కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇటీవల వచ్చిన ప్రయోగాత్మక సస్పెన్స్ థ్రిల్లర్లలో 'వృత్త' (Vritta) ఒకటి. బిగ్ బాస్ కన్నడ విజేత షైన్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. తన విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయింది. మరి ఈ సినిమా ఏంటి? ఎక్కడ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.
వృత్త మూవీ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ ఏడాది ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైన మూవీ వృత్త. ఈ సినిమా సుమారు ఐదు నెలల తర్వాత శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించిన ఈ సినిమాకు ఓటీటీలో మరింత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది.
వృత్తి సినిమా స్టోరీ ఇలా..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఓ ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ వృత్త. లిఖిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహీర్ మొహియుద్దీన్, హరిణి సుందరరాజన్, చైత్ర జె ఆచార్ (సప్త సాగరాలు దాటి ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటించారు.
సిద్ధార్థ్ అనే ఒక రిజర్వ్‌డ్ వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక రాత్రి తీసుకున్న తొందరపాటు నిర్ణయం, ఒక ఫోన్ కాల్, రాంగ్ రూట్‌లో వెళ్లడం.. ఇవన్నీ కలిసి అతన్ని ఒక భయానకమైన సుడిగుండంలోకి నెట్టేస్తాయి. గర్భిణి అయిన భార్య, పాత గాయాలు, కుటుంబ సమస్యల మధ్య నలిగిపోతున్న సిద్ధార్థ్.. ప్రాణాలతో బయటపడటానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా.
ఈవారం ఓటీటీలో మరికొన్ని మూవీస్
ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న మరో కన్నడ థ్రిల్లర్ 'ఐ యామ్ గాడ్'. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చింది. ఒక పక్క దేవా, బిందుల ప్రేమకథ.. మరోపక్క 'గాడ్' అనే ముసుగు వేసుకున్న సీరియల్ కిల్లర్ ఆ ఊరిని భయపెట్టడం.. ఈ రెండింటి మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా.
{{/usCountry}}ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న మరో కన్నడ థ్రిల్లర్ 'ఐ యామ్ గాడ్'. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చింది. ఒక పక్క దేవా, బిందుల ప్రేమకథ.. మరోపక్క 'గాడ్' అనే ముసుగు వేసుకున్న సీరియల్ కిల్లర్ ఆ ఊరిని భయపెట్టడం.. ఈ రెండింటి మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా.
{{/usCountry}}ఇక నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 26న రెండు క్రేజీ సినిమాలు విడుదలయ్యాయి. కీర్తి సురేష్ నటించిన 'రివాల్వర్ రీటా' స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రామ్ నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా కూడా పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా మిడిల్ క్లాస్ అనే తమిళ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.