...
...
Next Story

కాంత ఓ మాస్టర్ పీస్.. దుల్కర్, భాగ్యశ్రీ నటన అద్భుతం.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత సినిమాకు పాజిటివ్ రివ్యూలు

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే నటించిన కాంత మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి రాగానే ఎక్స్‌లో టాప్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. అభిమానులు ఈ సినిమాను ఓ మాస్టర్ పీస్ అని, దుల్కర్, భాగ్యశ్రీ నటన అద్భుతమని రివ్యూలు ఇస్తున్నారు.

Published on: Dec 12, 2025, 18:18:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కాంత మూవీ థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ నటన తప్ప మూవీలో పెద్దగా ఏమీ లేదని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రం మొత్తం పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ఇదో మాస్టర్ పీస్ అని ఫ్యాన్స్ కొనియాడుతుండటం విశేషం.

నెట్‌ఫ్లిక్స్‌లోకి కాంత

కాంత ఓ మాస్టర్ పీస్.. దుల్కర్, భాగ్యశ్రీ నటన అద్భుతం.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత సినిమాకు పాజిటివ్ రివ్యూలు
కాంత ఓ మాస్టర్ పీస్.. దుల్కర్, భాగ్యశ్రీ నటన అద్భుతం.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత సినిమాకు పాజిటివ్ రివ్యూలు

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కాంత. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే శుక్రవారం (డిసెంబర్ 12) నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ వచ్చీ రాగానే ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. సోషల్ మీడియా ఎక్స్ లో తమ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. ఇదో మాస్టర్ పీస్ అని, దుల్కర్, భాగ్యశ్రీ, సముద్రఖని నటన అద్భుతమని అంటున్నారు.

ఓ సినిమాటిక్ క్లాసిక్

ఓ అభిమాని ఎక్స్ లో కాంత మూవీ గురించి ఇలా రాశారు. “దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీల నటన అద్భుతంగా ఉంది. వారి పాత్రల్లో జీవించారు. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ సన్నివేశాలు, ఆర్ట్ డైరెక్షన్, విజువల్స్ సినిమాకు క్లాసిక్ లుక్ తెచ్చాయి. సంగీతం కూడా సన్నివేశాలకు తగినట్లుగా చక్కగా కుదిరింది. పాత్రల మధ్య వచ్చే ఇగో క్లాషెస్ తో ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్ ఇన్వెస్టిగేషన్ జానర్‌లోకి మారి కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. క్లైమాక్స్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. మొత్తంగా ఇదొక ‘క్లాస్’ సినిమా” అని అనడం విశేషం.

కాంత ఓ మాస్టర్ పీస్

ఇక చాలా మంది సినిమాలో తమ ఫేవరెట్ సీన్లు ఏవో చెబుతూ పలు వీడియోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటనకే చాలా మంది ఫిదా అయ్యారు. అతనికి నేషనల్ అవార్డు గ్యారెంటీ అని ఓ అభిమాని అభిప్రాయపడ్డారు.

కాంత మూవీ గురించి..

కాంత ఓ పీరియాడికల్ డ్రామా మూవీ. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీతోపాటు సముద్రఖని, రానా దగ్గుబాటి కూడా నటించారు. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.36 కోట్లు మాత్రమే వసూలు చేసి ఓ ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం దీనికి మంచి రివ్యూలు వస్తుండటం మేకర్స్ కు కాస్త ఊరట కలిగిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks