కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు మరీ ఎక్కువ రోజులు ఎదురు చూడకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో చాలా ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తోంది. ఆదివారం (అక్టోబర్ 26) రాత్రి ఈ మూవీ స్ట్రీమింగ్ పై అప్డేట్ ఇచ్చిన ఆ ఓటీటీ.. సోమవారం సాయంత్రానికి స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేసేసింది.
కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్

రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్లో నటించిన కాంతార ఛాప్టర్ 1 మూవీ ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 31 నుంచే స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
“బెర్మె లెజెండరీ అడ్వెంచర్ ను చూడటానికి సిద్ధంగా ఉండండి. కాంతార ఛాప్టర్ 1 అక్టోబర్ 31న ప్రైమ్ లోకి.. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ చిన్న వీడియో క్లిప్ ను షేర్ చేసింది.
కాంతార ఛాప్టర్ 1 మూవీ గురించి..
కాంతార ఛాప్టర్ 1 ఈ నెల అంటే అక్టోబర్ 2నే థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుండటం ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచింది. అలాంటి మూవీని ఇంత త్వరగా డిజిటల్ ప్రీమియర్ చేయనుండటం విశేషమే.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్. ఆ సినిమా రూ.300 కోట్లకుపైగా వసూలు చేయగా.. ఇది అంతకంటే ఎంతో మెరుగ్గా సక్సెస్ సాధించింది. ఆ కథ జరిగిన 800 సంవత్సరాలకు ముందు జరిగిన కథగా ఈ కాంతార ఛాప్టర్ 1ను రూపొందించారు. ఇందులో బెర్మె అనే పాత్రలో రిషబ్ శెట్టి నటించాడు. రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్యలాంటి వాళ్లు కూడా నటించారు.
{{/usCountry}}రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్. ఆ సినిమా రూ.300 కోట్లకుపైగా వసూలు చేయగా.. ఇది అంతకంటే ఎంతో మెరుగ్గా సక్సెస్ సాధించింది. ఆ కథ జరిగిన 800 సంవత్సరాలకు ముందు జరిగిన కథగా ఈ కాంతార ఛాప్టర్ 1ను రూపొందించారు. ఇందులో బెర్మె అనే పాత్రలో రిషబ్ శెట్టి నటించాడు. రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్యలాంటి వాళ్లు కూడా నటించారు.
{{/usCountry}}