Kajal Aggarwal: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా సౌత్ సినిమాలలో హీరోయిన్ల గ్లామర్ ప్రెజెంటేషన్, పాతకాలపు కమర్షియల్ సాంగ్స్ మేకింగ్ స్టైల్‌పై ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా హీరోయిన్ల నాభి ప్రదర్శనపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మూవీ ప్రమోషన్

కాజల్ అగర్వాల్ తన అప్‌కమింగ్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూలో యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సౌత్ ఇండియన్ సినిమాలలో హీరోయిన్ల బొడ్డును (Navel) ప్రదర్శించడంపై ఒక రకమైన అబ్సెషన్ (Obsession) ఉంటుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు.
నా బొడ్డుపై పండ్లు విసరనివ్వలేదు
ఈ ప్రశ్నకు కాజల్ చాలా సున్నితంగా స్పందిస్తూ.. "అలాంటి ట్రెండ్స్ గతంలో ఉండేవన్న మాట వాస్తవమే కావచ్చు. కానీ కాలక్రమేణా సౌత్ ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా మారాయి" అని చెప్పింది. అయితే యాంకర్ అంతటితో ఆగకుండా మరింత లోతుగా ప్రశ్నించగా.. కాజల్ చాలా బోల్డ్‌గా క్లారిటీ ఇచ్చింది.
"నేను నా సుదీర్ఘ కెరీర్‌లో అలాంటి సీన్స్‌లో ఎప్పుడూ భాగం కాలేదు. నా బొడ్డుపై పండ్లు విసిరే కమర్షియల్ సీన్లకు నేను ఎన్నడూ అంగీకరించలేదు. ఎవరినీ అలా చేయనివ్వలేదు" అని సంచలన విషయాలు చెప్పింది.
90ల నాటి ట్రెండ్
టాలీవుడ్‌లో ముఖ్యంగా 1990ల కాలంలో కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల నాభిపై పండ్లు, పూలు లేదా నీటి చుక్కలు వేయడం అనేది ఒక సక్సెస్ ఫార్ములాగా ఉండేది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మార్క్ సినిమాల్లో ఇది ఎక్కువగా కనిపించేది.
అయితే 2000ల కాలంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన కాజల్, గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ తనకంటూ కొన్ని గీతలు గీసుకున్నానని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా కోసమే
{{/usCountry}}అయితే 2000ల కాలంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన కాజల్, గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ తనకంటూ కొన్ని గీతలు గీసుకున్నానని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా కోసమే
{{/usCountry}}ఒకప్పుడు కమర్షియల్ సినిమాలో హీరోయిన్ అంటే కేవలం పాటల కోసమే అనే నరేటివ్ ఉండేది. కానీ కాజల్ అగర్వాల్ లాంటి నటీమణులు కమర్షియల్ స్పేస్‌లో ఉంటూనే తమ పర్సనల్ బౌండరీస్‌ను కాపాడుకున్నారు. కాజల్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక స్ట్రాటజిక్ రీజన్ కూడా ఉంది.
ఆమె నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ పూర్తిగా ఉమెన్-సెంట్రిక్ అండ్ కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్. ఇలాంటి సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో, మహిళలను కేవలం గ్లామర్ ఆబ్జెక్ట్స్‌గా చూపించే పాత పద్ధతులపై ఆమె క్లారిటీ ఇవ్వడం మహిళా ప్రేక్షకుల్లో ఆమెపై గౌరవాన్ని, సినిమాపై పాజిటివ్ బజ్‌ను మరింత పెంచుతుంది.