OTT Today Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మ్యూజికల్ డ్రామా- తండ్రీకూతుళ్ల కథ- శాస్త్రీయ సంగీతం వర్సెస్ సినిమా పాటలు
Kacheri OTT Release Today: శాస్త్రీయ సంగీతం వర్సెస్ సినిమా పాటలు, తండ్రీకూతుళ్ల ప్రేమానుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన మ్యూజికల్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం కచేరి ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హృదయ విదారక కథనం కచేరి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.
Kacheri OTT Streaming Today: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో వైవిధ్యమైన తెలుగు కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఎప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త కంటెంట్ వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (అక్టోబర్ 11) ఓటీటీలోకి తెలుగు మ్యూజికల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం వచ్చేసింది.

కచేరి ఓటీటీ స్ట్రీమింగ్
అదే కచేరి (Kacheri) సినిమా. సంగీతం జీవనరేఖగా భావించిన ఒక తండ్రి, ఆయన ఆశయాన్ని అర్థం చేసుకోలేక దూరమైన కూతురి మధ్య సాగే హృదయ విదారక కథాంశంతో రూపుదిద్దుకున్న తండ్రికూతుళ్ల కథనే కచేరి. అక్టోబర్ 11 నుంచి ఈ కచెరి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన శాస్త్రికి తన కూతురితో కలసి ఒకే వేదికపై సంగీత 'కచేరి' నిర్వహించాలనేది జీవిత ఆశయం. మారుతున్న కాలంతో పాటు పాశ్చాత్య ధోరణులు పెరగడం, సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంది.
కచేరి నిర్వహించడానికి
అయితే, ఆ కచేరికి భారీగా ఖర్చు అవడంతోపాటు ఆ నిర్వాహకులు ఎక్కువగా సినిమా పాటలను ఎంకరేజ్ చేస్తుంటారు. శాస్త్రీయ సంగీతం వర్సెస్ సినిమా పాటలు అన్నట్లుగా ఆ కచేరికి పోటీ ఉంది. కాకపోతే ఎంత కష్టమైన కూతురుతో కచేరి నిర్వహించాలని తండ్రి ఆరాటపడుతుంటాడు.
తండ్రి పడే తపనను, సంగీతంపై ఆయనకున్న పిచ్చి ప్రేమను కూతురు అర్థం చేసుకోలేకపోతుంది. బతుకుదెరువు కోసం, తన కలల కోసం తండ్రిని వదిలేసి నగరానికి వెళ్లిపోతుంది కూతురు. ఏళ్ల తరబడి నగర జీవితంలో గడిపిన కూతురు, చాలా కాలం తర్వాత తిరిగి ఇంటికి వస్తుంది.
కన్నీరు పెట్టించే ట్విస్టులు
ఆ తర్వాత ఏం జరిగింది? కూతురు తిరిగి వచ్చే సమయానికి తండ్రి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? చివరికి తండ్రి కలను, కళను కూతురు అర్థం చేసుకుందా? లేదా? కూతురుతో కచేరి నిర్వహించాలన్న తండ్రి కోరిక నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కచేరి సినిమా కథ.
శాస్త్రి పాత్రలో అప్పాజీ అంబరీష్ జీవించగా, కూతురి పాత్రలో అనీషా దామా తన సహజ నటనతో అకట్టుకుంది. బాలా కామేశ్వరి కీలక పాత్రలో మెప్పించారు. శివసాయి వర్ధన్ జే ఈ కథను సమకూర్చడంతో పాటు అద్భుతమైన సంభాషణలు, దర్శకత్వంతో ప్రతి సన్నివేశాన్ని మలిచారు.
కథలోని భావోద్వేగాలు
ప్రణీత బండ్రెడ్డి నిర్మాణ విలువలు మెరుగ్గా ఉన్నాయి. శ్రీధర్ కేవీ ఛాయాగ్రహణం గ్రామీణ వాతావరణానికి, శాస్త్రీయ సంగీత ప్రపంచానికి ప్రాణం పోసింది. మిహిరాంశ్ అందించిన సంగీతం, చక్రవర్తి బొవ్రోతు ఎడిటింగ్ వర్క్ కథలోని భావోద్వేగాలను సరిగ్గా ప్రేక్షకులకు చేరవేశాయి.
మన సంస్కృతి, సంప్రదాయాలు, కనుమరుగవుతున్న కళలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని కచేరి సినిమా ఎంతో సూటిగా గుర్తుచేస్తుంది. ఓటీటీలో వస్తున్న క్రైమ్, బోల్డ్ కంటెంట్ మధ్య 'కచేరి' ఒక స్వచ్ఛమైన మ్యూజికల్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది.
ఈటీవీ విన్ ఓటీటీలో
ఇంతటి ఎమోషనల్ డ్రామా సినిమా కచేరి ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్‌లో కచేరి ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది ఈ కచేరి సినిమా. కాబట్టి, తెలుగు ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడేవారు ఈటీవీ విన్ ఓటీటీలో కచేరి సినిమాను ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


