అKangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో భారీ వివాదానికి తెరలేపారు. నేటితరం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన కొంతమంది హిందూ యువతులను ఉద్దేశించి ఆమె 'జెనరేషన్ గట్టర్' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యత లేకుండా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

గతంలో కూడా జెన్ జీ (Gen Z) యూత్ ప్రవర్తనపై విమర్శలు గుప్పించిన ఈ నటి.. ఇప్పుడు మరోసారి పాశ్చాత్య పోకడలపై ఓపెన్ నోట్ రాసుకొచ్చారు.
బాధ్యత లేని స్వేచ్ఛ దండగ.. కంగనా ఇన్‌స్టాగ్రామ్ నోట్
కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ.. స్వతంత్రంగా ఎదిగిన ఉద్యోగినులను అనుకరించాలని చూస్తున్న కొంతమంది యువతుల ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉందన్నారు. స్వేచ్ఛను కష్టపడి సంపాదించుకోకుండా కేవలం హక్కుల గురించి మాట్లాడటం సరికాదని విమర్శించారు.
నిజంగా స్వతంత్రంగా బతికే మహిళలు కష్టపడి పైకొస్తారని, వాళ్లు బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటారని కంగనా కొనియాడారు. సొంత కాళ్లపై నిలబడే మహిళలు ఏదీ తల్లిదండ్రుల డబ్బుతో చేయరని, తమ నిర్ణయాలకు తామే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు.
"వాళ్లు జెనరేషన్ గట్టర్".. డ్రగ్స్, ఆల్కహాల్‌పై ఫైర్!
సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని కొత్తతరం భారతీయ మహిళలు తయారయ్యారని కంగనా మండిపడ్డారు. "వాళ్లు చదువుల్లో సరిగ్గా రాణించలేరు. పోనీ ఇల్లు చక్కబెట్టుకునే గృహిణులుగా మారే అర్హత కూడా వారికి లేదు" అని సెటైర్లు వేశారు.
తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడుతూ డ్రగ్స్, ఆల్కహాల్, బాడీ కౌంట్స్ అంటూ ఫ్యాషన్ పేరుతో జల్సాలు చేయడాన్ని కొందరు గొప్పగా ఫీలవుతున్నారని ఫైర్ అయ్యారు. నిజమైన ఇండిపెండెంట్ లైఫ్ సాధించకుండా బాధ్యత లేకుండా బతకాలనుకుంటే వాళ్లు 'గట్టర్ చాప్' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
జెన్ జీ రీల్స్‌పై గతంలో వివాదాస్పద కామెంట్స్
యువతపై కంగనా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. రీసెంట్గా నీట్ (NEET) పేపర్ లీక్ ఆందోళనల సమయంలో జెన్ జీ యూత్ చేసిన వైరల్ రీల్స్‌పై కూడా ఆమె సంచలన కామెంట్స్ చేశారు.
{{/usCountry}}యువతపై కంగనా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. రీసెంట్గా నీట్ (NEET) పేపర్ లీక్ ఆందోళనల సమయంలో జెన్ జీ యూత్ చేసిన వైరల్ రీల్స్‌పై కూడా ఆమె సంచలన కామెంట్స్ చేశారు.
{{/usCountry}}ఆ రీల్స్ చూస్తే తనకు డిజిటల్ డిటాక్స్ చేసుకోవాలనిపించిందని కంగనా ఎద్దేవా చేశారు. తమను తాము బొద్దింకలతో పోల్చుకుంటూ చెత్తను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారని ఆమె ఆ సమయంలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంగనా కెరీర్.. పొలిటికల్, సినిమా అప్‌డేట్స్
కంగనా సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ఈ మధ్యే తన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మనోజ్ తపాడియా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా 2008 ముంబై తీవ్రవాద దాడుల్లో కామా హాస్పిటల్ నర్సులు, సిబ్బంది చేసిన సాహసాల ఆధారంగా తెరకెక్కింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలతోనే కాదు తరచూ ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ తోనూ ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తోంది.