...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- దశరథ కోసం కాళ్లు పోగొట్టుకున్న కాంచన- గన్‌తో కాల్చుకున్న మాలిని భర్త

Karthika Deepam 2 Serial August 29th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 29వ ఎపిసోడ్‌‌‌లో సుమిత్ర, దశరథల పెళ్లి వల్లే తన పగ మొదలైందని, సుమిత్ర వల్లే తన భర్త చనిపోయాడని మాలిని అంటుంది. గుడిలో దశరథను చంపేందుకు లారీ వస్తుంది. అప్పుడు దశరథను కాపాడబోయి కాంచన లారీ కింద పడి కాళ్లు పోగొట్టుకుంటుంది.

Published on: Aug 29, 2026, 07:26:16 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో పగ, ప్రతికారం పురుడు పోసుకుంది నా భర్త చావుతో కాదు. ఈ సుమిత్ర, దశరథల పెళ్లితో. సరిగ్గా ఇప్పుడు జ్యోత్స్న ఎలా పెళ్లికూతురు అయిందో సుమిత్ర కూడా పెళ్లి కూతురు అయినప్పుడు మొదలైందీ ఈ వివాదం అని జరిగింది చెబుతుంది మాలిని.

దక్షిణామూర్తి శివ నారాయణ గొడవ

కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 29 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 29 ఎపిసోడ్

దశరథతో పెళ్లి చేసుకున్నందుకు సుమిత్రను తండ్రి దక్షిణామూర్తి, వదిన మాలిని, అన్నయ్య కృష్ణమూర్తి కోప్పడుతారు. దశరథ, శివ నారాయణతో గొడవ పడతారు. నీతిలేని బతుకులు అని కృష్ణమూర్తి అంటాడు. సుమిత్రను మాలిని వాళ్ల అన్నయ్యకు ఇద్దామనుకున్నామని కృష్ణమూర్తి మాటిచ్చాడని దక్షిణమూర్తి అంటే.. నా ఇష్టం లేకుండా ఎలా ఇస్తాడని సుమిత్ర కోప్పడుతుంది.

మాలిని తండ్రి కోటీశ్వరుడు. రాజకీయంగా ఎంతో బలం ఉంది అని దక్షిణామూర్తి అంటే.. మనసులో ఇష్టమున్నవాడితో బతికితే సంతోషంగా ఉంటుంది. నువ్వు నా పెళ్లిని వ్యాపారం చేయాలనుకున్నావ్. నేను నా బతుకును కాపాడుకోవాలనుకున్నాను. మంచి మనుసుతో ఆశీర్వదించండి నాన్న అని సుమిత్ర అంటుంది. అసలు ఇది పెళ్లి అని నేను అనుకుంటే కదా అని కూతురు తాళిని తెంపేందుకు ప్రయత్నిస్తాడు దక్షిణామూర్తి.

దాంతో దక్షిణామూర్తిని లాగిపెట్టి కొడతాడు శివ నారాయణ. పక్కకు పడిపోతాడు దక్షిణామూర్తి. మీ స్థాయి ఏంటని, ఇలా అడ్డంగా ఎదగడానికేగా అని మాలిని అంటుంది. వాళ్లు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నాతో స్నేహం చేసేందుకు రాని స్థాయి పెళ్లికి వచ్చిందా. ఇకనుంచి సుమిత్ర నీ కూతురు కాదు నా కోడలు. నీ నుండి నాకు చిల్లిగవ్వ అవసరం లేదు అని శివ నారాయణ అంటాడు.

దశరథను చంపించే ప్లాన్

దశరథను పక్కకు తోసిసి కాంచన కాపాడుతుంది. కానీ, కాంచనకు యాక్సిడెంట్ అయి కాళ్లు పోగొట్టుకుంటుంది. అలా కాంచనను చక్రాల కుర్చీకి పరిమితం చేసింది ఈ మాలినియే. రేయ్ కార్తీక్ మీ అమ్మకు కాళ్లు పోలేదురా. ఈ దుర్మార్గురాలి వల్ల పోగొట్టుకుందని శ్రీధర్ అంటాడు. అప్పుడు మాలిని వైపు సూరజ్ అనుమానంగా చూస్తాడు. కార్తీక్ కోపంగా చూస్తాడు.

ఎవరిని నమ్మిండానికి ఈ నాటకాలు. లారీ గుద్దడానికి వస్తే నాకేంటీ సంబంధం. నీకు ఎవరైనా చెప్పారా మేము చేయించామని. మీరు వెళ్లినప్పుడే మా ఆయన వదిలేశారు. కానీ మీరు విడిచిపెట్టలేదు. లారీతో గుద్దించడాని నా భర్తను పోలీస్ కేసు పెట్టారని ఆ తర్వాత జరిగింది చెబుతుంది మాలిని. పోలీసులతో దక్షిణామూర్తికి వెళ్లిన శివ నారాయణ గొడవ పడతాడు.

