...
...
Next Story

Karthika Deepam 2: ఇప్పట్లో తేలేలా లేదు- మళ్లీ మొదటికే- ఈజీగా మరో 500 ఎపిసోడ్లు- కార్తీక దీపం 2 మేకర్స్ మాస్టర్ ప్లాన్!

Karthika Deepam 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్న సీరియల్ ‘కార్తీక దీపం 2’. బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపానికి సీక్వెల్ గా వస్తున్న ఈ కార్తీక దీపం 2 సూపర్ హిట్ రన్ తో దూసుకెళ్తోంది. అయితే తాజాగా సీరియల్ లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. మళ్లీ కథ మొదటికే వచ్చింది.

Published on: Sep 1, 2026, 12:45:37 IST
Advertisement

Karthika Deepam 2: స్టార్ మాలో వస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న తెలుగు రాష్ట్రాల జనాలు ఎక్కువే. రాత్రి అయిందంటే తాజా ఎపిసోడ్ కోసం టీవీ ముందు కూర్చుని వెయిట్ చూస్తుంటారు. కార్తీక దీపం 2 సీరియల్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. అయితే ఇప్పుడీ సీరియల్ మేకర్స్ మరో ప్లాన్ వేశారనిపిస్తోంది.

కార్తీక దీపం 2 స్టోరీ

ఇప్పట్లో తేలేలా లేదు- మళ్లీ మొదటికే- ఈజీగా మరో 500 ఎపిసోడ్లు- కార్తీక దీపం 2 మేకర్స్ మాస్టర్ ప్లాన్! (jiohotstar)
ఇప్పట్లో తేలేలా లేదు- మళ్లీ మొదటికే- ఈజీగా మరో 500 ఎపిసోడ్లు- కార్తీక దీపం 2 మేకర్స్ మాస్టర్ ప్లాన్! (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ ను మరో 500 ఎపిసోడ్లు ఈజీగా లాగేలా మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారనే టాక్ వినిపిస్తోంది. దీప ప్లేస్ లో శివ నారాయణ వారసురాలిగా జ్యోత్స్న జీవితం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేసి దీపను తన అమ్మానాన్నకు దగ్గర చేయాలని కార్తీక్ ప్రయత్నిస్తుంటాడు. దీపే అసలు వారసురాలు అని తెలియడమే అసలు కథ.

ట్విస్ట్ లే ట్విస్ట్ లు

దీపనే నిజమైన వారసురాలని కార్తీక్, జ్యోత్స్న, పారిజాతం, దశరథ, దాసుకు మాత్రమే తెలుసు. మిగతా వాళ్లకు తెలిసేలా చేసి సుమిత్ర కూతురిగా దీపను చూడాలని కార్తీక్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇన్ని రోజులూ ఈ ప్రయత్నాలను జ్యోత్స్న అడ్డుకుంటూ వచ్చింది. అయితే సూరజ్ తో ప్రేమలో పడ్డ జ్యోత్స్న పూర్తిగా మారిపోయి ట్విస్ట్ ఇచ్చింది.

నిజం చెప్పేస్తానని

సూరజ్ తో జ్యోత్స్న పెళ్లికి రెడీ అయింది. ఈ పెళ్లి కాగానే దీపనే అసలైన వారసురాలని చెప్పేస్తానంది. జ్యోత్స్న నిజం చెప్పినట్లు, సుమిత్రకు తనే కూతురని తెలిసినట్లు దీప కల కూడా కన్నది. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ క్లైమాక్స్ కు చేరినట్లే అనిపించింది. కానీ ఇక్కడే సీరియల్ మేకర్స్ దిమ్మతిరిగే షాకిచ్చారు.

కూతురే కాదంటూ

ఇక ఇన్ని రోజులూ కన్న కూతురు అంటూ ప్రేమ కురిపించిన దశరథ కూడా ఒక్కసారిగా ప్లేటు తిప్పేశాడు. జ్యోత్స్న తన పగ పంచుకుందని, ఆమెనే కూతురని అనేశాడు దశరథ. అంతే కాదు దీప తన సొంత కూతురనే విషయాన్ని చెప్పబోనని కూడా బిగ్ షాకిచ్చాడు.

ఎప్పుడు తేలుతుంది?

కార్తీక దీపం 2 సీరియల్ లో దీపనే సుమిత్ర, దశరథల కూతురు అని అందరికీ తెలిసేలా చేయడమే మెయిన్ పాయింట్. కానీ ఇప్పుడు అదే విషయంలో మరోసారి సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు దీప, కార్తీక్ ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ముందు జ్యోత్స్న, సూరజ్ పెళ్లి కోసం ప్రయత్నిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్లి పెళ్లి జరిగితేనే దీప అసలైన వారసురాలనే విషయం బయటకు వస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks