...
...
Next Story

Kajal Aggarwal: తృటిలో ప్రాణాలతో బయటపడ్డా..ఆ దేవుడే నా చేయి పట్టి లాగాడు.. షూటింగ్ లో ముగ్గురు చనిపోయారు: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఇండియన్ 2 మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘోర ప్రమాదం గురించి ఆమె తాజాగా మాట్లాడారు. ఆ సమయంలో చావు నుంచి కొద్దిలో తప్పించుకున్నానని ఆమె చెప్పారు. ఆ దేవుడే కాపాడాడని కాజల్ ఎమోషనల్ అయ్యారు.

Published on: Nov 13, 2026, 11:14:43 IST
Advertisement

Kajal Aggarwal: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'భారతీయుడు 2' షూటింగ్ సమయంలో జరిగిన ఘోరమైన క్రేన్ ప్రమాదాన్ని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా గుర్తుచేసుకున్నారు. ఆ భయంకరమైన రాత్రి తన కళ్ల ముందే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, తాను తృటిలో ప్రాణాపాయం నుంచి అదృష్టవశాత్తూ ఎలా బయటపడిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు.

మృత్యువును జయించిన క్షణాలు

తృటిలో ప్రాణాలతో బయటపడ్డా..ఆ దేవుడే నా చేయి పట్టి లాగాడు.. షూటింగ్ లో ముగ్గురు చనిపోయారు: కాజల్ అగర్వాల్ (instagram-Kajal A Kitchlu)
తృటిలో ప్రాణాలతో బయటపడ్డా..ఆ దేవుడే నా చేయి పట్టి లాగాడు.. షూటింగ్ లో ముగ్గురు చనిపోయారు: కాజల్ అగర్వాల్ (instagram-Kajal A Kitchlu)

2020 ఫిబ్రవరి నెలలో చెన్నై సమీపంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో 'భారతీయుడు 2 (ఇండియన్ 2)' షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక భారీ క్రేన్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సినిమా సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆ మృతుల కుటుంబాలకు కమల్ హాసన్, లైకా ప్రొడక్షన్స్ భారీగా ఆర్థిక సహాయం కూడా అందించారు. ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'తో ముచ్చటించిన కాజల్ అగర్వాల్.. ఆ రోజు జరిగిన భయానక సంఘటనను తలచుకున్నారు.

కుప్పకూలిన 100 అడుగుల క్రేన్

ఆ రోజు రాత్రి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. కాజల్ 80 ఏళ్ల వృద్ధురాలి గెటప్ కోసం ప్రోస్థెటిక్ మేకప్ వేసుకుని ఉన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అందరూ పరుగులు తీయడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో అర్థంకాక కాజల్ కూడా కంగారుగా వారితో పాటే పరిగెత్తారు.

ఆ చీకట్లో పరుగులు తీస్తూ ఆమె ఒక టేబుల్ కు ఢీకొట్టి కాజల్ అగర్వాల్ ఆగిపోయారు. అసలు ఎందుకు పరిగెత్తుతున్నానని వెనక్కి తిరిగి చూసేసరికి సుమారు 100 అడుగుల ఎత్తు ఉన్న భారీ క్రేన్ సరిగ్గా తన వైపుగా దూసుకురావడం చూసి షాక్ అయ్యారు.

దేవుడి దయ వల్లే

ఆ చేతులు ఎవరివో ఇప్పటికీ నాకు తెలియదు. నా స్టాఫ్ వచ్చి లాగారేమో అని అడిగాను, కానీ వాళ్లంతా దూరంగా ఉన్నారు. కచ్చితంగా ఆ దేవుడే నన్ను కాపాడాడని నమ్ముతున్నాను" అని కాజల్ ఎమోషనల్ అయ్యారు.

ఇండియన్ 2 ఇలా

భారీ అంచనాల మధ్య 2024లో విడుదలైన 'భారతీయుడు 2' ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైంది. రన్‌టైమ్, స్క్రీన్ ప్లే లో ఎమోషన్స్ మిస్ అవ్వడం వల్ల నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమల్ హాసన్, సిద్ధార్థ్, ఎస్.జె. సూర్య నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూలు చేసింది.

'రామాయణం'లో మండోదరిగా

కాజల్ అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె రీసెంట్ గా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణం' సినిమాలో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks