Sekhar Master: స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు పెద్ద యాక్సిడెంట్- ఒరిగిన లారీ- కాకా సాంగ్ షూటింగ్ నుంచి వస్తూ!

Sekhar Master: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు తీవ్రమైన యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. ఆ ప్రమాదంలో ఆయన కారు వెనుక భాగం నుజ్జునుజ్జయిందని సమాచారం. కానీ శేఖర్ మాస్టర్ కు ఏం కాలేదని, ప్రాణాలతో బయటపడ్డారని తెలిసింది. 

Published on: Nov 12, 2026, 11:22:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sekhar Master: స్టార్ హీరోలతో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేయిస్తూ పాపులర్ అయిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. యాక్సిడెంట్ సమయంలో శేఖర్ మాస్టర్ అదే కారులో ఉన్నారు.

శేఖర్ మాస్టర్ కారుకు తీవ్ర ప్రమాదం-ప్రాణాలతో బయటపడ్డ స్టార్ కొరియోగ్రాఫర్-కాకా సాంగ్ షూటింగ్ నుంచి వస్తూ!
శేఖర్ మాస్టర్ కారుకు తీవ్ర ప్రమాదం-ప్రాణాలతో బయటపడ్డ స్టార్ కొరియోగ్రాఫర్-కాకా సాంగ్ షూటింగ్ నుంచి వస్తూ!

శేఖర్ మాస్టార్ కారుకు యాక్సిడెంట్

సూపర్ హిట్ పాటలకు తనదైన టాప్ కొరియోగ్రఫీతో దూసుకెళ్తున్నారు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కొరియోగ్రాఫర్లలో ఆయన ఒకరు. అలాంటి మాస్టర్ కు తాజాగా కారు ప్రమాదం జరిగింది. పండ్ల లోడ్ తో వస్తున్న ఓ లారీ అదుపు తప్పి శేఖర్ మాస్టర్ కారు వెనుక భాగాన్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.

ప్రాణాలతో బయటపడ్డ మాస్టర్

ఈ యాక్సిడెంట్ నుంచి శేఖర్ మాస్టర్ ప్రాణాలతో బయటపడ్డారు. అతి వేగంగా వచ్చి ఢీ కొట్టిన ఆ లారీ తర్వాత కారు వెనుక భాగంపైనే పడిపోయింది. శంషాబాద్ లో ఈ ప్రమాదం జరిగిన చోట చూస్తే పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శేఖర్ మాస్టర్ కు ఏం జరిగిందోననే ఆందోళన నెలకొంది. కానీ ఆయనకు పెద్దగా గాయాలు కాలేదని తెలిసింది.

కాకా సాంగ్

చిరంజీవి హీరోగా నటిస్తున్న కాకా మూవీ షూటింగ్ నుంచి వస్తున్నప్పుడే శేఖర్ మాస్టర్ కారుకు యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ఓ మాస్ సాంగ్ కు శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారని సమాచారం. ఈ సాంగ్ వేరే లెవల్ లో ఉండబోతుందని టాక్. ఈ మెగాస్టార్ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.

కెరీర్ ఇలా

విజయవాడలో పుట్టిన శేఖర్ మాస్టర్ అంచెలంచెలుగా ఎదిగారు. మూవీ కొరియోగ్రాఫర్ కావడానికి ముందు ఆయన ఆరు సంవత్సరాలు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా, ఎనిమిదేళ్లు అసిస్టెంట్ గా పని చేశారు. 2007లో వచ్చిన మంత్ర సినిమాలోని ఊహల్లోన అనే సాంగ్ తో ఆయన మూవీ కొరియోగ్రాఫర్ గా మారారు. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోలేదు.

హుక్ స్టెప్పులు

స్టార్ హీరోలందరితోనూ శేఖర్ మాస్టర్ పని చేశారు. ముఖ్యంగా ఆయన హుక్ స్టెప్ లు బాగా పాపులర్. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, చిరంజీవి, రామ్ పోతినేని, నాగ చైతన్య, నితిన్, నాని, మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ తదితర స్టార్లతో శేఖర్ మాస్టర్ స్టెప్పులేయించాడు. మహేష్ బాబుతోనూ మాస్ స్టెప్పులేయించిన క్రెడిట్ ఆయన సొంతం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More