Sing Geetham: షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన కమల్ హాసన్.. సింగ్ గీతం మూవీ ఆయన చేయాల్సిందా? 45 ఏళ్ల సింగీతం కల

Sing Geetham Movie Event: 94 ఏళ్ల వయసులో మళ్లీ  మెగా ఫోన్ చేతబట్టిన సింగీతం శ్రీనివాస రావు.. ‘సింగ్ గీతం’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్ గా వచ్చిన కమల్ హాసన్.. ఈ సినిమా గురించి షాకింగ్ ఫ్లాస్ బ్యాక్ చెప్పారు.

Published on: Jun 7, 2026, 13:53:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sing Geetham Movie Event: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ అనే చెప్పాలి. 'పుష్పక విమానం' (మైమ్ మూవీ), 'అపూర్వ సహోదరులు' (గుజ్జు క్యారెక్టర్), 'మైఖేల్ మదన కామరాజు' లాంటి క్లాసిక్స్‌తో సినిమా చరిత్రను తిరగరాసిన ఈ గురుశిష్యులు మరోసారి కలిసి కనిపించారు.

సింగ్ గీతం మూవీ స్టోరీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
సింగ్ గీతం మూవీ స్టోరీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

సింగ్ గీతం మూవీ

94 ఏళ్ల వయసులోనూ ఒక టీనేజర్‌లాంటి ఉత్సాహంతో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'సింగ్ గీతం' (Sing Geetham). వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై గ్లోబల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. జూన్ 11, 2026 న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో నిర్వహించిన సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సింగ్ గీతం సినిమా వెనుక ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్లాష్‌బ్యాక్‌ను షేర్ చేసుకున్నారు.

21 ఏళ్ల వయసులోనే

ఈ ఈవెంట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తన కెరీర్ ఆరంభ రోజులను, సింగీతం గారితో ఉన్న 50 ఏళ్ల నాటి అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

"నా 21 ఏళ్ల వయసులోనే సింగీతం గారిని కలిసి సినిమా చేసే అదృష్టం నాకు దక్కింది. అప్పుడు నాకు రెండు స్టోరీలు చెప్పారు. ఒకటేమో సినిమాగా వచ్చింది. ఇంకో దాని గురించి మాట్లాడుకుంటూనే వచ్చాం. కానీ సినిమాగా తీయలేదు. అదే సింగ్ గీతం మూవీ’’ అని కమల్ హాసన్ చెప్పారు.

45 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

‘‘నిజానికి ఇప్పుడు నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' లాంటి సినిమాను దాదాపు 45 ఏళ్ల క్రితమే నాతో చేయాలని సింగీతం గారు అనుకున్నారు. అప్పట్లోనే ఈ కథను నాకు వినిపించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు నా 71 ఏళ్ల వయసులో సింగీతం గారి సినిమా థియేటర్లలోకి వస్తుండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది" అని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

'పుష్పక విమానం' కంటే ముందే పుట్టిన ఐడియా!

ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని నిర్మాత నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. గతంలో ఆయన కమల్ హాసన్‌ను కలిసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందట. సింగీతం గారి ఆల్‌టైమ్ క్లాసిక్ మూకీ చిత్రం 'పుష్పక విమానం' కంటే ముందే ఈ 'సింగ్ గీతం' కథను కమల్ కు సింగీతం వినిపించారు.

ఇండియాలోనే ఫస్ట్ టైమ్

ఈ సింగ్ గీతం సినిమా టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాదు.. టోటల్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ ఎక్స్‌పెరిమెంట్‌గా నిలవబోతోంది. ఈ సినిమాలో సాధారణ డైలాగులు ఉండవు. పాత్రల మధ్య జరిగే సంభాషణలు, ప్రతి ఒక్క మాట పాటల రూపంలోనే సాగుతాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి నాన్-స్టాప్ మ్యూజికల్ స్కోర్ అందించారు. ఇందులో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రల్లో నటించారు.

94 ఏళ్ల వయసులో సింగీతం ప్రయోగం

ఈ కాలంలో కమర్షియల్ ఫార్ములాలు, ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్లు ఉంటేనే నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అలాంటిది 94 ఏళ్ల దర్శకుడి నమ్మకాన్ని గౌరవిస్తూ, ఒక ప్యూర్ మ్యూజికల్ ఫాంటసీ సినిమాను నిర్మించినందుకు నాగ్ అశ్విన్‌ను అభినందించాల్సిందే.

ఒకప్పుడు డైలాగ్స్ లేకుండా 'పుష్పక విమానం' తీసి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసిన సింగీతం.. ఇప్పుడు కేవలం పాటలతోనే సినిమా నడిపిస్తూ 'సింగ్ గీతం' తీసుకురావడం ఆయన జీనియస్‌ తనానికి నిదర్శనం. కమల్ హాసన్ చెప్పినట్లు 45 ఏళ్ల క్రితం మిస్ అయిన మ్యాజిక్‌ను, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాయంతో సరికొత్త జనరేషన్ ప్రేక్షకులకు అందించబోతున్నారు. జూన్ 11న థియేటర్లలో ఈ ప్రయోగం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

FAQ: People Also Ask

1. సింగ్ గీతం సినిమా ప్రత్యేకత ఏమిటి?

జవాబు: ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి 'మ్యూజికల్ ఫాంటసీ' చిత్రం. ఇందులో పాత్రల మధ్య సాధారణ మాటలు ఉండవు, ప్రతి సంభాషణ నాన్-స్టాప్ పాటల రూపంలోనే సాగుతుంది.

2. సింగ్ గీతం సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు?

జవాబు: ఈ చిత్రం జూన్ 11, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

3. ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారా?

జవాబు: లేదు. కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడం లేదు. 45 ఏళ్ల క్రితం ఆయనతో చేయాల్సిన కథ ఇది. కానీ ఇప్పుడు సరికొత్త తారాగణంతో (అయాన్, అహల్యా బమ్రూ) సింగీతం తెరకెక్కించడంతో కమల్ ఈ చిత్ర వేడుకకు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసి చిత్ర యూనిట్‌ను బ్లెస్ చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More