Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో నాన్న పెళ్లి మరి 3 రోజుల్లో అంటే కష్టమనిపిస్తుందని దశరథ్ అంటాడు. ఎందుకు సర్ అని సూరజ్ అంటాడు. పారిజాతం మనవరాలి పెళ్లి అంటే.. అని పారు అంటుండగా శివ నారాయణ కోపంగా చూస్తాడు.
పెళ్లి సింపుల్‌గా జరిపించండి

దాంతో మాట మార్చి శివ నారాయణ పెళ్లి అంటే ఆషామాషీనా. చుట్టాలు, డెకరేషన్, వెడ్డింగ్ కార్డ్స్ గురించి పారిజాతం అంటుంది. నగలు, చీరలు, వచ్చే గెస్టులకు స్పెషల్ రిటర్న్ గిఫ్టులు తీసుకోవాలని కాంచన అంటుంది. ఎంతైనా మూడు రోజుల్లో అంటే కష్టమండని సుమిత్ర అంటుంది. నువ్వేమంటావ్ సూరజ్ అని దశరథ అడుగుతాడు.
నాకు అనిపించడం లేదు సర్. నా పెళ్లి ఆడబంరంగా జరగాలని అనుకోవట్లేదు. రిసెప్షన్ మీ ఇష్టం. కానీ, పెళ్లి మాత్రం ఎలాంటి ఆర్బాటాలు లేకుండా ఇదే ఇంట్లో పందిరి వేసి జరిపించండని సూరజ్ అంటాడు. పారిజాతం సెటైర్లు వేస్తుంది. సూరజ్‌కు ఈ ఇంట్లో జరగాలని ఉంది. అది ఎప్పుడో చెప్పాడు. సూరజ్ ఇష్టమే నా ఇష్టం అని జ్యోత్స్న అంటుంది.
ఇక్కడే గ్రాండ్‌గా జరిపిద్దామని శ్రీధర్ అంటే.. వద్దండి. సింపుల్‌గా జరిపించండని సూరజ్ అంటాడు. బంధువులైన పిలవాలిగా అని కాంచన అంటుంది. ముఖ్యమైన వాళ్లను మాత్రం పిలవండి. అందరూ అవసరం లేదు. నా సైడ్ నుంచి ఎలాగు ఎవరు లేరు అని సూరజ్ అంటాడు. దానికి శ్రీధర్ నువ్వు నా చిన్నకొడుకు అనుకుంటే నీకు ఎవరు లేరంటావా. మేము అవసరం లేదా అని అంటాడు.
గౌరీ ప్రసాద్ కాల్
మీరు తప్పా ఎవరు లేరు అని అంటున్నాను. నా మాట వెనక్కి తీసుకుంటున్నా అని సూరజ్ అంటాడు. సరే నిన్ను క్షమిస్తున్నా అంటాడు శ్రీధర్. అందరికి ఆన్లైన్లో చెప్పండని సూరజ్ అంటాడు. అందరికి పనులు పురమాయిస్తాడు శివ నారాయణ. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా చేద్దామంటాడు. సూరజ్, జ్యోత్స్నల పెళ్లి బాధ్యతలు కార్తీక్, దీపల మీద పెట్టిన శివ నారాయణ ఎక్కడ ఏ లోటు, మాట రావొద్దని అంటాడు.
{{/usCountry}}మీరు తప్పా ఎవరు లేరు అని అంటున్నాను. నా మాట వెనక్కి తీసుకుంటున్నా అని సూరజ్ అంటాడు. సరే నిన్ను క్షమిస్తున్నా అంటాడు శ్రీధర్. అందరికి ఆన్లైన్లో చెప్పండని సూరజ్ అంటాడు. అందరికి పనులు పురమాయిస్తాడు శివ నారాయణ. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా చేద్దామంటాడు. సూరజ్, జ్యోత్స్నల పెళ్లి బాధ్యతలు కార్తీక్, దీపల మీద పెట్టిన శివ నారాయణ ఎక్కడ ఏ లోటు, మాట రావొద్దని అంటాడు.
{{/usCountry}}సూరజ్ థ్యాంక్యూ చెబితే తాత అని పిలు అని శివ నారాయణ అంటాడు. పెళ్లి అయ్యాక పిలుస్తాడని పారు అంటే.. అత్తయ్య గారిని అమ్మమ్మ అని పిలవాల్సి వస్తుందని శ్రీధర్ అంటాడు. ఇప్పటి నుంచి పారిజాతంను అమ్మమ్మ అని పిలు అని శివ నారాయణ అంటాడు. అంతా నవ్వుతారు. ఇంతలో శివ నారాయణకు గౌరీ ప్రసాద్ కాల్ చేసి వస్తున్నట్లు చెబుతాడు.
కట్ చేస్తే గౌరీ ప్రసాద్‌తో అంతా కలిసి కూర్చుంటారు. మా రెస్టారెంట్ కొన్నారుగా. దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఇది చదివి మీరు సంతకం పెడితే మా రెస్టారెంట్ పూర్తిగా మీ సొంతం అవుతుందని గౌరీ ప్రసాద్ అంటాడు. రాంగ్ టైమ్‌లో వచ్చారు. జ్యోత్స్న పెళ్లి తర్వాత పెట్టుకుందామని దశరథ్ అంటాడు. చదివి సంతకం పెడితే అయిపోతుందిగా. నా పెళ్లి వల్ల ఎవరికి ఇబ్బంది కాకూడదు అని సూరజ్ అంటాడు.
