...
...
Next Story

అన్నగారు తెలుగులో వస్తారా? సంక్రాంతి బరిలో కార్తి.. వా వాతియార్ రిలీజ్ డేట్ ఇదే

పొంగల్ బరిలోకి మరో తమిళ సినిమా వచ్చేస్తోంది. హీరో కార్తి లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తెలుగులో ఈ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేదు.

Published on: Jan 10, 2026, 19:18:18 IST
Advertisement

సంక్రాంతి 2026కు తమిళ సినీ ఇండస్ట్రీ కాస్త డల్ గానే ఉంది. విజయ్ దళపతి సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ వాయిదా పడింది. ఇక శివ కార్తికేయన్ ‘పరాశక్తి’కి నెగెటివ్ టాక్ వస్తోంది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి, పొంగల్ సందడిని పెంచడానికి హీరో కార్తి వస్తున్నాడు. అతని మూవీ ‘వా వాతియార్’ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు.

వా వాతియార్ రిలీజ్ డేట్

వా వాతియార్ పోస్టర్ లో కార్తి (x/StudioGreen2)
వా వాతియార్ పోస్టర్ లో కార్తి (x/StudioGreen2)

హీరో కార్తి అప్ కమింగ్ మూవీ ‘వా వాతియార్’. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. పొంగల్ 2026 బరిలో ఈ సినిమా దిగనుంది. జనవరి 14న వా వాతియార్ ను రిలీజ్ చేస్టున్నట్లు శనివారం ప్రకటించారు. అంటే మూవీ రిలీజ్ కు ఇంకా మూడు రోజులే ఉంది. అయినా ఎప్పుడో వా వాతియార్ రిలీజ్ కు రెడీ అయింది. కానీ ఆ తర్వాత వాయిదా పడింది.

తెలుగులో వచ్చేనా?

వా వాతియార్ తెలుగు రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీని ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో తెలుగు లోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ గతంలో ప్లాన్ చేశారు. ‘అన్నగారు వస్తున్నారు’ టైటిల్ తో తెలుగులో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసేలా కార్తి గెటప్స్ లో కనిపించాడు. మరి ఇప్పుడు వా వాతియార్ తమిళ రిలీజ్ డేట్ ను ప్రకటించారు కానీ తెలుగు రిలీజ్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పుడు కష్టమే

నిజానికి వా వాతియార్ మూవీ డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సింది. కానీ ప్రొడ్యూసర్ జ్ఞ‌ానవేల్ ఆర్థిక వివాదం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ గొడవ సద్దుమణగడంతో సంక్రాంతి రేసులో నిలిచింది ఈ మూవీ. వా వాతియర్ చిత్రంలో కార్తి సరసన కృతిశెట్టి హీరోయిన్. ఇందులో కార్తి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇదో యాక్షన్ కామెడీ మూవీగా తెరకెక్కింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks