కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఐ యామ్ గాడ్ (I Am God) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఓ సీరియల్ కిల్లర్ చేసే హత్యలు ఓవైపు, కాలేజీలో ఓ జంట లవ్ స్టోరీ మరోవైపు చూపిస్తూ ఇంట్రెస్టింగా సాగే ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది. మరి ఈ మూవీ ఓటీటీ విశేషాలేంటో చూడండి.
ఐ యామ్ గాడ్ ఓటీటీ రిలీజ్ డేట్

కన్నడలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఐ యామ్ గాడ్ నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు 50 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (డిసెంబర్ 24) ఎక్స్ ద్వారా వెల్లడించింది. “పవర్, మిస్టరీ.. ఓ తుఫాను వస్తోంది. ఐ యామ్ గాడ్ డిసెంబర్ 26న కేవలం సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఐ యామ్ గాడ్ మూవీ విశేషాలు
కన్నడ డైరెక్టర్ రవి బీ గౌడ డైెరెక్ట్ చేసి నటించన మూవీ ఐ యామ్ గాడ్. నవంబర్ 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఐఎండీబీలో అయితే ఏకంగా 9.8 రేటింగ్ నమోదైంది. ఈ సినిమాలో రవి గౌడతోపాటు విజేత పరీక్, రవిశంకర్, అవినాష్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. నిజానికి ఈ మూవీ ప్రమోషన్లు, ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అంచనాలు లేకుండానే రిలీజైంది. అయితే తొలి షో నుంచే ఈ మూవీలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో మంచి రివ్యూలు వచ్చాయి.
ఓవైపు మాస్కు వేసుకొని, తనను తాను దేవుడిగా చెప్పుకునే వ్యక్తి వరుస హత్యలు చేస్తుంటాడు. మరోవైపు కాలేజీలో జంట లవ్ స్టోరీ కూడా నడుస్తుంది. ఈ రెండు స్టోరీలు సమాంతరంగా చూపిస్తుంటారు. అసలు ఈ రెండు స్టోరీలకు లింక్ ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ ఐ యామ్ గాడ్ సినిమాలో చూడొచ్చు. డిసెంబర్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ కానుంది.
{{/usCountry}}ఓవైపు మాస్కు వేసుకొని, తనను తాను దేవుడిగా చెప్పుకునే వ్యక్తి వరుస హత్యలు చేస్తుంటాడు. మరోవైపు కాలేజీలో జంట లవ్ స్టోరీ కూడా నడుస్తుంది. ఈ రెండు స్టోరీలు సమాంతరంగా చూపిస్తుంటారు. అసలు ఈ రెండు స్టోరీలకు లింక్ ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ ఐ యామ్ గాడ్ సినిమాలో చూడొచ్చు. డిసెంబర్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ కానుంది.
{{/usCountry}}