ఇవాళ జరిగితే అగ్రిమెంట్ గుర్తుండిపోతుంది
పెద్దవాళ్లు ఎందుకు అంటున్నారో కూడా వినాలి కదా అని కార్తీక్ అంటాడు. ఇది మీరు పోటీ పడి గెలుచుకున్నారు. ఆ క్రెడిట్ జ్యోత్స్నకు దక్కుతుంది. నా పెళ్లితో సంతోషం డబుల్ అవ్వాలని సూరజ్ అంటాడు. అవును తాత ఈ అగ్రిమెంట్ ఇవాళ జరిగినట్లు గుర్తుండిపోతుంది కదా అని జ్యో అంటుంది. దాంతో శివ నారాయణ ఒప్పుకుంటాడు.
కార్తీక్, సూరజ్ చదివితే చాలు, వాళ్లే నా బలం అంటాడు శివ నారాయణ. నువ్వేగా ఛైర్మన్ నాన్న అని కాంచన అంటే.. అది పెళ్లయ్యే వరకే. పెళ్లి అయ్యాకా నా మనవళ్లు, నా మనవరాళ్లకే అప్పజెబుతాను. ఈ నలుగురు నాలుగు స్థంబాలు అయి ఈ శివ నారాయణ లెగసీని ముందుకు నడిపించాలి. మీరిద్దరు చదవండి. మేము సంతకాలు పెడతామని శివ నారాయణ అంటాడు.
సూరజ్‌ను కార్తీక్ చదవమంటాడు. సూరజ్ అంతా ఓకే అంటాడు. కార్తీక్ చదువుతుంటే దీప తీసుకుని ఇప్పుడు నువ్వు ఏమైనా మార్పులు చెబితే సూరజ్‌ను అంటావా అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న చదవమంటుంది దీప. సూరజ్ చదివాడుగా అది చాలంటుంది జ్యోత్స్న. ఈ బాధ్యతలు వాళ్లిద్దరు చూసుకుంటారని దీప అంటుంది.
పెద్ద దెబ్బేసిన సూరజ్
దాంతో ఆ అగ్రిమెంట్ మీద అందరూ సంతకం పెడుతుంటారు. సూరజ్‌కు చెమటలు పడతాయి. చూస్తుంటే శివ నారాయణ కొంప కూలే పెద్ద తప్పు జరుగుతుందని తెలుస్తోంది. సుమిత్ర కూడా పెట్టాలంటారు. సాక్షులుగా దీప, కార్తీక్‌లను పెట్టమంటారు. వాళ్లిద్దరు పెడతారు. సూరజ్ కంగారుపడుతుంటాడు. మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తాను అని గౌరీ ప్రసాద్ వెళ్లిపోతాడు.
సూరజ్‌కు చెమటలు పడుతున్నాయని కర్చీఫ్ ఇస్తాడు కార్తీక్. దేనికి టెన్షన్ పడుతున్నావ్ అని అడిగితే.. పెళ్లి గురించి అని సూరజ్ అంటాడు. దాంతో సూరజ్‌కు పెళ్లి గురించి చెబుతూ పక్కకు తీసుకెళ్తాడు శ్రీధర్. చూస్తుంటే శివ నారాయణకు సూరజ్ పెద్ద దెబ్బ వేసినట్లు అనిపిస్తోంది. తర్వాత ఇంట్లోనే అంతా చీరలు చూస్తాడు. జ్యోత్స్నకు చీరలు చూస్తారు.
సూరజ్‌కు నచ్చిందో లేదో అడుగుతుంది జ్యో. సూరజ్ ఏదే నచ్చలేదని సైగ చేస్తాడు. అది కార్తీక్ గమనిస్తాడు. అంతా కలిసి ఒక చీరను సెలెక్ట్ చేస్తారు. ఈ చీర తీసుకుని సూరజ్ ఒంటిపై వేసి బాబు ఈ చీర ఓకేనా అని పారిజాతం అడుగుతుంది. చీర కట్టుకునేది జ్యోత్స్న అయిన నచ్చిందో లేదో చెప్పాల్సింది సూరజ్ అని పారిజాతం అంటుంది.
పారిజాతం డ్యాన్స్
ఈ చీర నచ్చిందని సూరజ్ చెబుతాడు. పెళ్లికొడుకుకు చీర నచ్చిందని పారిజాతం అరుస్తుంది. నాకైతే డ్యాన్స్ పెట్టించాలని ఉందని, మావయ్య గారు కూడా డ్యాన్స్ చేస్తారని శ్రీధర్ అంటాడు. నేను రెడీ అని అప్పుడే పారిజాతం డ్యాన్స్ స్టెప్పులు వేస్తుంది. అంతా సంతోషంగా నవ్వుతుంటారు. జ్యోత్స్న సడెన్‌గా కన్నీళ్లు పెట్టుకుంటారు.
ఏమైందని సుమిత్ర అడిగితే.. చాలా సంతోషంగా ఉందని, తల్లి ఒడిపై వాలిపోతుంది జ్యోత్స్న. పెళ్లయిన తర్వాత మీరంతా నన్ను మర్చిపోతారా అని అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.