...
...
Next Story

Jyoti Poorvaj: రోజుకో ఫొటోతో హీట్ పెంచేస్తున్న గుప్పెడంత మనసు జగతి.. బికినీలో జ్యోతి పూర్వజ్.. మేడమ్ సార్ మేడమ్ అంతే!

Jyoti Poorvaj: జ్యోతి రాయ్ లేదా జ్యోతి పూర్వజ్.. ఇలా పేరు చెప్తే తెలుగు ఆడియన్స్ వెంటనే గుర్తుపట్టలేరు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి అనగానే అందరూ ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సీరియల్ తో అంతగా పాపులర్ అయిన జ్యోతి రాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ పోజులతో హీట్ పెంచేస్తోంది.

Published on: Aug 29, 2026, 19:13:48 IST
Advertisement

Jyoti Poorvaj: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జ్యోతి పూర్వజ్ తన గ్లామర్ షోతో హద్దులు చెరిపేస్తోంది. రోజుకో హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. తాజాగా బికినీలో ఉన్న పిక్స్ ను జ్యోతి పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు మేడం సార్ మేడం అంతే అని కామెంట్లు చేస్తున్నారు.

జ్యోతి పూర్వజ్ బికినీ షో

రోజుకో ఫొటోతో హీట్ పెంచేస్తున్న గుప్పెడంత మనసు జగతి.. బికినీలో జ్యోతి పూర్వాజ్.. మేడమ్ సార్ మేడమ్ అంతే! (instagram-JyotiPoorvaj)
రోజుకో ఫొటోతో హీట్ పెంచేస్తున్న గుప్పెడంత మనసు జగతి.. బికినీలో జ్యోతి పూర్వాజ్.. మేడమ్ సార్ మేడమ్ అంతే! (instagram-JyotiPoorvaj)

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో బికినీలో ఉన్న హాట్ ఫొటోలను జ్యోతి పూర్వాజ్ పోస్టు చేసింది. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. స్టార్ మాలో వచ్చిన గుప్పెడంత మనసు సీరియలో జగతి క్యారెక్టర్ లో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆమె.. ఇలా హాట్ షోకు దిగడంతో ఆడియన్స్ షాక్ అవుతున్నారు.

సీరియల్ లో అలా

దక్షిణాది చిత్రసీమలో తనదైన నటన, చెరగని గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది జ్యోతి పూర్వజ్. బుల్లితెరపై అదరగొట్టిన ఆమె.. 2017లో చేతన్ ముందాడి దర్శకత్వంలో వచ్చిన తుళు చిత్రం 'మడిపు' ద్వారా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది.

ఆ తర్వాత కన్నడ చిత్రసీమలో క్లాసిక్ హిట్ 'దియా' (2020)తో పాటు 'సప్లయర్ శంకర', 'గంధద గుడి', 'సీతారామ కళ్యాణం', '99', 'జర్సీ నంబర్ 10' (2023) వంటి సినిమాల్లో నటించింది.

కిల్లర్ మూవీ

నటిగా వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్న జ్యోతి పూర్వజ్, ప్రస్తుతం వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఫీమేల్ క్యారెక్టర్ కు ప్రాధాన్యమున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. పూర్వజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనులను ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

దీంతో పాటు 'హల్కా డాన్', సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న పాన్-ఇండియా చిత్రం 'ఎ మాస్టర్‌పీస్' వంటి ఆసక్తికరమైన చిత్రాల్లో జ్యోతి పూర్వాజ్ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ డోసుతో ట్రెండింగ్ లో కొనసాగుతోంది జ్యోతి పూర్వజ్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks