...
...
Next Story

Serials TRP: తెలుగు సీరియల్స్ 20వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. నాలుగో స్థానానికి పడిపోయిన టాప్ సీరియల్..

Serials TRP: తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్ 20వ వారం టీఆర్పీ రేటింగ్స్ విడుదలయ్యాయి. స్టార్ మా, జీ తెలుగు ఛానెళ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత వారాలతో పోలిస్తే తాజా రేటింగ్స్‌లో టాప్ సీరియల్స్ ప్రదర్శన, ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందో చూద్దాం.

Published on: May 28, 2026, 17:00:49 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Serials TRP: తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ మధ్య టీఆర్పీ రేటింగ్స్ యుద్ధం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ విషయంలో మొదటి రెండు స్థానాల్లో ఉండే స్టార్ మా, జీ తెలుగు ఛానెళ్ల మధ్య ప్రతి వారం తీవ్ర పోటీ నెలకొంటుంది.

Serials TRP: తెలుగు సీరియల్స్ 20వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. నాలుగో స్థానానికి పడిపోయిన టాప్ సీరియల్..
Serials TRP: తెలుగు సీరియల్స్ 20వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. నాలుగో స్థానానికి పడిపోయిన టాప్ సీరియల్..

తాజాగా 20వ వారానికి సంబంధించిన అర్బన్, రూరల్ (U+R) మార్కెట్ టీఆర్‌పీ రేటింగ్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ వారం కూడా ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో రెండు ప్రధాన వినోద చానళ్లు తమదైన వ్యూహాలతో ముందుకెళ్లాయి.

స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్ ఇలా..

గత కొన్ని వారాల ట్రెండ్‌ను గమనిస్తే, రేటింగ్స్‌లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ టాప్ 10 జాబితాలో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. 17వ వారం నుంచి 19వ వారం వరకు ఉన్న డేటాను విశ్లేషిస్తే స్టార్ మా సీరియల్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా 'కార్తీక దీపం 2', 'గుండె నిండా గుడి గంటలు', 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' వంటి సీరియల్స్ టాప్ స్థానాలను కైవసం చేసుకుంటూ తమ సత్తా చాటుతున్నాయి. 20వ వారంలో 'కార్తీక దీపం 2' ఏకంగా 10.52 (U+R) రేటింగ్‌తో నంబర్ వన్ స్థానంలో నిలిచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

అయితే గత వారంతో పోలిస్తే రేటింగ్ కాస్త తగ్గింది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ 10.29తో రెండో స్థానలో కొనసాగుతోంది. ఇక ఇంటింటి రామాయణం 9.77తో మూడో స్థానంలో ఉండగా.. అనూహ్యంగా మరో టాప్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు మాత్రం 9.53తో నాలుగో స్థానానికి పడిపోయింది. పొదరిల్లు 7.76, నువ్వు లేక నేను లేను 6.33 రేటింగ్స్ సాధించాయి.

జీ తెలుగు సీరియల్స్ ఇలా..

'జయం', 'జగద్ధాత్రి', 'చామంతి' వంటి సీరియల్స్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 20వ వారం చూస్తే.. జయం 6.24తో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చామంతి 5.98, జగద్ధాత్రి 5.73, మేఘసందేశం 4.80 రేటింగ్స్ సాధించాయి.

20వ వారంలో కూడా కుటుంబ కథా నేపథ్యంతో వస్తున్న సీరియల్స్ వైపే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బుల్లితెరపై ఏ ఛానెల్ వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ, అంతిమంగా అత్యుత్తమ వినోదం పంచుతున్న సీరియల్స్‌కే వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: స్టార్ మాలో ప్రస్తుతం అత్యధిక రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏది?

జవాబు: 'కార్తీక దీపం 2' సీరియల్ స్టార్ మాలో అత్యధిక రేటింగ్స్‌తో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

ప్రశ్న: జీ తెలుగులో టాప్ రేటింగ్స్‌లో ఉన్న సీరియల్స్ ఏవి?

జవాబు: జీ తెలుగులో 'జయం', 'చామంతి', 'జగద్ధాత్రి' సీరియల్స్ స్థిరమైన వీక్షకాదరణతో టాప్ స్థానాల్లో ఉన్నాయి.

ప్రశ్న: గత వారాలతో పోలిస్తే 20వ వారం రేటింగ్స్‌లో పెద్దగా మార్పులు ఉన్నాయా?

జవాబు: రేటింగ్స్ నంబర్లలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ, స్టార్ మా ఆధిపత్యం కొనసాగుతోంది. టాప్ జాబితాలో ఎప్పటిలాగే పాత సీరియల్స్ తమ స్థానాలను పదిలంగా ఉంచుకున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe