Anant Nag: ఇండియన్ సినీ రంగానికి చేసిన అమూల్యమైన సేవలకుగానూ వర్సటైల్ లెజెండరీ నటుడు అనంత నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024'తో గౌరవించింది. గుజరాత్‌లోని కెవాడియా వేదికగా సెప్టెంబర్ 22, 2026న జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (72nd National Film Awards) ప్రదానోత్సవంలో ఈ గొప్ప పురస్కారాన్ని అందించనున్నారు.

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సాగిన అనంత నాగ్ సుదీర్ఘ ప్రయాణం రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తి అని కొనియాడింది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రశంసలు
ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటన రాగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా అనంత నాగ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. "లెజెండరీ నటుడు అనంత నాగ్ జీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడంతో నా సంతోషాన్ని పంచుకుంటున్నాను" అని ప్రధాని పేర్కొన్నారు.
అనంత నాగ్ ప్రదర్శించిన నటన, ఆయన కనబరిచిన వైవిధ్యం భారతీయ సినిమాలో, ముఖ్యంగా కన్నడ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిందని మోదీ కొనియాడారు. ఆయన ఏ పాత్ర పోషించినా అందులో జీవించేవారని, ఈ అవార్డు ఆయన ప్రతిభకు దక్కిన సరైన గుర్తింపు అని చెప్పారు.
అనంత నాగ్ ప్రొఫైల్, అవార్డులు
పూర్తి పేరు : అనంత నాగరకట్టె (Anant Nag)
పుట్టిన తేదీ : సెప్టెంబర్ 4, 1948
{{/usCountry}}పుట్టిన తేదీ : సెప్టెంబర్ 4, 1948
{{/usCountry}}కెరీర్ : 50+ ఏళ్లు (1973 - ఇప్పటి వరకు)
మొత్తం సినిమాలు : 300+ సినిమాలు (250+ కన్నడలోనే..)
కన్నడ డెబ్యూ : సంకల్ప్ (1973)
హిందీ డెబ్యూ : అంకుర్ (1974)
పురస్కారాలు : పద్మ భూషణ్ (2025), దాదాసాహెబ్ ఫాల్కే (2024)
రాష్ట్ర అవార్డులు : 5 కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డులు
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: 5 ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు
ప్రముఖ టీవీ షో : మాల్గుడి డేస్
ఐదు దశాబ్దాల కెరీర్.. 300కు పైగా చిత్రాల్లో నటన
1948 సెప్టెంబర్ 4న జన్మించిన అనంత నాగ్, 1973లో వచ్చిన 'సంకల్ప' అనే కన్నడ చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1974లో ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన 'అంకుర్' సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
దూరదర్శన్ క్లాసిక్ టీవీ సిరీస్ 'మాల్గుడి డేస్' ద్వారా దేశమంతటా గుర్తింపు సాధించారు. కన్నడ ఇండస్ట్రీలో 250కి పైగా చిత్రాలతో కలిపి మొత్తం 300కు పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. 2023 నాటికి ఆయన సినీ ప్రయాణం విజయవంతంగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.
'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్
కన్నడ సినీ చరిత్రలో ఎన్నో ఐకానిక్ హిట్ సినిమాల్లో అనంత నాగ్ భాగమయ్యారు. 'బయలు దారి' (1976), 'బెంకియ బలే' (1983), 'ముంగారు మలే' (2006), 'గోధి బన్న సాధారణ మైకట్టు' (2016), 'గాలిపట 2' (2022) వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్: ఛాప్టర్ 1' (2018), 'కేజీఎఫ్: ఛాప్టర్ 2' (2022) చిత్రాల్లో సీనియర్ జర్నలిస్ట్ 'ఆనంద్ ఇంగలగి' పాత్రలో అనంత నాగ్ నటన పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
సినిమా రంగానికి అందించిన సేవలకు గానూ 2025లో కేంద్ర ప్రభుత్వం ఆయనను 'పద్మభూషణ్' పురస్కారంతో సత్కరించింది. ఇప్పటివరకు 5 కర్ణాటక స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డులు, 5 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న అనంత నాగ్‌కు ఇప్పుడు దేశంలోనే అత్యున్నత సినీ పురస్కారం దక్కడంతో అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.