క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాలు, ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా? ఇలా చేస్తే మాత్రం సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు!

సనాతన ధర్మాలను పూర్వికులు ఊరికే చెప్పలేదు. ప్రతి విషయం వెనక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. అయితే పూర్వం పాటించే ఈ నియమాలను చాలా మంది ఇప్పుడు పాటించడం మానేశారు. మరి క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా? 

Published on: Jan 30, 2026, 13:30:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పూర్వికులు చెప్పిన పురాతన పద్ధతులను ఇంకా చాలామంది పాటిస్తున్నారు. అయితే, ఎక్కువ మంది వీటిని మర్చిపోతున్నారు. క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి రోజూ తెలుసుకుందాం.

క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాలు, ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా? (pinterest)
క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాలు, ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా? (pinterest)

సనాతన ధర్మాలు

సనాతన ధర్మాలను పూర్వికులు ఊరికే చెప్పలేదు. ప్రతి విషయం వెనక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. అయితే పూర్వం పాటించే ఈ నియమాలను చాలా మంది ఇప్పుడు పాటించడం మానేశారు. మరి క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.

క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాలు

  1. సోమవారం నాడు తలకి నూనె రాసుకోకూడదని పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ పొరపాటు చేయకుండా చూసుకోండి.
  2. అలాగే ఒంటి కాలిపై నిలబడటం మంచిది కాదు.
  3. శుక్రవారం నాడు కోడలిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటికి పంపించకూడదు. ఇది కూడా చాలా మంది మర్చిపోతున్నారు.
  4. మంగళవారం పుట్టింటి నుంచి కూతురిని అత్తవారింటికి పంపించడం కూడా మంచిది కాదు. ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుని పాటించడం మంచిది.
  5. గుమ్మడికాయను తెచ్చుకునేటప్పుడు ముక్కలను మాత్రమే ఇంటికి తీసుకురావాలి.
  6. ఇంటి లోపల ఎట్టి పరిస్థితుల్లో గోళ్లను కత్తిరించుకోకూడదు.
  7. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో ఉన్న చెత్తను బయట పారేయడం మంచిది కాదు.
  8. పెరుగు, ఉప్పును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు.
  9. వేడి అన్నంలో పెరుగు వేసుకోవడం కూడా మంచిది కాదు.
  10. గడపను తొక్కకూడదు. గడపను దాటి మాత్రమే వెళ్లాలి.
  11. భోజనం మధ్యలో లేచి వెళ్లడం మంచిది కాదు.
  12. తల వెంట్రుకలను ఇంట్లో పడేయడం కూడా మంచిది కాదు.
  13. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇల్లు తుడిచి వెళ్లడం మంచిది కాదు. అలాగే ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఇల్లు తుడవకూడదు.
  14. రాత్రిపూట బట్టలు ఉతకడం మంచిది కాదు.
  15. విరిగిపోయిన గాజులను వేసుకోవడం కూడా మంచిది కాదు.
  16. గోడలకు పాదాలు ఆనించి పడుకోవడం కూడా మంచిది కాదు.
  17. నిద్ర లేచాక పడుకున్న చాపను లేదా దుప్పట్లను వెంటనే మడవకుండా వదిలేయకూడదు.
  18. చేతి గోళ్లను కొరకడం మంచిది కాదు.
  19. పొరపాటున కూడా అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోవడం మంచిది కాదు.
  20. సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోవడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేయకూడదు.

ఐశ్వర్యం కలగాలంటే వీటిని పాటించండి

ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే ఒక కలబంద మొక్కను పెంచండి. మంగళవారం నాడు బెల్లం నీళ్లు కలబంద మొక్కకు పోస్తే చాలా మంచి జరుగుతుంది. దరిద్రం కూడా తొలగిపోతుంది.

శంకు పుష్పాల మొక్కను ఇంట్లో పెంచితే ఆ ఇల్లు దేవాలయంలా మారిపోతుంది.

సాయంత్రం పూట ఇంట్లో దీపం వెలిగిస్తే సంపద పెరుగుతుంది.

తులసి మొక్కకు నీళ్లు పోస్తే పవిత్రత పొందుతారు.

ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి.

శనివారం నాడు నూనె దీపం వెలిగిస్తే ఆనందకరమైన జీవితాన్ని గడపొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More