్చారు. దీంతో తారక్ త్వరగా కోలుకుని మళ్లీ ఉల్లాసంగా సెట్స్‌లోకి అడుగుపెట్టాలని కోట్లాది మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'.. ఊహించని క్యారెక్టర్‌లో ఎన్టీఆర్

తాజా గాయం వల్ల ఈ 'డ్రాగన్' మూవీ యాక్షన్ సీక్వెన్సెస్ షూటింగ్ దాదాపు రెండు నెలల పాటు వాయిదా పడినట్లే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 'సలార్', 'కేజీఎఫ్' సినిమాలను మించేలా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో తారక్ సరసన కన్నడ బ్యూటీ, 'సప్త సాగరదాచే ఎల్లో' ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తోంది.

'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న తారక్ లైనప్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒకపక్క ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్న తారక్.. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గాడ్ ఆఫ్ వార్ మూవీలో నటించబోతున్నారు. ఈ మధ్యే మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే తారక్ కు గాయం, 8 వారాల రెస్ట్ తో ఆ మూవీ షూటింగ్ కూడా ఆలస్యం కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe