బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కేదార్‌నాథ్ వెళ్లాలంటే కచ్చితంగా తన మతం, విశ్వాసం గురించి ఒక అఫిడవిట్ రాసివ్వాలని బద్రీ-కేదార్ టెంపుల్ కమిటీ (BKTC) ఛైర్మన్ హేమంత్ ద్వివేది చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అవుతున్నాయి. ఈ ఇష్యూపై యాక్టర్, మండి ఎంపీ కంగనా రనౌత్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. సారా కూడా సనాతనియే అని, ఆ నిజాన్ని రాసివ్వడానికి ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదని కంగనా తేల్చి చెప్పింది.
అఫిడవిట్ ఇస్తే తప్పేంటి? - కంగనా కామెంట్స్

పార్లమెంట్ సెషన్స్‌కు వెళ్లే ముందు బుధవారం (మార్చి 18) మీడియాతో మాట్లాడిన కంగనాకు ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె చాలా స్ట్రాంగ్‌గా ఆన్సర్ ఇచ్చింది.
"ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సనాతనులే. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఉన్నది అదే. సనాతన ధర్మానికి ఆది, అంతం లేదు. మిగతా మతాలన్నీ మహా అయితే వెయ్యి, పదిహేనొందల ఏళ్ల క్రితం పుట్టినవి. కానీ సనాతన ధర్మం మాత్రమే అసలైన నిజం. సారా అలీ ఖాన్ కూడా సనాతనియే. మరి ఆ నిజాన్ని పేపర్ మీద రాసివ్వడానికి ఆమె ఎందుకు భయపడాలి? రాసిచ్చేయొచ్చు కదా" అని కంగనా తన ఒపీనియన్ చెప్పింది.
అసలు టెంపుల్ కమిటీ ఛైర్మన్ ఏమన్నారంటే..
మంగళవారం (మార్చి 17) జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో బీకేటీసీ (BKTC) ఛైర్మన్ హేమంత్ మాట్లాడుతూ ఒక కొత్త ప్రపోజల్ గురించి చెప్పారు.
హిందువులు కాకుండా వేరే మతాలకు చెందిన వాళ్లు బద్రీనాథ్, కేదార్‌నాథ్ టెంపుల్స్‌లోకి ఎంటర్ అవ్వాలంటే కచ్చితంగా వాళ్లు సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని నమ్ముతున్నట్లు ఒక అఫిడవిట్ లేదా రిటన్ డిక్లరేషన్ సబ్‌మిట్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఏప్రిల్‌లో మొదలుకాబోయే 'చార్ ధామ్ యాత్ర' కంటే ముందే ఈ ప్రపోజల్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పంపించేశారు.
{{/usCountry}}ఏప్రిల్‌లో మొదలుకాబోయే 'చార్ ధామ్ యాత్ర' కంటే ముందే ఈ ప్రపోజల్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పంపించేశారు.
{{/usCountry}}ముఖ్యంగా సారా అలీ ఖాన్ గురించి అడిగినప్పుడు.. "సారాకు సనాతన ధర్మం మీద భక్తి, నమ్మకం ఉంటే, ఆ విషయాన్ని ఆమె ఒక అఫిడవిట్ ద్వారా సబ్‌మిట్ చేస్తే కచ్చితంగా ఆమెకు దేవుడి దర్శనం దొరుకుతుంది" అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
కేదార్‌నాథ్ నా పర్సనల్ ఎమోషన్: సారా అలీ ఖాన్
సారా అలీ ఖాన్ తండ్రి సైఫ్ అలీ ఖాన్ ముస్లిం కాగా, తల్లి అమృతా సింగ్ సిక్కు మతానికి చెందిన ఆవిడ. అయితే సారాకు కేదార్‌నాథ్ అంటే చాలా ఇష్టం. ఆమె తరచుగా ఆ టెంపుల్‌కు వెళ్తూ ఉంటుంది. దీనిపై 2025 టైమ్స్ నౌ సమ్మిట్‌లో సారా మాట్లాడుతూ.. "నేను యాక్టర్ అవ్వకముందు నుంచే కేదార్‌నాథ్‌కు వెళ్తున్నాను. జనాలు నన్ను మెచ్చుకోవాలని నేను అక్కడికి వెళ్లట్లేదు. కేదార్‌నాథ్ అనేది నా పర్సనల్ ట్రిప్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకొచ్చే నష్టం లేదు. నేను ఆ గుడిలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా, కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతాను" అని విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది.