...
...
Next Story

OTT: ఓటీటీలోకి కాంతార హీరోయిన్ నటించిన బ్లాక్‌బస్టర్ కన్నడ యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 7.7 రేటింగ్

OTT: ప్రతీకారం.. విప్లవం నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ది రైజ్ ఆఫ్ అశోక' జూన్ 5 నుంచి సన్ నెక్స్ట్‌లో (Sun NXT) స్ట్రీమింగ్ కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

Published on: May 31, 2026, 08:02:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT: సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. కన్నడలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన 'ది రైజ్ ఆఫ్ అశోక' (The Rise of Ashoka) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) వేదికగా జూన్ 5 నుంచి ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

OTT: ఓటీటీలోకి కాంతార హీరోయిన్ నటించిన బ్లాక్‌బస్టర్ కన్నడ యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 7.7 రేటింగ్
OTT: ఓటీటీలోకి కాంతార హీరోయిన్ నటించిన బ్లాక్‌బస్టర్ కన్నడ యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 7.7 రేటింగ్

కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఐఎండీబీలో 7.7 రేటింగ్ సొంతం చేసుకున్న మూవీ ఇది.

అసలు కథ ఏమిటంటే..

మైసూర్ సమీపంలోని ఒక గ్రామంలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు తమ జీవనోపాధి కోసం పడే కష్టాలు, వారిపై జరిగే అణిచివేతను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక ప్రభుత్వ అధికారి కావాలనేది హీరో అశోక కల. కానీ తన కళ్ల ముందే ఒక పవర్ ఫుల్ బ్రోకర్ తన వర్గానికి చెందిన వారిని శారీరకంగా, మానసికంగా హింసించడం అతను గమనిస్తాడు.

ఆ అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో అతని జీవిత లక్ష్యం ఎలా మారుతుంది? తన ప్రజల కోసం విప్లవం ఎలా మొదలుపెట్టాడు? అనేది సినిమా అసలు కథ. హెయిర్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ది రైజ్ ఆఫ్ అకోశ విశేషాలు

'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సప్తమి గౌడ ఈ చిత్రంలో అంబిక అనే బలమైన పాత్రను పోషించింది. తన సహజమైన నటనతో ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అలాగే హీరో సతీష్ నీనాసం.. ఒక సాధారణ యువకుడి స్థాయి నుంచి వ్యవస్థను ఎదిరించే నాయకుడిగా మారే క్రమంలో తన పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతను చూపించిన ఆవేశం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బీ. సురేశ, సంపత్ మైత్రేయ తదితరులు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు.

"ఇది కేవలం ఒక సినిమా కాదు, సమాజంలోని అసమానతలపై ఎక్కుపెట్టిన అస్త్రం" అని సినిమా యూనిట్ చెబుతోంది. థియేటర్లలో ఈ సినిమా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. మంచి యాక్షన్, ఎమోషన్ కలగలిపిన కథల కోసం ఎదురుచూసే వారు జూన్ 5న సన్ నెక్స్ట్‌లో ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ది రైజ్ ఆఫ్ అశోక సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?

ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఎక్స్‌క్లూజివ్‌గా 'సన్ నెక్స్ట్' (Sun NXT) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

ది రైజ్ ఆఫ్ అశోక ఓటీటీలో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది?

జూన్ 5వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది.

ది రైజ్ ఆఫ్ అశోక సినిమా ఏయే భాషల్లో స్ట్రీమింగ్ కానుంది?

ఒరిజినల్ కన్నడ వర్షన్‌తో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ వర్షన్స్‌లో కూడా ఈ సినిమాను మీరు చూడొచ్చు.

ది రైజ్ ఆఫ్ అశోక చిత్రంలో ప్రధాన నటీనటులు ఎవరు?

ప్రముఖ కన్నడ నటుడు సతీష్ నీనాసం, సప్తమి గౌడ ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks