Jr NTR Varanasi: హైదరాబాద్‌లో జరిగిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రమోషనల్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేసిన అల్లరి సైగలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్ పై ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ, యాంకర్ సుమ 'వారణాసి' (Varanasi) సినిమా ముచ్చట తీయగానే, ఫ్రంట్ రోలో కూర్చున్న తారక్ పిచ్చిపిచ్చి సైగలు చేస్తూ తల పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫన్నీ మూమెంట్‌కు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతిమణి రమా రాజమౌళి పొట్టచెక్కలయ్యేలా నవ్వేశారు.
స్టేజ్ పై అసలు ఏం జరిగింది? తారక్ సైగలకు కారణమేంటి?

ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణంలో ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈవెంట్ నడుస్తుండగా సీనియర్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ, యాంకర్ సుమ స్టేజ్ పైకి వచ్చి మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అది చూసిన ఎన్టీఆర్ వెంటనే ఫ్రంట్ రో నుంచి రెండు చేతులూ ఊపుతూ, "ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు బాబాయ్" అన్నట్లు గాల్లో సైగలు చేశారు.
రమా రాజమౌళి కూడా 'వద్దొద్దు' అని చేత్తో సిగ్నల్ ఇవ్వగా, తారక్ తన నుదుటిపై కొట్టుకుంటూ చేతులు జోడించి దండం పెట్టేశారు. ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెషన్స్ చూసిన సుమ వెంటనే "వారణాసి ప్రమోషన్స్ టైమ్‌లోనే ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడదామని తారక్ చెప్తున్నారు" అని గ్రహించి మైక్‌లో స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో న్యూ మీమ్.. ఎన్టీఆర్ కార్తికేయ బాండింగ్
ఎన్టీఆర్ చేసిన ఈ సైగలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ "జస్ట్ తారక్ అన్న థింగ్స్", "న్యూ మీమ్ అన్‌లాక్డ్" అంటూ సరదా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
ఈవెంట్‌లో తారక్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ కార్తికేయతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 'స్టూడెంట్ నంబర్ 1' సినిమా టైమ్‌లో కార్తికేయ 9 ఏళ్ల పిల్లాడని, తన సొంత తమ్ముడిలాంటి వాడని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
{{/usCountry}}ఈవెంట్‌లో తారక్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ కార్తికేయతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 'స్టూడెంట్ నంబర్ 1' సినిమా టైమ్‌లో కార్తికేయ 9 ఏళ్ల పిల్లాడని, తన సొంత తమ్ముడిలాంటి వాడని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
{{/usCountry}}అలాగే మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ యాక్టింగ్‌ను ఎన్టీఆర్ విపరీతంగా పొగిడారు. 'బెంగళూరు డేస్' సినిమా నుంచి ఫహద్‌కి తాను బిగ్ ఫ్యాన్ అయ్యానని, ఆయనొక ఇన్స్‌పిరేషన్ అని కొనియాడారు.
'వారణాసి', 'డ్రాగన్' సినిమాల అఫీషియల్ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్
ఈ సరదా సన్నివేశం తర్వాత ఎన్టీఆర్ సరదాగా రాజమౌళిని ఆట పట్టిస్తూ.. "నేను నా డ్రాగన్ మూవీ అప్‌డేట్ ఇచ్చేలోపు, ఈయనగారు వారణాసి అప్‌డేట్ ఇస్తే బాగుంటుంది. అసలు ఏప్రిల్‌లో సినిమా వస్తుందో రాదో!" అని చమత్కరించారు.
దీనికి జక్కన్న బిగ్గరగా నవ్వుతూ సినిమా చెప్పిన సమయానికే వస్తుందని హింట్ ఇచ్చారు. ఆ తర్వాత వేదికపై ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాల విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్న మహేష్ బాబు 'వారణాసి' చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (NTR31) మూవీ 2026 జూన్ 11న థియేటర్లలోకి రాబోతోంది.