కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో యష్. ఈ కన్నడ సూపర్ స్టార్ నటించిన అప్ కమింగ్ మూవీ ‘టాక్సిక్’. ఇప్పటికే ఈ మూవీ టీజర్ హాట్ టాపిక్ గా మారింది. లిమిట్స్ దాటిన అశ్లీల సన్నివేశాలతో ఈ టీజర్ పై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడిక టాక్సిక్ మూవీ స్టోరీ లీకైంది.
టాక్సిక్ మూవీ స్టోరీ

యశ్ టాక్సిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ స్టోరీ బయటకు రావడం మేకర్స్ కు పెద్ద షాకే. ఈ సినిమా యూఏఈ డిస్ట్రిబ్యూటర్ సంస్థ టాక్సిక్ స్టోరీని సోషల్ రివీల్ చేసింది.
క్రైమ్ థ్రిల్లర్
యష్ రాబోయే చిత్రం 'టాక్సిక్' గురించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా యూఏఈ డిస్ట్రిబ్యూటర్ అనుకోకుండా వాళ్ల అధికారిక వెబ్‌సైట్‌లో స్టోరీని పోస్టు చేశారు. యూఏఈ డిస్ట్రిబ్యూటర్ ఫార్స్ ఫిల్మ్ ప్రకారం.. 1940 నుంచి 1970ల వరకు గోవాలో సాగే ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ టాక్సిక్. మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో హింస, భయం, మోసంతో ఓ వ్యక్తి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని, అతను ఎదిగిన తీరును ఈ మూవీలో చూడొచ్చు.
ఫుల్ యాక్షన్
"1940 నుంచి 1970 ల మధ్య గోవా బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన స్టోరీ ఇది.టాక్సిక్ ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. వలసవాద నీడలు, నేర సిండికేట్ల మధ్య ఓ వ్యక్తి తన సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకుంటాడు"అని డిస్ట్రిబ్యూటర్ సంస్థ పేర్కొంది.
‘‘అధికారం అనేది ఎవరూ ఇవ్వరు. దాన్ని లాక్కోవాల్సిందే. స్మగ్లింగ్ రాజ్యంలోని యుద్ధభూమిలో శత్రువులను ఓడించి అతను విజేతగా నిలిచాడు’’ అని వెబ్ సైట్లో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాకు 18+ రేటింగ్ ఉందని పేర్కొంది. అంటే 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే చూడాల్సిన సినిమా అని అర్థం.
{{/usCountry}}‘‘అధికారం అనేది ఎవరూ ఇవ్వరు. దాన్ని లాక్కోవాల్సిందే. స్మగ్లింగ్ రాజ్యంలోని యుద్ధభూమిలో శత్రువులను ఓడించి అతను విజేతగా నిలిచాడు’’ అని వెబ్ సైట్లో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాకు 18+ రేటింగ్ ఉందని పేర్కొంది. అంటే 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే చూడాల్సిన సినిమా అని అర్థం.
{{/usCountry}}నెటిజన్ల రియాక్షన్
టాక్సిక్ స్టోరీ లీక్ కావడంపై నెటిజన్ల రియాక్షన్లు వైరల్ గా మారాయి. ఈ స్టోరీ లైన్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాల్లో రాకీ భాయ్ లాగే యశ్ క్యారెక్టర్ ఉండబోతుందేమోననే సందేహాలు వ్యక్తం చేశారు. కేజీఎఫ్ లో ఓ కుర్రాడు పవర్ మీద, బంగారం మీద ఆశతో గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. కేజీఎఫ్ ను శాసిస్తాడు. ఇప్పుడు టాక్సిక్ స్టోరీని బట్టి చూస్తే ఇందులోనూ అతను గ్యాంగ్ స్టర్ గా ఎదగడం ఉంది.
టాక్సిక్ గురించి..
టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. యష్ తో ఆమెకు ఇది ఫస్ట్ మూవీ. ఇందులో నయనతార, రుక్మిణి వసంత్, హూమా ఖురేషీ తదితర అందాల భామలు నటించారు. ఈ చిత్రం మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. అదే రోజు థియేటర్లకు రాబోతున్న ధురంధర్ ది రివేంజ్ మూవీతో టాక్సిక్ క్లాష్ కానుంది.