నేను కడుపుతో ఉన్నాను వదిలేయ్ సుమిత్ర

అందరిని అరెస్ట్ చేయమంటాడు దశరథ. మేము చేయలేదు. అంతా వదిలేయ్ అని మాలిని అంటుంది. ఇక్కడ కృష్ణ లేడంటేనే అర్థమవుతోంది. మీరే చేశారని సుమిత్ర కోప్పడుతుంది. కడుపుతో ఉన్నాను అర్థం చేసుకో సుమిత్ర. అసలే మీ అన్నయ్య బాధలో ఉన్నారని, ఇప్పుడు కేసు వల్ల మరింత బాధలో ఉన్నాడు. మమ్మల్ని వదిలేయ్ సుమిత్ర అని మాలిని ఏడుస్తూ అంటుంది.

సుమిత్ర వినదు. నా కొడుకు తప్పు చేయలేదని దక్షిణామూర్తి అంటే మరి నువ్వు చేశావా అని సుమిత్ర కోప్పడుతుంది. నేనే తప్పు చేయలేదమ్మా అసలు ఆ యాక్సిడెంట్ గురించే తెలియదు అని దక్షిణామూర్తి అంటే.. నా బిడ్డ మీద ఒట్టేసి చెబుతున్నాను ఇదే నిజమని మాలిని ఏడుస్తూ అంటుంది. నీ దొంగ కన్నీళ్లకు కరగను. కేసు వాపసు తీసుకుంటాను. నా ఆడపడుచుకు కాళ్లు తిరిగి తీసుకురాగలరా అని కాంచన బాధ గురించి చెబుతుంది సుమిత్ర.

తన బిడ్డకు ఆరు నెలలే. ఒక తల్లి బిడ్డకు ఏమేమి చేయాలో అవేవి చేయలేదు. అది చావుకు మించింది. ఆ నరకం నుంచి కాంచనను తప్పించండి. నేను కేసు వాపసు తీసుకుంటాను. చేయలేరుగా. నేను కూడా కేసు వాపసు తీసుకోలేను. అందరిని అరెస్ట్ చేయండని పోలీసులకు చెబుతుంది సుమిత్ర. లోపలే ఉండుంటాడని బెడ్ రూమ్ డోర్ కొడుతుంది సుమిత్ర.

గన్‌తో కాల్చుకుని చనిపోయిన సుమిత్ర అన్న

లోపలి నుంచి గన్ సౌండ్ వినిపిస్తుంది. డోర్ తీసి చూస్తే మాలిని భర్త కృష్ణమూర్తి గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. చెల్లేలు కేసు పెట్టి పరువు తీస్తోందన్న బాధతో నా భర్త చనిపోయాడు మావయ్య గారు అని మాలిని ఏడుస్తుంటుంది. లేదు నా భర్త చచ్చిపోలేదు. చంపేశారు. ఈ సుమిత్రే చంపేసింది. నీ ఆడపడుచు కోసం నా భర్తను చంపేశావా. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా. ఆయన పోయేవరకు విడిచిపెట్టలేదుగా అని మాలిని అంటుంది.

నీ ప్రేమ కోసం మీ అన్న ప్రాణం తీస్తావా అని నానా మాటలు అంటుంది మాలిని. తప్పు చేసినవాడు భయంతో పిరికితనంతో చనిపోయాడు. దానికి నా కోడలికి సంబంధం లేదు అని శివ నారాయణ అంటాడు. ఇది నా కూతురు కాదు. నా చావు. నువ్వు నీ అన్నయ్యను చంపేశావ్. ఈరోజు నా కొడుకే కాదు నా కూతురు కూడా చనిపోయింది. పోయే బయటకు అని గెంటేస్తాడు దక్షిణామూర్తి.

సుమిత్ర ఫొటో తీసి పగలగొడతాడు. ఇక నీ జ్ఞాపకాలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదంటాడు. నీకు సాయం చేద్దామనుకున్నందుకు నా కొడుకును, కూతురుని ఒకేసారి చంపేశావ్. నీ స్నేహితుడు కూడా చనిపోయాడు. ఈ స్మశానం నుంచి వెళ్లిపోండని దక్షిణామూర్తి అంటాడు. ఇక ఇక్కడ మనకు ఎవరు లేరని సుమిత్రను తీసుకెళ్తాడు దశరథ.

బిడ్డ సాక్షిగా మాలిని శపథం

నా భర్త చావుకు కారణం ఈ సుమిత్రే అని నిందిస్తుంది మాలిని. నా కడుపున బిడ్డ సాక్షిగా చెబుతున్నాను. ఆ శివ నారాయణ కుటుంబాన్ని వదిలిపెట్టను అని మాలిని శపథం చేస్తుంది. శివ నారాయణ కోప్పడుతాడు. మీరు ఒప్పుకోనంతా మాత్రానా నిర్దోషులు కారు. నా భర్త చావుకు మీరంతా దోషులే అని మాలిని అంటుంది.

నువ్వు నిజం ఎప్పుడు ఒప్పుకున్నావ్ మాలిని. నా కూతురు చక్రాల కుర్చీకి పరిమితం అయింది. అది దాటి మేము చాలా ముందుకు వచ్చాం. నువ్వు మాత్రం నీ కొడుకును అడ్డుపెట్టుకుని పగతో తీర్చుకున్నావ్ అని శివ నారాయణ అంటాడు. అవును బాబాయ్, తన తల్లికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకున్నాడు అని మాలిని అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe